
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దరిమిలా అవి ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏర్పా ట్లు చేస్తోంది. వచ్చే మే నెలాఖరులోగా మండ ల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ ప్రతిపాదనలు స మర్పించింది. వచ్చే జూలై 3, 4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీల కాల పరిమితి ముగియ నుండటంతో, ఆవెంటనే కొత్త ఎంపీపీలు, జెడ్పీ పీలు ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఓటర్ల జాబితాల తయారీ..
రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగినా, పాత 9 జిల్లా పరిషత్‌లు, వాటి పరిధిలోని మండల పరిషత్‌ల కాలపరిమితి ముగియకపోవడంతో వాటి విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో 30 రెవెన్యూ జిల్లాలు (పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ మినహాయిం చి), 535 గ్రామీణ మండలాల (50 వరకు పట్టణ స్వరూపమున్న రెవెన్యూ మండలాలు మినహా) ప్రాతిపదికగా జెడ్పీలు, ఎంపీపీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది.
25 లోగా ప్రతిపాదనలు..
కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ఈ ప్రతిపాదనలను ఈనెల 25 లోగా పూర్తి చేసి పంపాలని సూచించింది. ఈ ఎన్నికల్లో 2019 జనవరి 1 నాటికి ఓటర్ల జాబితాలో ఉన్న వారి ని ఓటర్లుగా పరిగణిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాకు అనుగుణంగా జిల్లా, మండల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్‌ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. మరో రెండు కొత్త జిల్లాలను, నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటి ఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో వాటినీ తుది జాబితాలో చేర్చే అవకాశం ఉంది.
వచ్చే నెలాఖరులోగా రిజర్వేషన్లు..
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధిం చిన రిజర్వేషన్ల ఖరారును వచ్చే నెలాఖరులోగా పూర్తిచేయాలని ఎస్‌ఈసీ భావిస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీలకు అమలు చేసినట్లు రెం డు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జెడ్పీ, ఎంపీపీల రిజర్వేషన్ల విధానం ఖరారు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లే బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌లు విని యోగించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. మే లో ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ జారీచేసే అవకాశాలున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నివేదికలకనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో ని ర్వహించే విషయంపై ఎస్‌ఈసీ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment