
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటూ ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) జోగులాంబ గద్వాల టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు.
ఈ నెల 11న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని, అనుమతి అనుమతి లేకుండా తన ఫోటోను కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా తన ఫొటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.