హోరాహోరీగా ఎంపీపీ ఎన్నికలు | again two mandals mpp elections are postponed | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఎంపీపీ ఎన్నికలు

Published Mon, Jul 14 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

హోరాహోరీగా ఎంపీపీ ఎన్నికలు

హోరాహోరీగా ఎంపీపీ ఎన్నికలు

జిల్లా పరిషత్ : మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు రెండో విడత ఆదివారం ఆరు మండలాలకు జరిగిన ఎన్నికల్లో మళ్లీ రెండు మండలాలు వాయిదా పడ్డాయి. జిల్లాలో 50 మండలాలకు గాను కోర్టు విచారణలో ఉన్న మంగపేట మినహా 49 మండలాల్లో ఈనెల 4న ఎంపీపీల ఎన్నిక నిర్వహించారు. ఇందులో వివిధ కారణాలతో ఆరు మండలాలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాలకు ఆదివారం ఎన్నిక లు నిర్వహించగా హన్మకొండ, మహబూబాబాద్ ఎంపీపీల ఎన్నిక కోరం లేని కారణంగా మళ్లీ వాయిదా పడ్డాయి. మానుకోటతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయి.
 
 స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా ఎంపీపీ పదవికి రెండు వర్గాలు పోటీ పడడంతో గొడవ జరిగి ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. మానుకోటలో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీలను టీఆర్‌ఎస్ నాయకులు ఎత్తుకెళ్లడం.. ఒక ఎంపీటీసీ సభ్యురాలి కారు ధ్వంసం చేయడం.. పోలీసుల లాఠీచార్జ్‌తో గందరగోళ పరిస్థితి ఎదురైంది. చివరకు కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పం డింది. ఇప్పటి ఎన్నికలు పూర్తయిన మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్-16, కాంగ్రెస్-20, టీడీపీ-7, స్వతంత్రులు-3, న్యూడెమోక్రసీ-1 ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్, టీడీపీలు ఎంపీపీ పదవులకు మద్దతు ఇచ్చి ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకున్నాయి. దీంతో పూర్తి మెజార్టీ లేకున్నా అదనంగా కొన్ని మండలాలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి చేరాయి. తాజాగా వాయిదా పడిన హన్మకొండ, మహబూబాబాద్ మండలాల్లో ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.
 
నల్లబెల్లిలో..
నల్లబెల్లి మండలంలో పార్టీలన్నీ ఏకమై ఎంపీ పీ, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీటీసీ సభ్యుడు బానోతు సారంగపాణి, టీఆర్‌ఎస్‌కు చెందిన పాలెపు రాజేశ్వర్‌రావు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
 
 వెంకటాపూర్‌లో..
 వెంకటాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో ఆదే పార్టీకి చెందిన మేకల పద్మ ఎంపీపీగా, ఉపాధ్యక్షుడిగా చక్రారపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
 
 జనగామలో..
 జనగామ మండలంలో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్ రెబల్ బైరగోని యాదగిరిగౌడ్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయన ఎంపీపీగా గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దాసరి రవి ఓటమి పాలయ్యారు. వైఎస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన బడికె ఇందిర ఎన్నికయ్యారు.
 
 స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉత్కంఠ..
 స్టేషన్‌ఘనపూర్ మండలంలో టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి ఆ పార్టీలోని ఇద్దరు నాయకులు పోటీ పడ్డారు. పార్టీ వారికి బీ-ఫాం ఇవ్వకపోవడంతో ఇరువు రూ ఇతర పార్టీల మద్దతులో రంగంలోకి దిగా రు. ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో అందులో ఎంపీపీగా వంగాల జగన్మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బూర్ల లత ఎన్నికయ్యారు. వీరు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ అధికారులు ఇండిపెండెంట్లుగా గుర్తించారు.
 
 హన్మకొండలో..
 హన్మకొండ మండలంలో కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. ఇద్దరూ వేర్వేరు పార్టీల వారుకావడం.. ఇరువురూ ఎంపీపీ పదవికి పోటీ పడుతుండడంతో ఎన్నికల ప్రక్రియ జరి పేందుకు వీలు కాకుండా పోయింది. ఎంపీపీగా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఒకరు ప్రతిపాదించాలి, మరోకరు బలపర్చల్సి ఉంటుంది. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిపేందుకు అధికారులు ప్ర యత్నించినా కుదరలేదు. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగకపోవడంతో మరోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. కోరం లేని కారణంగా ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు ఇవ్వాల ని జెడ్పీ అధికారులు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అక్కడ నుంచి స్పష్టత వస్తేనే ఎంపీపీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
 
మానుకోటలో ఉద్రిక్తత
మహబూబాబాద్ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటీ పడడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మండలంలో 17 ఎంపీ టీసీ స్థానాలుండగా కాంగ్రెస్-9, టీఆర్‌ఎస్-5, టీడీపీ-3 గెలుచుకున్నాయి. ఆదివారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీటీసీలను టీఆర్‌ఎస్ నాయకులు ఎత్తుకెళ్లడంతోపాటు ఒకరిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. శనిగపురం ఎంపీటీసీ ఉపేంద్రమ్మ (టీఆర్ ఎస్) రాకతో మొదలైన గొడవ, ఆమె కారు ధ్వంసంతో తీవ్రస్థాయికి చేరుకుంది. తోపులాట, వాగ్వాదాలతో ఆ ప్రాతం అట్టుడికి పోయింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చిం ది. ఈ నేపథ్యంలో కోరం లేక కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగలేదు. దీంతో ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement