ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నికను అడ్డుకునేందుకు కుట్ర | tdp complaint against ysr congress party leaders in agiripalli | Sakshi
Sakshi News home page

ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నికను అడ్డుకునేందుకు కుట్ర

Published Fri, Jul 4 2014 1:23 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

tdp complaint against ysr congress party leaders in agiripalli

విజయవాడ : మండల పరిషత్ పీఠాలు దక్కించుకోవటానికి అధికార తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు కొనసాగిస్తూనే ఉంది. గెలుపు అవకాశం లేని కొన్ని మండలాల్లో తెరచాటు రాజకీయాలు సాగిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదరింపులకు దిగటం, కొందరిని ఆర్థికంగా ప్రలోభాలకు గురి చేయటం, మరికొందరిని ఓటింగ్కు రాకుండా చేస్తూ పల్లె రాజకీయాలను కలుషితం చేస్తోంది. ప్రధానంగా ఆపార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం సాగుతోంది.

తాజాగా కృష్ణాజిల్లా ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నికను అడ్డుకునేందుకు తెలుగు దేశం పార్టీ కుట్ర చేస్తోంది. టీడీపీ పార్టీ తన సభ్యులను కనపడకుండా చేసి...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడికి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ శుక్రవారం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ద్వారా ఎన్నికను ఆపడానికి టీడీపీ యత్నిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement