ఏలేశ్వరం : ఏలేశ్వరం ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. టీడీపీ ఎంపీటీసీ సభ్యులు రెండో రోజు శనివారం కూడా ఎన్నికకు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రిసైడింగ్ అధికారి ఏడీవీ ప్రసాద్, ఎన్నికల అధికారులు ఎ.రమణారెడ్డి, వి.రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమయ్యింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, కో ఆప్షన్‌సభ్యుడు సుమారు గంట సేపు వేచిచూసినప్పటికీ టీడీపీ సభ్యులు రాకపోవడంతో కోరం లేకపోవడం వల్ల ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయం ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని, వారి అనుమతితో మూడునెలలలోగా మళ్లీ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.
వైఎస్సార్ సీపీ సభ్యుల బైఠాయింపు
ఎంపీపీ ఎన్నికలో టీడీపీ వైఖరిని నిరసిస్తూ పోడియం వద్ద వైఎస్సార్ సీపీ సభ్యులు బైఠాయించారు. ఎంపీపీ ఎన్నికకు హాజరు కాకుండా టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పార్టీ విప్ బీశెట్టి వెంకటరమణ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అక్కడకు రాగా ఎన్నిక వాయిదా పడినట్టు అధికారులు తెలిపారు. దాంతో ఆయన ఎంపీటీసీ సభ్యులతో కలిసి లింగంపర్తి వె ళ్లారు. జ్యోతుల వెంట పార్టీ నేతలు వరుపుల సూరిబాబు, వరుపుల రాజబాబు తదితరులు ఉన్నారు. ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు బందోబస్తు నిర్వహించారు.
ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా
Published Sun, Jul 6 2014 12:09 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement