ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కొత్తపల్లి: ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి శోభారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించానని చెప్పారు. శివపురం, బావాపురం వంతెనలను నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. మండల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంపీక కావడం ఆనందంగా ఉందన్నారు.
అధికారులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, వచ్చే సర్వసభ్య సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని సూచించారు. అనంతరం నూతన ఎంపీపీ సావిత్రమ్మ మాట్లాడుతూ మండలాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. ఇందుకు అధికారులు సహకరించాలని కోరారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు ఎస్ మహబూబ్‌బాషా, ఎంపీడీవో రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డాక్టర్లు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.