MPP election
-
కోరం లేకపోయినా.. ఎంపీపీ ఎన్నిక
సాక్షి, అమరావతి: రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా మండల ప్రజాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడిన మండలాల్లో ఈ నెల 8వ తేదీన నిర్ణీత కోరం లేకపోయినా ఆ ఎన్నికలను యథావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. గత నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఎక్కడైనా ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజు 25వ తేదీన ఎన్నిక నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రంలో 21 మండలాల్లో 8 ఎంపీపీ పదవులకు, 20 మండలాల్లో ఉపాధ్యక్ష, 6 చోట్ల కో–అప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఆయా మండలాల్లో ఎన్నిక వాయిదా పడ్ద పదవులకు తిరిగి ఈ నెల 8న ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి కోరం నిబంధనలపై జిల్లా అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మొదట ఎంపీపీ.. ఆ తరువాతే ఉపాధ్యక్ష ఎన్నికలు ► ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో 8వ తేదీన నిర్ణీత కోరం లేకపోయినా నిబంధనల ప్రకారం ఎన్నికను యథావిధిగా జరుపుకోవచ్చు. అయితే ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక రెండూ నిర్వహించాల్సిన చోట మొదట ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలి. ► ఆరు మండలాల్లో కో–అప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. ఈ ఎన్నికకు మాత్రం తప్పనిసరిగా కోరం ఉండాలి. 8వ తేదీన నిర్ణీత కోరం లేక కో–అప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకపోతే.. అదే మండలంలో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక కూడా జరగాల్సి ఉంటే ఆ మండలాల్లో 9వ తేదీన కోరంతో సంబంధం లేకుండా ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరుపుకోవచ్చు. ► ఒకవేళ 8వ తేదీ కో–అప్టెడ్ సభ్యుని ఎన్నిక జరగాల్సిన మండలాల్లో ఆ పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోయినా, లేదంటే నామినేషన్లు దాఖలు చేసిన వారందరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నా, ఆ కో–అప్టెడ్ సభ్యుని ఎన్నికను పక్కనపెట్టి ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికను కోరంతో సంబంధం లేకుండా జరుపుకోవచ్చు. -
Green India Challenge: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్
-
ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
-
ఖమ్మం: టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ
సాక్షి, ములకలపల్లి(ఖమ్మం): టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంది ప్రస్తుతం మండల రాజకీయ పరిస్థితి. ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన ఎంపీపీ పీఠం కోసం ఇరుపార్టీలు ‘నువ్వా నేనా’అన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఎంపీపీ సీటు అధిరోహించి అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా ఎంపీపీ దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిసోంది. పది స్థానాల్లో కేవలం రెండు ఎంపీటీసీలను గెలుపొందిన అధికార టీఆర్ఎస్, రెండు పర్యాయాలు ఎంపీపీ ఎన్నిక నిర్వహించినా, టీడీపీకి పీఠం దక్కకుండా చేయడంలో సఫలీకృతమయింది. ప్రజాకూటమి పేరిట టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం సామూహికంగా పోటీ చేయగా, టీడీపీ మూడు స్థానాల్లో, సీపీఎం ఒక్క స్థానంతో కూటమి మొత్తం నాలుగు ఎంపీటీసీ స్థానాలను గెలుపొందింది. అధికార టీఆర్ఎస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచినా, సీపీఐతోపాటు మరో స్వతంత్య్ర అభ్యర్థి మద్దతు సాధించి, తాను నాలుగు ఎంపీటీసీ సభ్యులను కలిగిఉంది. ఈ క్రమంలో 7వ తేదీన జరిగిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి టీఆర్ఎస్ కూటమి హాజరుకాగా, టీడీపీ కూటమి గైర్హాజరవడంతో కోరంలేక వాయిదా పడింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మళ్లీ 15వ తేదీన ఎంపిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సారి టీడీపీ కూటమి హాజరుకాగా, టీఆర్ఎస్ కూటమి గైర్హాజరవడంతో రెండో ‘సారీ’ఎంపిక వాయిదా పడింది. రెండో దఫా (15వ తేదీ) కార్యక్రమానికి టీడీపీకి పూర్తి ఆధిపత్యం సాధించినట్లు వార్తలు వినిపించాయి. టీఆర్ఎస్ కూటమి నుంచి ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకున్నారని, ఇక ఎంపీపీ ఎన్నిక టీడీపీకి లాంఛనమే అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే అనూహ్యంగా టీఆర్ఎస్ కూటమిలోని నలుగురు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి హాజరుకాకపోవడం ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా కేవలం 188 ఓట్ల తేడాతో జెడ్పీటీసీ సభ్యురాలిని కోల్పోయిన టీఆర్ఎస్, ఎంపీపీ పదవిపై నజర్ వేసింది. ఇందుకుగాను అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రజాకూటమిలో నాలుగు సీట్లు పొందిన టీడీపీ మండలంలో తమ ఆధిక్యత ప్రదర్శించేందుకు విరామంలేకుండా శ్రమిస్తోంది. ఏదిఏమైనా మం డల పరిషత్ అధ్యక్షురాలి పదవికోసం ఇరుపార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు పోరాడుతున్నాయనడంలో సందేహమేలేదు. కోరం నిండాలంటే ... మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కోరం నిండాలంటే కనీసం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ ఎన్నిక సమావేశానికి హాజరుకావాలి, టీడీపీ కూటమికి నాలుగు, టీఆర్ఎస్కు నాలుగు (సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో) స్థానాలు విజయం సాధించాయి. రెండు చోట్ల గెలిచిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పార్టీ ఆదేశానుసా రం ఎన్నిక సమావేశానికి గైర్హాజరవుతూనే ఉంది. ఈ క్రమంలో ఎదుటి కూటమి నుంచి కనీసం ఒక్క ఎంపీటీసీనైనా సాధించగల్గితే, కోరంపూర్తయ్యే పూర్తవుతుంది. లేనిపరిస్థితుల్లో ఇరుపక్షా లు ఎంపిక సమావేశానికి హాజరైతే ‘టాస్’వేసి, ఎంపీపీని ఎంపిక చేస్తారు. సమావేశానికి ఐదుగురు కంటే తక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు హాజరైతే, కోరంలేక వాయిదా వేస్తారు. -
ఎంపీపీ ఎన్నిక : పోలీసుల లాఠీచార్జ్
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు టీఆర్ఎస్కు చెందిన రెండు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. క్యాంపు నుంచి నేరుగా అలంపూర్‌కు వచ్చిన ఓ వర్గం ఎంపీటీసీ సభ్యులను మరోవర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అలంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. మొదటి రోజు శుక్రవారం కోరం లేక ఎన్నిక వాయిదా పడటంతో రెండోరోజు అధికారులు ఈ ప్రక్రియను కొనసాగించారు. అలంపూర్ మండలంలోని ఆరు ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఎంపీపీ పీఠం కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఒకవర్గం బుక్కాపురం ఎంపీటీసీ సభ్యురాలు రూపాదేవిని ఎంపీపీగా ఎన్నుకోవాలని.. మరోవర్గం కాశీపురం ఎంపీటీసీ సభ్యురాలు పింజరి బేగంను ఎంపీపీని చేయాలని పట్టుబడుతున్నాయి. ఒక్కో వర్గంలో ముగ్గురు చొప్పున ఎంపీటీసీలు విడిపోయారు. కానీ కో–ఆప్షన్ ఎన్నిక తర్వాత ఒక వర్గంలో నలుగురు ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు నిర్వహించారు. మరోవర్గంలో ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే మిగిలారు. రెండోరోజు ఎంపీపీ ఎన్నికకు ఇద్దరు ఎంపీటీసీలు ఉన్న వర్గం ముందుగా చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత నలుగురు ఎంపీటీసీలు ఉన్న వర్గంలో అందరూ మహిళలు కావడంతో ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగులు ధరించారు. వీరితోపాటు మరికొందరు ముసుగులు ధరించి ఎంపీడీఓ కార్యాలయానికి ఓ వాహనంలో చేరుకున్నారు. దీంతో వారిని మరోవర్గం వారు అడ్డుకున్నారు. పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నా జెడ్పీటీసీ సభ్యురాలు షంషాద్ ఇస్మాయిల్ భర్తపై దాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేసి ఎంపీటీసీలను ఒక్కొక్కరిని లోపలికి పంపించారు. చివరకు కాశీపురం ఎంపీటీసీ సభ్యురాలు పింజరి బేగం ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా క్యాతూర్ ఎంపీటీసీ సభ్యురాలు అనురాధ ఎన్నికయ్యారు. గొడవ సమాచారం అందుకున్న ఎస్పీ లక్ష్మీనాయక్, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ అలంపూర్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
నేడు అధికారులకు విప్ల నియామక లేఖలు
సాక్షి,హైదరాబాద్: శుక్రవారం మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. 7న తొలుత కో ఆప్షన్ సభ్యుల నామినేషన్ల స్వీకారం, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత ఎంపీపీ పదవులకు ఎన్నికలుంటాయి. ఒక్కో ఎంపీపీ పరిధిలో ఒక్కో కోఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక పూర్తికాకపోతే ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు అవకాశం లేదు. ఎంపీపీ పదవులకు ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ వెబ్సైట్లో ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లను పొందుపరిచింది. ఎన్నికలు జరగనున్న మొత్తం 538 ఎంపీపీల్లో మహిళలకు 269 స్థానాలు దక్కుతాయి. నేడు విప్ల అందజేత... శుక్రవారం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు (గురువారం) ఉదయం 11 గంటలలోపు రాజకీయ పార్టీలు విప్ల నియామకానికి సంబంధించిన లేఖను, ఫామ్–ఎను ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ లేఖతోపాటు విప్ జారీచేసే వ్యక్తి గుర్తింపు కార్డుతోపాటు ఆధారిత లేఖ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పత్రాన్ని గురువారం అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి నుంచి విప్ అధికారం పొందిన వ్యక్తి ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో చేయి ఎత్తే పద్ధతిలో ఎవరికి ఓటేయాలన్న దానిపై సభ్యులకు విప్ జారీచేస్తారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జనతా దళ్, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీలకు విప్ జారీచేసే అవకాశముంది. అయితే గెలుచుకునే ఎంపీపీ స్థానాలను బట్టి ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మరో ఒకటి, రెండు పార్టీలు విప్‌ను జారీచేయవచ్చునని తెలుస్తోంది. షెడ్యూల్ ఏరియాలోని వరంగల్, ఖమ్మం జెడ్పీల పరిధిలోని బయ్యారం, గార్ల, గంగారం మండలాలను షెడ్యూల్ మండలాలుగా గుర్తించారు. గతంలో షెడ్యూల్ మం డలాలు 24 ఉండగా, సవరించిన జాబితా ప్రకారం 33కు చేరుకున్నాయి. దీంతో ఎస్సీ, బీసీలకు స్థానాలు తగ్గాయి. రిజర్వేషన్ల కోటాను ఖరారు చేస్తూ ఇదే పద్ధతిలో కోటా కేటాయించాలని ఆదేశాలిచ్చారు. మహిళల హవా... రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మహిళల జనాభా అధికంగా ఉండడంతో ఆ జిల్లాల్లో వారికి ఎక్కువ ఎంపీపీ స్థానాలు కేటాయించారు. జిల్లాల వారీగా నిజామాబాద్‌లో 51.75 శాతం, నిర్మల్‌లో 51.47, జగిత్యా లలో 51.10, కామారెడ్డిలో 50.77, మెదక్‌లో 50.67, ములుగులో 50.38, రాజన్న సిరిసిల్లలో 50.36, జయశంకర్ భూపాలపల్లిలో 50.28, సిద్దిపేటలో 50.22, భద్రాద్రి కొత్తగూడెంలో 50.09, వరంగల్ అర్బన్‌లో 50.09, కరీంనగర్లో 50.08, వికారాబాద్‌తో 50.01 శాతంగా మహిళలున్నట్లు ఎస్ఈసీ రికార్డులను బట్టి తెలుస్తోంది. అదే విధంగా 17 జిల్లాల్లో సగటున 49.96 శాతం నుంచి 49.22 శాతంలో, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో 48.88 శాతం మహిళలు ఉన్నట్టు రిజర్వేషన్ల జాబితాలో ప్రకటించారు. -
జెడ్పీ, ఎంపీపీ ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దరిమిలా అవి ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పా ట్లు చేస్తోంది. వచ్చే మే నెలాఖరులోగా మండ ల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ ప్రతిపాదనలు స మర్పించింది. వచ్చే జూలై 3, 4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీల కాల పరిమితి ముగియ నుండటంతో, ఆవెంటనే కొత్త ఎంపీపీలు, జెడ్పీ పీలు ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితాల తయారీ.. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగినా, పాత 9 జిల్లా పరిషత్‌లు, వాటి పరిధిలోని మండల పరిషత్‌ల కాలపరిమితి ముగియకపోవడంతో వాటి విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో 30 రెవెన్యూ జిల్లాలు (పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ మినహాయిం చి), 535 గ్రామీణ మండలాల (50 వరకు పట్టణ స్వరూపమున్న రెవెన్యూ మండలాలు మినహా) ప్రాతిపదికగా జెడ్పీలు, ఎంపీపీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. 25 లోగా ప్రతిపాదనలు.. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ఈ ప్రతిపాదనలను ఈనెల 25 లోగా పూర్తి చేసి పంపాలని సూచించింది. ఈ ఎన్నికల్లో 2019 జనవరి 1 నాటికి ఓటర్ల జాబితాలో ఉన్న వారి ని ఓటర్లుగా పరిగణిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాకు అనుగుణంగా జిల్లా, మండల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. మరో రెండు కొత్త జిల్లాలను, నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటి ఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో వాటినీ తుది జాబితాలో చేర్చే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరులోగా రిజర్వేషన్లు.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధిం చిన రిజర్వేషన్ల ఖరారును వచ్చే నెలాఖరులోగా పూర్తిచేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీలకు అమలు చేసినట్లు రెం డు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జెడ్పీ, ఎంపీపీల రిజర్వేషన్ల విధానం ఖరారు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లే బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌లు విని యోగించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. మే లో ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ జారీచేసే అవకాశాలున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నివేదికలకనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో ని ర్వహించే విషయంపై ఎస్ఈసీ యోచిస్తోంది. -
'అనంత'లో పోలీసుల అత్యుత్సాహం
-
'అనంత'లో పోలీసుల అత్యుత్సాహం
అనంతపురం: అనంతపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇవాళ కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికను కవరరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 8 కిలో మీటర్ల ముందే సాక్షి వాహనాన్ని ఎలా ఆపుతారంటూ ఎస్పీ రాజశేఖర్ బాబును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిళ్ల పల్లి దగ్గర ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. 2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనగానపల్లి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలను వైఎస్ఆర్ సీపీ, ఐదు స్థానాలను టీడీపీ దక్కించుకున్నాయి. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఎలక్కుంట్ల ఎంపీటీసీ సభ్యుడు బిల్లే రాజేంద్రను ఎంపీపీ చేశారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే బిల్లే రాజేంద్రను ఆ పదవిలో కొనసాగించడం ఇష్టంలేని పరిటాల వర్గీయులు ఇటీవల ఆయనపై ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా రాజీనామా చేయించారు. తెరపైకి తమ సామాజిక వర్గానికి చెందిన ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు పద్మగీతను తీసుకొచ్చారు. బలహీన వర్గాలపై అణచివేతను నిరసిస్తూ రాజేంద్రతో పాటు వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, కనగానపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఏడుగురు ఎంపీటీసీలతో ముందంజలో ఉండగా, టీడీపీ నలుగురు ఎంపీటీసీలతో వెనకంజలో ఉంది. -
నేడు ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక
-
‘ముంపు’ ఎన్నికలకు నోటిఫికేషన్
భద్రాచలం: ఖమ్మం జిల్లా నుంచి ఏపీకి బదలాయించిన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో ఎంపీపీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముంపు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన ఎన్నికల కమిషన్, ఆ బాధ్యతలను ఏపీ అధికారులకే అప్పగించింది. ఈ మేరకు తూర్పుగోదావరి జెడ్పీ సీఈవో మూడు మండలాల్లో ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తూ ఎంపీడీవోలకు లేఖలు పంపారు. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న తాము ఎన్నికలు నిర్వహించబోమని ఆ అధికారులు తిరస్కరించారు. దీంతో ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ నేరుగా రంగంలో దిగి తమ ఆదేశాలను తిరస్కరించిన అధికారులపై గట్టిగా స్పందించారు. ఆయా అధికారులకు మరోసారి ఆదేశాలివ్వాలని, అప్పటికీ అంగీకరించకుంటే కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు తూర్పుగోదావరి అధికారులతో ఎన్నికలు పూర్తి చేయించాలని ఆ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఖమ్మం జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు నో హైదరాబాద్: బుధ, గురు వారాల్లో జరగనున్న ఖమ్మం జిల్లా జెడ్పీ, ఎంపీపీ ఎన్నికలను నిలిపివేయడానికి సోమవారం హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైనందున, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా, పెద్దగోపతికి చెందిన వి.నారాయణరావు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. -
‘దేశం’ మోసం
ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతం మాడుగుల ఎంపీపీ ఎన్నికలో టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. పీఠాన్ని దక్కించుకోడానికి వైఎస్ఆర్సీపీ సభ్యులకు ప్రలోభాలకు గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీటీసీలను టీడీపీ కొనుగోలు చేసి తమ వైపునకు తిప్పుకుంది. ఇక్కడ 21 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 8, కాంగ్రెస్ ఒకటి దక్కించుకున్నాయి. వైఎస్సార్సీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ ఈ మండల అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోడానికి భారీగా డబ్బులు వెదజల్లింది. దీంతో చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ముగ్గురు ఆ పార్టీకి మద్దతు పలికారు. ఈమేరకు ఇరు పార్టీల వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఎంపీపీగా ఓండ్రు గంగమ్మ, ఉపాధ్యక్షుడిగా పెరుమాళ్ల వెంకటరావు ఎన్నికయ్యారు. విశాఖ రూరల్: జిల్లాలో వాయిదా పడిన నాలుగు మండలాల ఎంపీపీ ఎన్నికల్లో మూడిం టిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా వి.మాడుగుల మినహా చింతపల్లి, అరకు, డుంబ్రిగుడలలో విజయం సాధించింది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో కోరం లేక, కో-ఆప్షన్‌సభ్యుడి నామినేషన్ నిర్ణీత సమయంలో దాఖలు చేయకపోవడం,తదితర కారణాలతో నాలుగు మండలాల ఎంపీపీ ఎన్నికలు నిలిచిపోయాయి. ఎన్నికల కమి షన్ ఆదేశాల మేరకు ఆదివారం గట్టి పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించారు. తొలుత ఎంపీటీసీ సభ్యులతో రిటర్నింగ్ అధికారులు ప్రమాణస్వీకారం చేయించాక, కో-ఆప్షన్ సభ్యులను ఆయా మండలాల్లో ఎన్నుకున్నారు. అనం తం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. డుంబ్రిగుడలో ఏకపక్షం డుంబ్రిగుడ ఎంపీపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ దక్కించుకుంది. ఎంపీపీగా వంతల జమున, ఉపాధ్యక్షుడిగా పాపారావు ఎన్నికయ్యారు. మండలంలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ ఏడింట గెలుపొందింది. టీడీపీకి 3, స్వతంత్రలు నలుగురు విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీకి స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు మద్దతు పలికారు. దీంతో వైఎస్ఆర్సీపీకి ఎంపీపీ పదవి దక్కింది. అరకులో ఒప్పందం అరకు ఎంపీపీ పీఠం ఎన్నిక ఉత్కంఠకు దారితీసింది. ఇక్కడ 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 8 స్థానాలను దక్కించుకున్నాయి. హంగ్ ఏర్పడడంతో టాస్ వేయాలని అధికారులు భావించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు ఇరుపార్టీల సభ్యులతో చర్చించి రెండున్నరేళ్లు చొప్పున ఎంపీపీ పీఠాన్ని పంచుకోవాలని ఒప్పందం కుదిర్చారు. తొలుత వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఎంపీపీగాను, తరువాత టీడీపీ అభ్యర్ధి పనిచేసేలా అంగీకారానికి వచ్చారు. దీంతో అరకులోయ ఎంపీపీగా వైఎస్సార్సీపీ మాడగడ-2 ఎంపీటీసీ కార్తికో అరుణ కుమారి ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా టీడీపీకి చెందిన పెదలబుడు-వన్ ఎంపీటీసీ పి. అమ్మన్నను ఎన్నుకున్నారు. చింతపల్లి వైఎస్ఆర్సీపీ సొంతం చింతపల్లి ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ 11 స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ 5, టీడీపీ 2, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన తమ్మంగులఎంపీటీసీ వంతాల చిలకమ్మ మృతితో సభ్యుల సంఖ్య 19కి తగ్గింది. వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో ఎంపీపీగా కవడం మత్స్యమ్మ ఎన్నికయ్యారు. వైఎస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన కె.లక్ష్మిని సభ్యులు ఎన్నుకున్నారు. -
హోరాహోరీగా ఎంపీపీ ఎన్నికలు
జిల్లా పరిషత్ : మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు రెండో విడత ఆదివారం ఆరు మండలాలకు జరిగిన ఎన్నికల్లో మళ్లీ రెండు మండలాలు వాయిదా పడ్డాయి. జిల్లాలో 50 మండలాలకు గాను కోర్టు విచారణలో ఉన్న మంగపేట మినహా 49 మండలాల్లో ఈనెల 4న ఎంపీపీల ఎన్నిక నిర్వహించారు. ఇందులో వివిధ కారణాలతో ఆరు మండలాలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాలకు ఆదివారం ఎన్నిక లు నిర్వహించగా హన్మకొండ, మహబూబాబాద్ ఎంపీపీల ఎన్నిక కోరం లేని కారణంగా మళ్లీ వాయిదా పడ్డాయి. మానుకోటతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా ఎంపీపీ పదవికి రెండు వర్గాలు పోటీ పడడంతో గొడవ జరిగి ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. మానుకోటలో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీలను టీఆర్ఎస్ నాయకులు ఎత్తుకెళ్లడం.. ఒక ఎంపీటీసీ సభ్యురాలి కారు ధ్వంసం చేయడం.. పోలీసుల లాఠీచార్జ్‌తో గందరగోళ పరిస్థితి ఎదురైంది. చివరకు కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పం డింది. ఇప్పటి ఎన్నికలు పూర్తయిన మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్-16, కాంగ్రెస్-20, టీడీపీ-7, స్వతంత్రులు-3, న్యూడెమోక్రసీ-1 ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్, టీడీపీలు ఎంపీపీ పదవులకు మద్దతు ఇచ్చి ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకున్నాయి. దీంతో పూర్తి మెజార్టీ లేకున్నా అదనంగా కొన్ని మండలాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. తాజాగా వాయిదా పడిన హన్మకొండ, మహబూబాబాద్ మండలాల్లో ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. నల్లబెల్లిలో.. నల్లబెల్లి మండలంలో పార్టీలన్నీ ఏకమై ఎంపీ పీ, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన టీఆర్ఎస్లో చేరిన ఎంపీటీసీ సభ్యుడు బానోతు సారంగపాణి, టీఆర్ఎస్కు చెందిన పాలెపు రాజేశ్వర్‌రావు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వెంకటాపూర్‌లో.. వెంకటాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో ఆదే పార్టీకి చెందిన మేకల పద్మ ఎంపీపీగా, ఉపాధ్యక్షుడిగా చక్రారపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. జనగామలో.. జనగామ మండలంలో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్ రెబల్ బైరగోని యాదగిరిగౌడ్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయన ఎంపీపీగా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దాసరి రవి ఓటమి పాలయ్యారు. వైఎస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన బడికె ఇందిర ఎన్నికయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉత్కంఠ.. స్టేషన్ఘనపూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి ఆ పార్టీలోని ఇద్దరు నాయకులు పోటీ పడ్డారు. పార్టీ వారికి బీ-ఫాం ఇవ్వకపోవడంతో ఇరువు రూ ఇతర పార్టీల మద్దతులో రంగంలోకి దిగా రు. ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో అందులో ఎంపీపీగా వంగాల జగన్మోహన్రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బూర్ల లత ఎన్నికయ్యారు. వీరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ అధికారులు ఇండిపెండెంట్లుగా గుర్తించారు. హన్మకొండలో.. హన్మకొండ మండలంలో కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. ఇద్దరూ వేర్వేరు పార్టీల వారుకావడం.. ఇరువురూ ఎంపీపీ పదవికి పోటీ పడుతుండడంతో ఎన్నికల ప్రక్రియ జరి పేందుకు వీలు కాకుండా పోయింది. ఎంపీపీగా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఒకరు ప్రతిపాదించాలి, మరోకరు బలపర్చల్సి ఉంటుంది. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిపేందుకు అధికారులు ప్ర యత్నించినా కుదరలేదు. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగకపోవడంతో మరోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. కోరం లేని కారణంగా ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు ఇవ్వాల ని జెడ్పీ అధికారులు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అక్కడ నుంచి స్పష్టత వస్తేనే ఎంపీపీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. మానుకోటలో ఉద్రిక్తత మహబూబాబాద్ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటీ పడడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మండలంలో 17 ఎంపీ టీసీ స్థానాలుండగా కాంగ్రెస్-9, టీఆర్ఎస్-5, టీడీపీ-3 గెలుచుకున్నాయి. ఆదివారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీటీసీలను టీఆర్ఎస్ నాయకులు ఎత్తుకెళ్లడంతోపాటు ఒకరిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. శనిగపురం ఎంపీటీసీ ఉపేంద్రమ్మ (టీఆర్ ఎస్) రాకతో మొదలైన గొడవ, ఆమె కారు ధ్వంసంతో తీవ్రస్థాయికి చేరుకుంది. తోపులాట, వాగ్వాదాలతో ఆ ప్రాతం అట్టుడికి పోయింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చిం ది. ఈ నేపథ్యంలో కోరం లేక కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగలేదు. దీంతో ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. -
‘దేశం’ గూండాగిరి
* గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తరహా దాడులు * ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలపై దారి కాచి దాడులు * గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు గాయాలు * ఎంపీటీసీలు, బంధువులను కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు * నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో తారస్థాయికి అధికార పార్టీ ఆగడాలు * నెల్లూరు జిల్లాలో కోరం ఉన్నా... కోరం లేదంటూ ఎన్నిక వాయిదా * ఓ జెడ్పీటీసీ సభ్యురాలికి ఎస్పీ బెదిరింపులు.. ఓటేయలేనని వెళ్లిపోయిన సభ్యురాలు * సీఎం పేషీ జోక్యంతో ఎన్నికలను వాయిదా వేసిన కలెక్టర్.. పరిశీలకుడి ప్రేక్షక పాత్ర * ప్రకాశం జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికకు వెళ్తున్న జెడ్పీటీసీ అరెస్టు * నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో తారస్థాయికి అధికార పార్టీ ఆగడాలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బరితెగించారు. తమ పార్టీకి మెజార్టీ లేని జెడ్పీలు, ఎంపీపీలను కూడా చేజిక్కించుకోవడానికి అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులను బెదిరించి, ప్రలోభపెట్టి లోబరుచుకునే యత్నం చేస్తున్నారు. ఆటలు సాగని చోట దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని పేట్రేగిపోతున్నారు. ఈ నెల 5న జరిగిన జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ఆగడాలకు కొన్ని స్థానాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. వాటికి ఆదివారం తిరిగి ఎన్నికలు జరిగాయి. ఈసారి టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. అధికారులు, పోలీసులూ వారికి వత్తాసు పలికారు. దీంతో ఏకంగా భౌతిక దాడులకే టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. గుంటూరు జిల్లాలో ఫ్యాక్షన్ తరహాలోనే వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు కాపు కాసి మరీ దాడులకు దిగాయి. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు, ఎమ్మెల్యే ముస్తఫా, అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. నలుగురు ఎంపీటీసీలను, వారి బంధువులను కిడ్నాప్ చేశారు. వీరిలో ముగ్గురు మహిళా ఎంపీటీసీలు కూడా ఉన్నారు. వారిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి తమ వాహనాల్లో పడేసి తీసుకెళ్లారు. వీరిలో ఓ ఎంపీటీసీని సమావేశ మందిరానికి తీసుకొచ్చి, తమ పార్టీ ఎంపీటీసీని అధ్యక్షురాలిని చేసుకోగలిగారు. ఆ తర్వాత ఆ ఎంపీటీసీ ఇంటికెళ్లిపోతానని చెప్పినా వినకుండా వారి వెంటనే తీసుకెళ్లారు. ఈ దాడుల వెనుక శాసన సభ స్పీకర్ కోడెల కుమారుడు శివరామకృష్ణ హస్తముందన్న ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఏడుగురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలను లోబరచుకోవడమే కాకుండా, ఎస్పీ చేత ఓ మహిళా జెడ్పీటీసీని బెదిరించారు. దీంతో ఆమె ఓటు వేయలేనని వెళ్లిపోయారు. అయినా సీఎం పేషీ కల్పించుకొంది. ఎస్పీ, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి ఎన్నికలనే వాయిదా వేయించింది. ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు వస్తున్న ఓ జెడ్పీటీసీని పోలీసులతో అరెస్టు చేయించారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం- నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
కొత్తపల్లి: ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి శోభారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించానని చెప్పారు. శివపురం, బావాపురం వంతెనలను నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. మండల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంపీక కావడం ఆనందంగా ఉందన్నారు. అధికారులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, వచ్చే సర్వసభ్య సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని సూచించారు. అనంతరం నూతన ఎంపీపీ సావిత్రమ్మ మాట్లాడుతూ మండలాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. ఇందుకు అధికారులు సహకరించాలని కోరారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు ఎస్ మహబూబ్‌బాషా, ఎంపీడీవో రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డాక్టర్లు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్
-
15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్
వరంగల్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీపీ పీఠం పోటాపోటీ నెలకొంది. నేడు స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఎన్నిక కోసం వస్తున్న 15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్ కు గురయ్యారు. జనగామ మండలం పెంబర్తి వద్ద ప్రత్యర్థి వర్గం దాడి చేసి వీరిని అపహరించినట్టు చెబుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యం సాధించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీల కిడ్నాప్ జరిగినట్టు చెబుతున్నారు. -
పచ్చనోట్ల ప్రవాహం
- కుర్చీ కోసం లక్షలు కుమ్మరింపు - ఎంపీపీ ఎన్నికల్లో భారీగా చేతులు మారిన నగదు - మండలాల నిధులతో సమానంగా ఖర్చు - నేడు ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నిక మచిలీపట్నం : టీడీపీ నేతల అధికారదాహానికి పచ్చనోట్ల కట్టలు తెగాయి. తమకు బలం లేకపోయినా ఎంపీటీసీ సభ్యులను కొనుగోలుచేసి ఎంపీపీ పదవులను చేపట్టేందుకు బరితెగించారు. ఎంత ఖర్చు చేసైనా పదవులను చేపట్టేందుకు వెనుకాడలేదు. ప్రజాతీర్పును పరిహాసం చేస్తూ పచ్చనోట్లు కుమ్మరించారు. అధికారబలం చూపించారు. ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తమకు మెజారిటీ లేని మండలాలను కూడా చేజిక్కించుకున్నారు. మండలాల్లో తమ పట్టు నిలుపుకొనేందుకు ముఖ్య నేతలు సైతం తమవంతు సాయం అందించారు. ఈ ప్రక్రియలో జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేశారు. అసాధ్యమైన చోట అనవసర రాద్దాంతం చేసి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలను వాయిదా వేయించారు. - పెడన మండల ఆదాయం ఏడాదికి కేవలం రూ.9 లక్షలు. టీడీపీ మండల నాయకుడు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిని తమవైపునకు తిప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ విప్ జారీచేస్తే అనర్హత వేటు పడినా మళ్లీ గెలిపించే బాధ్యత తమదని సదరు నాయకుడు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. - మొవ్వ మండలంలో సంవత్సర ఆదాయం రూ.9.5 లక్షలు. ఇక్కడ తమకు మెజారిటీ లేకపోయినా ఎంపీపీ పదవిని దక్చించుకునేందుకు టీడీపీ నేతలు రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. - పెదపారుపూడి మండల సంవత్సర ఆదాయం కేవలం రూ.5 లక్షలు మాత్రమే. ఇక్కడ వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ ఎలాగైనా ఎంపీపీ పదవిని పొందాలని భావించిన టీడీపీ నాయకులు ముగ్గురు ఎంపీటీసీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చొప్పున నగదు అందజేసినట్లు తెలిసింది. - అవనిగడ్డ మండలంలోనూ ముగ్గురు వైఎస్సార్ సీపీ సభ్యులను ఓ కీలక నేత మభ్యపెట్టి టీడీపీకి అనుకూలంగా ఓటువేసేలా చేశారు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో నగదు చేతులు మారినట్లు స్థానికులు చెబుతున్నారు. - వీరులపాడు మండల సంవత్సర ఆదాయం రూ.10 లక్షలు. ఇక్కడ వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ నేతలు భారీ మొత్తంలో ఖర్చుచేసి ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. ఎంపీపీగా ఎన్నికైన పాటిబండ్ల జయపాల్ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి దగ్గరి బంధువు. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలికి రూ.10 లక్షలకుగా ముట్టజెప్పి తమకు అనుకూలంగా ఓటు వేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌కు కూడా పెద్ద మొత్తంలో నగదు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. - బాపులపాడు మండల సంవత్సర ఆదాయం రూ.60 లక్షలు. ఈ మండలంలో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు పార్టీ ఫిరాయించేందుకు టీడీపీ నాయకులు ఖర్చు చేసిన నగదు దాదాపు రూ.45 లక్షలు. ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు గానూ ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు చొప్పున అందజేశారని సమాచారం. ఎమ్మెల్యే వంశీ మోహన్ ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపినట్లు సమాచారం. -
దేవరపల్లిలో ‘దేశం’ దొంగాట
ఏలూరు: అధికారదాహంతో తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అధికారం దక్కకుండా చేయాలని అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిషత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ ఎంపీపీ పదవిని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేసిన ఆ పార్టీ నేతలు ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లోనూ శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వాన్ని, అల్లరి మూకలను ఆరోజు దేవరపల్లి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రయత్నాలనూ అడ్డుకుంటున్నారు. ఇదీ జరిగింది దేవరపల్లి మండల పరిషత్‌లో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 12 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన పెనుబోతుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ పదవికి గన్నమని జనార్దనరావు పోటీకి దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల్ని భయపెట్టో, ప్రలోభపెట్టో తమవైపు తిప్పుకొని ఎంపీపీ పదవి దక్కించుకోవాలని టీడీపీ పథకం వేసింది. ఈ కుతంత్రాలకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు లొంగలేదు. ఈనెల నాలుగున ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. టీడీపీ శ్రేణులు ఆ రోజున దేవరపల్లిలో అరాచకం సృష్టించాయి. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల సభ్యులపై దౌర్జన్యానికి దిగటమేగాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామారావుపైనా దాడిచేశారు. దీంతో ఎన్నికల్ని ఆపేసిన ఎన్నికల సంఘం.. అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. మళ్లీ ఈనెల 13న ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించటంతో ఆరోజున మళ్లీ దౌర్జన్యాలకు పాల్పడాలని టీడీపీ కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని, లేకపోతే శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం మంత్రులు కూడా అక్కడే మకాం వేయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలు సక్రమంగా జరిగేలా రక్షణ కల్పించాలని వైఎస్సార్ సీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. టీడీపీకి కొమ్ముకాస్తున్న అధికారులు దేవరపల్లిలో ఈనెల 4న జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు టీడీపీకి చెందిన వారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని పోలీసు అధికారులు వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆరుగురిలో ఎంపీపీ అభ్యర్థి కుమారుడు గన్నమనేని వెంకటేశ్వరావు, వైఎస్సార్ సీపీ నేత కొఠారు దొరబాబులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వారు బుధవారం బెయిల్ తీసుకోవడానికి కోర్టుకు వెళితే అక్కడా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆవరణలో నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమ హక్కులకు భంగం కలిగించిన కొవ్వూరు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలపై బాధితులు గురువారం ఎస్పీకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. కోర్టు ఆవరణలో పోలీసుల దౌర్జన్యాన్ని న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు. జిల్లా జడ్జికి, సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం వారంతా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఆందోళన చేయనున్నారు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు తమ ప్రాణాలకు భద్రత, హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దేవరపల్లి మండల పరిషత్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోమని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో పొటీచేసే అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. అయితే.. అధికారం అండతో ఎవరినీ లెక్కచేయకుండా దాడులకు తెగబడుతున్న టీడీపీ వారు ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఏ అరాచకం సృష్టిస్తారోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
రాజధానికి.. చిట్యాల ఎంపీపీ లొల్లి
సాక్షిప్రతినిధి, నల్లగొండ :చిట్యాల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక పంచాయితీ చినికి చినికి గాలివానగా మారుతోంది. ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గానే తీసుకుంది. ఆ రోజు జరిగిన సంఘటనలపై మంగళవారం కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు రాజధానిలో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నిక రోజు గొడవలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల కటింగులను, వీడియో క్లిప్పింగులను వారు డీజీపీ, ఎన్నికల కమిషనర్‌కు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జె.గీతారెడ్డి, మల్లు రవి, డి.కె.అరుణ, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి సహా ఎంపీటీసీ సభ్యులు వారిని కలిశారు. ఇదీ.. జరిగిందిచిట్యాలలో ఈ నెల 5వ తేదీన జరిగిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనచరులతో ఎన్నిక కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆయనతోపాటు సుమారు 20మంది ఆయన అనుచరులు ఎంపీడీఓ కార్యాలయంలోకి వచ్చారు. వీరితోపాటు టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి కూడా ప్రవేశించి కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రుద్రారపు భిక్షంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సమయంలో భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మెల్యే వీరేశం మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో ఎంపీడీఓ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారు. సమావేశ మందిరంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు కల్లూరి మల్లారెడ్డిపై దాడి జరిగింది. దీంతో కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు చెల్లాచెదురయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, టీడీపీ చెందిన ముగ్గురు ఎంపీటీసీలతో ఎన్నిక నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. కోరం లేదని ఎన్నికల అధికారి గంగాధర్, ఎంపీడీఓ రాఘవేంద్రరావు ఆభ్యంతరం తెలిపారు. దీంతో చిన్నకాపర్తి ఎంపీటీసీ రుద్రారపు భిక్షం (కాంగ్రెస్)ను బలవంతంగా ఎన్నిక సమావేశంలో కూర్చోబెట్టారు. ఆనంతరం ఎంపీడీఓ గది వద్ద ఉండిపోయిన ఇద్దరు మహిళ కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు మెండె సుజాత, బండ గిరిజలను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఈ పెనుగులాటలో కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు గిరిజ కిందపడిపోయింది. భయపడిపోయిన ఆమె ఎన్నికలో పాల్గొంటానని సమావేశ మందిరానికి చేరుకున్నారు. అనంతరం టీఆర్ఎస్, టీడీపీ చెందిన ఆరుగురు ఎంపీటీసీలతోపాటు కాంగ్రెస్ చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. అది కూడా ఎన్నిక సమయం దాటిపోయాక కలెక్టర్ అనుమతితో ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నిక జరిగిన ఆనంతరం ఎంపీడీఓ కార్యాల యంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన కాం గ్రెస్ నాయకులపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఎన్నిక గొడవల్లో ఎమ్మెల్యే వీరేశంతో పాటు పలువురిపై కేసులు పెట్టారు. ఇవీ... కేసులు తన విధులకు ఆటంకం కలిగించారని భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే వేముల వీరేశం, టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. తనపై దాడి చేసి చెయ్యి విరగొట్టారని డీఎస్పీ గన్‌మన్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే వీరేశం, టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డిపై కేసు నమోదైంది.తనను కొట్టి, మానసికంగా వేధించి, అవమానించారని కాంగ్రెస్‌కు చెందిన చిట్యాల-3 ఎంపీటీసీ సభ్యురాలు మెండె సుజాత ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డి, దుబ్బాక సతీష్‌రెడ్డిలపై మరో కేసు నమోదైంది. తమపై దాడి చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్యాల-1ఎంపీటీసీ సభ్యురాలు జిట్ట పద్మ, చిట్యాల-5 ఎంపీటీసీ సభ్యురాలు గంటెపాక ప్రేమలతలు ఎమ్మెల్యే వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ సంఘటనలపై సోమవారం ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఐజీ శశిధర్‌రెడ్డిలు ఎన్నికల రోజు విధులలో పాల్గొన్న ఎంపీడీఓ గంగాధర్, మండల ప్రత్యేకాధికారి గంగాధర్, పోలీసులను విచారణ చేశారు. కాగా, తాజాగా కాంగ్రెస్ నేతలు డీజీపీకి, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డి రిమాండ్ చిట్యాల: చిట్యాలలో ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రామన్నపేట కోర్డులో రిమాండు చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యే
చిట్యాల : చిట్యాల ఎంపీపీ ఎన్నిక సమయంలో దౌర్జన్యంగా వ్వవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఎంపీపీ ఎన్నిక అక్రమమని నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల బంద్ చేపట్టారు. అనంతరం నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే వీరేశాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి మహిళ ఎంపీటీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఆదేరోజు తనపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడిచేసేందుకు ప్రయత్నించారన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. ఎంపీపీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎస్పీ ప్రభాకర్‌రావుకు జరిగిన సంఘటనను వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కందిమళ్ళ శిశుపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శేపూరి యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ కందిమళ్ళ జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మెండె సుజాత, గుడిపాటి లక్ష్మీ, బండ గిరిజ, జిట్ట పద్మ, ఇబ్రహీం, బండ క్రిష్టయ్య, మెండె సైదులు, బొబ్బల శివశంకర్‌రెడ్డి, కామాటి లింగయ్య, రుద్రారపు శ్రీను పాల్గొన్నారు. -
ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా
ఏలేశ్వరం : ఏలేశ్వరం ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. టీడీపీ ఎంపీటీసీ సభ్యులు రెండో రోజు శనివారం కూడా ఎన్నికకు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రిసైడింగ్ అధికారి ఏడీవీ ప్రసాద్, ఎన్నికల అధికారులు ఎ.రమణారెడ్డి, వి.రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, కో ఆప్షన్‌సభ్యుడు సుమారు గంట సేపు వేచిచూసినప్పటికీ టీడీపీ సభ్యులు రాకపోవడంతో కోరం లేకపోవడం వల్ల ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయం ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని, వారి అనుమతితో మూడునెలలలోగా మళ్లీ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. వైఎస్సార్ సీపీ సభ్యుల బైఠాయింపు ఎంపీపీ ఎన్నికలో టీడీపీ వైఖరిని నిరసిస్తూ పోడియం వద్ద వైఎస్సార్ సీపీ సభ్యులు బైఠాయించారు. ఎంపీపీ ఎన్నికకు హాజరు కాకుండా టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పార్టీ విప్ బీశెట్టి వెంకటరమణ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అక్కడకు రాగా ఎన్నిక వాయిదా పడినట్టు అధికారులు తెలిపారు. దాంతో ఆయన ఎంపీటీసీ సభ్యులతో కలిసి లింగంపర్తి వె ళ్లారు. జ్యోతుల వెంట పార్టీ నేతలు వరుపుల సూరిబాబు, వరుపుల రాజబాబు తదితరులు ఉన్నారు. ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు బందోబస్తు నిర్వహించారు. -
కీసర ఎంపీపీ ఎన్నిక వాయిదా
కీసర: కీసర మండల మండలాధ్యక్షుడి ఎన్నిక నాటకీయ పరిణామల మధ్య శుక్రవారం వాయిదా పడింది. మండల పరిషత్‌లో 20 ఎంపీటీసీ సభ్యులకు 15 మంది మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిని ఎకగ్రీవంగా ఎంపిక చేయడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా విఫలమైంది. సీల్డ్‌కవర్ ద్వారా ప్రతిపాదించబడ్డ అభ్యర్థి రామారం సుజాతకు వ్యతిరేకంగా పార్టీ విప్‌ను ధిక్కరిస్తామని, ఎంపీపీ అభ్యర్థిగా యాద్గార్పల్లి ఎంపీటీసీ మల్లేష్‌కు మద్దతు ఇస్తామని దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు, అహ్మద్గూడా గ్రామానికి చెందిన ఇద్దరు, కీసర-3 ఎంపీటీసీలు ప్రకటించారు. మరోవైపు ఎంపీపీ పదవిని ఆశించిన మరో ఎంపీటీసీ గోధుమకుంట ఎంపీటీసీ మంచాల పెంటయ్య, చీర్యాల ఎంపీటీసీ సంగీత సైతం కొమ్ము మల్లేష్‌కు మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందనుకుంటుడగా బోగారం ఎంపీటీసీ మారారం సుజాత వెళ్లిపోయారు. తనను ఎంపీపీగా చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు మాట తప్పిందని నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అక్కడున్న వారికి ఫోన్ ద్వారా సమాచారమందించారు. దీంతో కంగారు పడ్డ పార్టీ నేతలు ఎట్టకేలకు రామారం సుజాతను తిరిగి మండల పరిషత్‌కు తీసుకువచ్చారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై పార్టీలో తిరిగి వాదోపవాదాలు జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జి తోట కూర జంగయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల చంద్రారెడ్డి తదితరులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యారు. ఎంపీపీ ఎన్నిక వాయిదా పడేలా కోరం లేకుండా చూసుకున్న టీడీపీ నేతలు అక్కడి నుంచి ఎంపీటీసీలను తిరిగి క్యాంప్‌నకు తరలించారు. ఎన్నిక నేటికి వాయిదా.. కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నికను శనివారం నాటికి వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికి విద్య, ఎంపీడిఓ నిరంజన్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి కోరం సభ్యులు ఉంటే సమావేశాన్ని నిర్వహిస్తామని, అది కూడా వీలుకాని పక్షంలో ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించి, వారి ఆదేశాల మేరకు తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీలు.. కీసర మండలంలో 20 మంది ఎంపీటీసీలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకాధికారి విద్య ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కో ఆప్షన్ సభ్యుడిగా మహ్మద్‌గౌస్.. మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్‌గా దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ఎండి.గౌస్ ఎన్నికయ్యారు. -
ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నికను అడ్డుకునేందుకు కుట్ర
విజయవాడ : మండల పరిషత్ పీఠాలు దక్కించుకోవటానికి అధికార తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు కొనసాగిస్తూనే ఉంది. గెలుపు అవకాశం లేని కొన్ని మండలాల్లో తెరచాటు రాజకీయాలు సాగిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదరింపులకు దిగటం, కొందరిని ఆర్థికంగా ప్రలోభాలకు గురి చేయటం, మరికొందరిని ఓటింగ్‌కు రాకుండా చేస్తూ పల్లె రాజకీయాలను కలుషితం చేస్తోంది. ప్రధానంగా ఆపార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం సాగుతోంది. తాజాగా కృష్ణాజిల్లా ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నికను అడ్డుకునేందుకు తెలుగు దేశం పార్టీ కుట్ర చేస్తోంది. టీడీపీ పార్టీ తన సభ్యులను కనపడకుండా చేసి...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడికి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ శుక్రవారం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ద్వారా ఎన్నికను ఆపడానికి టీడీపీ యత్నిస్తోంది.