
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యే
చిట్యాల : చిట్యాల ఎంపీపీ ఎన్నిక సమయంలో దౌర్జన్యంగా వ్వవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఎంపీపీ ఎన్నిక అక్రమమని నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల బంద్ చేపట్టారు. అనంతరం నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే వీరేశాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి మహిళ ఎంపీటీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఆదేరోజు తనపై కూడా టీఆర్‌ఎస్ నాయకులు దాడిచేసేందుకు ప్రయత్నించారన్నారు.
తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. ఎంపీపీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎస్పీ ప్రభాకర్‌రావుకు జరిగిన సంఘటనను వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కందిమళ్ళ శిశుపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శేపూరి యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ కందిమళ్ళ జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మెండె సుజాత, గుడిపాటి లక్ష్మీ, బండ గిరిజ, జిట్ట పద్మ, ఇబ్రహీం, బండ క్రిష్టయ్య, మెండె సైదులు, బొబ్బల శివశంకర్‌రెడ్డి, కామాటి లింగయ్య, రుద్రారపు శ్రీను పాల్గొన్నారు.