District public Parishad
-
‘కో–ఆప్టెడ్’కు ఇద్దరు పిల్లల నిబంధన
సాక్షి, హైదరాబాద్: మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)లలో కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను వర్తింపజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉన్న నియమ, నిబంధనలన్నీ కో–ఆప్టెడ్ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. శుక్రవారం ఎంపీపీ లు, శనివారం జెడ్పీపీలలో కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్ని క జరగనుంది. 1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు అనర్హులు కానున్నారు. ఎంపీపీలలో ఒకరిని, జెడ్పీలలో ఇద్దరి చొప్పున కో–ఆప్టెడ్ సభ్యులుగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిని ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సమా వేశం నిర్వహించే రోజు ఉదయం 9–10 గంటల మధ్య కో–ఆప్టెడ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశానికి కూడా ఎన్నికైన సగం కంటే ఎక్కువ మంది సభ్యుల కోరం ఉంటేనే ఈ ఎన్నిక నిర్వహిస్తారు. కో–ఆప్టెడ్ సభ్యుడిగా పోటీచేసే వ్యక్తి స్థానిక ఓటరై ఉండటంతో పాటు 21 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉండొద్దు. కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యాక ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికల కోసం నిర్వహించే సమావేశానికి వారిని ఆహ్వానిస్తారు. అయితే వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఎంపీపీ, జెడ్పీపీ కో–ఆప్షన్ ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చిన పక్షంలో డ్రా ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ కో–ఆప్టెడ్ ఎన్నిక జరగకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. -
జెడ్పీ, ఎంపీపీ ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దరిమిలా అవి ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పా ట్లు చేస్తోంది. వచ్చే మే నెలాఖరులోగా మండ ల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ ప్రతిపాదనలు స మర్పించింది. వచ్చే జూలై 3, 4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీల కాల పరిమితి ముగియ నుండటంతో, ఆవెంటనే కొత్త ఎంపీపీలు, జెడ్పీ పీలు ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితాల తయారీ.. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగినా, పాత 9 జిల్లా పరిషత్‌లు, వాటి పరిధిలోని మండల పరిషత్‌ల కాలపరిమితి ముగియకపోవడంతో వాటి విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో 30 రెవెన్యూ జిల్లాలు (పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ మినహాయిం చి), 535 గ్రామీణ మండలాల (50 వరకు పట్టణ స్వరూపమున్న రెవెన్యూ మండలాలు మినహా) ప్రాతిపదికగా జెడ్పీలు, ఎంపీపీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. 25 లోగా ప్రతిపాదనలు.. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ఈ ప్రతిపాదనలను ఈనెల 25 లోగా పూర్తి చేసి పంపాలని సూచించింది. ఈ ఎన్నికల్లో 2019 జనవరి 1 నాటికి ఓటర్ల జాబితాలో ఉన్న వారి ని ఓటర్లుగా పరిగణిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాకు అనుగుణంగా జిల్లా, మండల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. మరో రెండు కొత్త జిల్లాలను, నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటి ఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో వాటినీ తుది జాబితాలో చేర్చే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరులోగా రిజర్వేషన్లు.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధిం చిన రిజర్వేషన్ల ఖరారును వచ్చే నెలాఖరులోగా పూర్తిచేయాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీలకు అమలు చేసినట్లు రెం డు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జెడ్పీ, ఎంపీపీల రిజర్వేషన్ల విధానం ఖరారు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లే బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌లు విని యోగించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. మే లో ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ జారీచేసే అవకాశాలున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నివేదికలకనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో ని ర్వహించే విషయంపై ఎస్ఈసీ యోచిస్తోంది. -
ప్రభ కోల్పోతున్న జెడ్పీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లు (జెడ్పీలు) క్రమక్రమంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ప్రస్తుతం జెడ్పీలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇవి గత కాలపు వైభవానికి చిహ్నాలుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోవడానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు 14వ ఆర్థికసంఘం సిఫార్సులు ప్రధాన కారణం కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు తగ్గిపోవడం మరో కారణం. 2015 సంవత్సరం నుంచి 14వ ఆర్థికసంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక నేరుగా గ్రామపంచాయతీలకే అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నారు. దీంతో వివిధ పథకాల కింద జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా విడుదలయ్యే నిధులు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 మేలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జెడ్పీల సంఖ్య 9 ఉండగా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు (తాజాగా ప్రకటించిన రెండు జిల్లాలు కలిపి), మండలాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు పెరగబోతోంది. అక్కడ సాధ్యమేనా? ఈ ఏడాది జూలైతో పాత జిల్లాపరిషత్‌ల కాలపరిమితి ముగిశాక, కొత్త జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మేడ్చల్ జిల్లా పరిధిలో 5, వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 7 మండలాలు, గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాల్లోని మండలాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపై స్పష్టత రాలేదు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానికసంస్థలకు అధికారాలను కట్టబెట్టడంలో భాగంగా సాధారణంగా జిల్లాగా ప్రకటించిన ప్రాంతాన్నే జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ)గా పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా మార్పులు,చేర్పులు చేపడుతుందా? లేక ఇప్పటికే ఏర్పాటు చేసిన 31 జిల్లాలతోపాటుగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలతో కలసి మొత్తం 32 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన ప్రకారమేనా? జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారమే కొత్త జిల్లా,మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు అవుతాయని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కూడా స్పష్టం చేసినందున తదనుగుణంగానే కొత్త జిల్లాలు, మండలాలు ప్రత్యేక యూనిట్లుగా మారతాయి. 1974 తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారం కూడా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలు,కొత్త మండలాల ప్రాతిపదికన మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడతాయి. గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజాగా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది. -
ఎన్నికల పిటిషన్ల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్:గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు సంబంధించి తలెత్తే ఎలాంటి వివాదాలనైనా ఇకపై ఎన్నికల ట్రిబ్యునళ్లు పరిష్కరించనున్నాయి. ఈ మేరకు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతోపాటు ఇతరు లు ఎవరైనా వీటి ముందు పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ పంచాయతీ పరిధిలోకి వచ్చే జూనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై సీనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్‌గా విచారణ జరుపుతారు. అలాగే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి లేదా అధికారులు కూడా ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. 30 రోజుల్లోగా పిటిషన్... గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన రోజు నుంచి 30 రోజులలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 30వ రోజున ట్రిబ్యునల్ తెరచి లేనిపక్షంలో ఆ మరుసటిరోజు పిటిషన్ వేసుకోవచ్చు. పిటిషనర్లు తాము చేస్తున్న ఆరోపణలకు పూర్తి ఆధారాలను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలి. పిటిషన్‌తోపాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.1,000 జమ చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేని పిటిషన్లను ట్రిబ్యునల్ తిరస్కరించొచ్చు. పిటిషన్ కాపీలను ప్రతివాదికి అందజేయడంతోపాటు ట్రిబ్యునల్ నోటీస్ బోర్డులో అతికించాలి. తన ఎదుట దాఖలైన పిటిషన్లపై సీపీసీ నిబంధనల్లో నిర్దేశించిన కాలపరిమితి మేరకు ట్రిబ్యునల్ విచారణ జరపాల్సి ఉంటుంది. సాక్షుల విచారణకు, ఆధారాల స్వీకరణకు ట్రిబ్యునల్‌కు అధికారం ఉంటుంది. సాక్షులు తాము ఎన్నికల్లో ఎవరికి ఓటేశామో తెలియజేయాల్సిన అవసరంలేదు. ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఎన్నికల పిటిషన్లను ఉపసంహరించుకునే అవకాశం లేదు. పిటిషనర్లు ఒకరి కంటే ఎక్కువగా ఉంటే వారందరి అనుమ తితో పిటిషన్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇతర పార్టీలకు నోటీసు జారీచేసి విచారణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుంది. ఏదైనా పిటి షన్ ఉపసంహరణకు అనుమతినిచ్చినప్పుడు ట్రిబ్యునల్ ఆ నిర్ణయాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ అధికారులకు తెలియజేయాలి. ట్రిబ్యునళ్ల విధులు, అధికారాలివీ.. ►పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పిటిషన్లను ఈ ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి. ►ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి, అతడు/ఆమె ఏజెంటు, అతడు/ఆమె ఆమోదం పొందిన ఏ వ్యక్తి అయినా అక్రమాలకు పాల్పడినట్టు తేలితే.. వారి ఎన్నికను రద్దు చేయడమే కాకుండా ఆరేళ్లపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా ట్రిబ్యునల్ ఆదేశించవచ్చు. సదరు వ్యక్తిని అంతే కాలానికి ఓటేయడానికి వీలు లేదని ఆదేశించే అధికారం కూడా ట్రిబ్యునల్‌కు ఉంది. ►గెలుపొందిన వ్యక్తి ఎన్నిక చెల్లదని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పక్షంలో ఆ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల్లో అర్హులైనవారిని గెలుపొందినట్టుగా ప్రకటించవచ్చు లేదా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీచేయొచ్చు. -
ప్రశ్నల వర్షం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలైనా మండల స్థాయిలో చేపడుతున్న వివిధ పథకాల ప్రగతి నివేదికలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు తెలుపకపోవడంపై మండిపడ్డారు. మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు ఆ స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది. జెడ్పీ చైర్ పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖాశ్యాంనాయక్,విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నా రు. సభలో చర్చించాల్సిన 45అంశాలకు గాను నాలుగు అంశాలు మాత్రమే చర్చించారు. ము ఖ్యంగా వ్యవసాయ, విద్యుత్, గ్రామీణ నీటి స రఫరా, డ్వామా శాఖలపై లోతుగా చర్చించిన వైద్య ఆరోగ్య, విద్యా శాఖ, సర్వశిక్షా అభియా న్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిపింది. సమీక్షలో భాగంగా మంత్రి రామన్న మాట్లాడుతూ.. సర్వసభ్య సమావేశానికి సంబంధించి ప్రగతి నివేదికలు ఎంపీడీవోలకు అందజేయకపోవడంపై ఎంపీడీవోల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందోనని ఫైర్ అయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని జెడ్పీ సీఈవోకు సూచించారు. జిల్లా అధికారుల వద్ద ఇప్పటివరకు ఎంపీపీ, జెడ్పీటీసీల ఫోన్ నంబర్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మండల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని, అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మిషన్ కాకతీయలో భాగంగా వ్యవసాయ శాఖ కు కూడా బాధ్యతలు ఉన్నాయని, గ్రామాల్లో దీనిపై అవగాహన కల్పించి చెరువుల్లో నుంచి తీస్తున్న మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల కలిగే లాభాలను వివరించాలని ఆదేశాలు ఉన్నట్లు ఆ శాఖాధికారి రమేష్ పేర్కొన్నారు. ఇన్చార్జి ఏవో ఉండడంతో రైతులకు ఇబ్బందు లు తలెత్తుతున్నాయని, రెగ్యులర్ ఏవోని నియమించాలని కోటపల్లి జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలంలో 1500 ఎకరాల్లో ఈ యేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోగా, ఆ రైతులకు పరిహారం ఇప్పించాలని జెడ్పీటీసీ ఏమాజీ కోరారు. ఆన్లైన్లో భూమి రికార్డులు ఉన్నా కొన్నిచోట్ల పహనీలు ఇవ్వడం లేదని తెలిపారు. ఆత్మపై అసంతృప్తి.. వ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే వ్యవసాయ సాంకేతిక అభివృద్ధి యాజమాన్య సంస్థ (ఆత్మ) పై చర్చించారు. మండలాల్లో సభ్యులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా కమిటీలు ఏర్పాటు చేశారని మంచిర్యాల జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆత్మ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల ప్రగతిపై ఎందుకు సమాచారం ఉండడం లేదని మంత్రి జోగురామన్న పీడీ మనోహర్‌ను ప్రశ్నించారు. ఇకపై మండలస్థాయిలో చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని సభ్యులకు తెలియజేయాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్‌పై గరం గరం.. విద్యుత్ శాఖపై సభ్యులు గరమయ్యారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదంటే ఎలా అని మంత్రి రామన్న ప్రశ్నించారు. దాని బాధ్యత ట్రాన్స్‌కో ఎస్ఈపై ఉందని కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలో సబ్ స్టేషన్ కోసం స్థలం ఉన్నా నిర్మాణంలో ఆలస్యమవుతోందని ఆ మండల జెడ్పీటీసీ వివరించారు. బెల్లంపల్లిలోని గుర్జాలలో విద్యుత్ లైన్లు వేసినా విద్యుత్ సరఫరా కావడం లేదని తెలిపారు. బె ల్లంపల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బోర్లు వేసేందుకు పరిపాలన అనుమతి లభించినా.. ఇప్పటివరకు వచ్చిన నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు. జన్నారం మండలంలో బుడగజంగాలకు విద్యుత్ ఇవ్వడం లేదని, బేలలోని చప్రాలలో ఇప్పటివరకు సబ్‌స్టేషన్ పనులు ప్రారంభంకాలేదని ఆయా జెడ్పీటీసీలు తెలిపారు. వేమనపల్లి మండలంలో అక్రమ కనెక్షన్లు ఉన్నా వాటిని ఎందుకు తొలగించడం లేదని, అక్రమ కనెక్షన్లు ఉన్న వారితో డీడీలు కట్టించి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఎస్ఈకు సూచిం చారు. ఖానాపూర్ మండలంలోని చాలా గ్రామా లు విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చా రు. బెల్లంపల్లిలో ఇందిర జలప్రభ కింద బోర్లు వేసినా కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేం దుకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేస్తామని, ఇందుకు మంత్రి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇందిర జలప్రభ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయ భూముల్లో ఇప్పటివరకు మొత్తం 2,400 బోర్లు వేయగా, 700 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు డబ్బులు చెల్లించగా, కేవలం 621 బోర్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారని, మిగితా వాటికి ఇంకెంత సమయం పడుతుందని మంత్రి ప్రశ్నించారు. ఈయేడాదిలో పూర్తి చేస్తామని ఎస్ఈ వివరించారు. నార్నూర్‌లోని జక్కెపల్లిలో త్రీఫేజ్ కరెంటు సౌకర్యం లేదని, అక్కడ మొత్తం కర్ర స్తంభాలతో విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామీణ నీటి సరఫరా.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి జోగురామన్న ఆదేశించారు. ఇందుకు నియోజకవర్గా ల వారీగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, జెడ్పీటీసీలు, అధికారులు సమావేశాలు నిర్వహించాల ని పేర్కొన్నారు. చర్చలో భాగంగా మంచిర్యాల లోని నస్పూర్‌లో ట్యాంక్ నిర్మాణాలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ దక్కించుకుంటే వేరే వ్యక్తి ఆ పనులు చేస్తున్నాడని, ఇది అధికారులకు తె లియదా అని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. దిలావర్పూర్లో నాలుగు మంచినీటి ట్యాంకులు ఉన్నా నీరు లేదని, ఇంద్రవెల్లిలోని భీంనగర్, మిలిన్నగర్లలో ట్యాంకుల మరమ్మతు చేయించాలని ఆయా మండలాల జెడ్పీటీసీలు కోరారు. చెన్నూర్ ప్రజలకు గోదావరి తాగునీరు అందించేందుకు పైపులైన్ పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, విద్యుత్ కనెక్షన్లు ఉన్నచోటా ట్యాంకులు పనిచేయడం లేదని, మంచినీటి ట్యాంకులు ఉన్నచోట విద్యుత్ కనెక్షన్లు లేవని, ఈ రెండు ఉన్న చోట పైపులైన్లు సరిగా లేక తాగునీరు రావడం లేదని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కుంటాలలో పైపులైన్ వేసేందుకు డబ్బులు చెల్లించారో లేదో వారికే స్పష్టత లేదని మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యారోగ్య, విద్య శాఖలపై ప్రశ్నల వర్షం వైద్య, ఆరోగ్య, విద్యా శాఖల అధికారులపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. బజార్హత్నూర్ మండలంలో ఉన్న 35 పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరు కాగా, ఏ పాఠశాలలో కూడా ప్రారంభం కాలేదన్నారు. రామకృష్ణపూర్‌లోని క్యాతన్‌పల్లి పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డు కూడా లేదని పేర్కొన్నారు. కోటపల్లిలోని ఎసర్వాయి గ్రామంలో చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారని ఆయా మండలాల జెడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. బేలలో మోడల్ స్కూల్ నిర్మాణానికి స్థలం ఉందని, అది కొంత దూరంలో ఉందని తెలిపారు. మంజూరైన వెంటనే నిర్మాణ పనులు చేపడతామని డీఈవో సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. రెబ్బెన పాఠశాలలో హెచ్ఎం సహకరించడం లేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ మండల జెడ్పీటీసీ కోరారు. లక్ష్మణచాందలో వైద్యాధికారి లేడని అక్కడి జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకురాగా.. వైద్యాధికారి ఉన్నారని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ తెలిపారు. సర్వశిక్షా అభియాన్, స్త్రీ, శిశు సంక్షేమంపై.. అనంతరం సర్వశిక్షా అభియాన్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిగింది. లక్ష్మణచాంద మండలంలో 14 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకువచ్చారు. కైలాస్‌నగర్‌లో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా వాటితో ప్రయోజనం లేకుండాపోయిందని జెడ్పీటీసీలు తెలిపారు. కొన్ని మండలాల్లో వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని పలువురు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులను నియమించామని, విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జగన్మోహన్ వివరించారు. ఆటాడుకుందాం రా..! జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను చర్చిస్తుండగా.. మరోపక్క కొందరు అధికారులు సెల్ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కనిపించారు.. ఇంకొందరు సమావేశ హాల్లో సెల్ఫోన్లను శుభ్రం చేస్తూ కనిపించారు. రాష్ట్ర మంత్రి, కలెక్టర్, జెడ్పీ సీఈవోలు పలుమార్లు అధికారులకు చెప్పినా వీరు మాత్రం ఇలా ఆటలపైనే దృష్టి పెట్టారు. -
సీఈఓ వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్
కోల్డ్‌వార్ ⇒ పనుల మంజూరులో పట్టింపులు ⇒ ప్రతిపాదనలు తిరస్కరించిన సునీత ⇒ బదిలీ చేయాలని ప్రభుత్వానికి లేఖ ⇒ నిలిచిన అభివృద్ధి పనులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రజాపరిషత్‌లో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, సీఈఓ చక్రధర్‌రావు మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలు జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జెడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనుల మంజూరు విషయమై ఇద్దరి మధ్య అంతరానికి దారితీసింది. దీంతో జిల్లావ్యాప్తంగా రూ.2.51 కోట్ల విలువైన పనులకు బ్రేక్ పడింది. ప్రతి మండలానికి సగటున రూ.15 లక్షల చొప్పున (దాదాపు 130 పనులు) నిధులు మంజూరు చేయాలని నిర్ణయించిన జిల్లా పరిషత్ పాలకవర్గం.. ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కోరింది. ఈ క్రమంలోనే సీఈఓ చక్రధర్‌రావు ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యుల సిఫార్సు లేఖలకు అనుగుణంగా ప్రతిపాదనలను పాలనాపరమైన అనుమతి కోసం చైర్‌పర్సన్‌కు పంపారు.ఈ ఫైలును పరిశీలించిన సునీత.. తాను సూచించిన పనులు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటికే పనులు కూడా పూర్తయిన వాటికి కొత్తగా ప్రొసిడింగ్స్ ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫైలును తిప్పిపంపారు. మళ్లీ తాజాగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ పరిణామంతో నొచ్చుకున్న సీఈఓ చక్రధర్‌రావు.. నిబంధనల మేరకే న డుచుకున్నానని, తన విచక్షణాధికారాన్ని కూడా అధ్యక్షురాలు హరించేలా వ్యవహరించడమేమిటనీ.. ఫైలును పక్కనపెట్టారు. ఈ ఇరువురు పట్టింపులకుపోవడంతో రెండు నెలల క్రితం మంజూరు కావాల్సిన పనులకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. అభివృద్ధి పనులేకాకుండా బిల్లుల చెల్లింపులోనూ సీఈఓ ఏకపక్ష వైఖరిపై సునీత అసంతృప్తితో ఉన్నారు. మంత్రులు, జెడ్పీ సర్వసభ్య సమావేశాల సమయంలో నాసిరకం భోజనం వడ్డించి.. భారీ మొత్తంలో బిల్లులు డ్రా చేసినట్లు గుర్తించిన ఆమె ఈ వ్యవహారంపై కూడా నిలదీసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. సాగనంపాల్సిందే..! జిల్లా పరిషత్ కార్యకలాపాల్లో తనను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఈఓను సాగనంపేందుకు సునీత తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసిన ఆమె.. సీఈఓగా బీసీ సంక్షేమశాఖ ఉపసంచాలకులుగా పనిచేస్తున్న వి.వి రమణారెడ్డికి పోస్టింగ్ ఇవ్వాలని సిఫార్సు కూడా చేశారు. ఈ పరిణామంతో అవాక్కయిన చక్రధర్‌రావు.. బదిలీ అయినా పరవాలేదు.. నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేసేదిలేదని భీష్మించుకుకూర్చున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సునీత కూడా ఈ వ్యవహారంలో మెట్టుదిగేదిలేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్నాళ్లు ఫైలు అట్టిపెట్టుకుంటారో చూస్తానని, అప్పటివరకు వేచి చూస్తానని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా, ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు పొడచూపడం అధికారులు, జెడ్పీటీసీ సభ్యులకు తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పనులు మంజూరు చేయకుండా నెలల తరబడి ఫైలును పెండింగ్‌లో పెట్టిన చైర్‌పర్సన్‌ను ఏమీ అనలేక.. తిప్పి పంపిన ఫైలును మళ్లీ పంపక అట్టిపెట్టుకున్న సీఈఓను నిలదీయలేక సతమతమవుతున్నారు. -
కారుణ్య నియామకాల్లో కాసుల వేట!
విజయనగరం ఫోర్ట్ : జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో కారుణ్య నియామకాలకు పైరవీలు మొదల య్యాయి. నియామకాల కోసం పెద్దమొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లగా జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. జిల్లా పరిషత్‌లో కొత్త పాలక వర్గం కొలువుదీరడంతో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పైల్ సిద్ధం చేసినట్టు భోగట్టా. అయితే కారుణ్య నియామకాలను సొమ్ము చేసుకోవాలని అధికారులు, ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పైరవీలు ప్రారంభించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ. 2 లక్షలు నుంచి రూ. రెండున్నర లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. జిల్లా పరిషత్‌లో 15 కారుణ్య నియామకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని నాలుగైదు రోజుల్లో భర్తీ చేయనున్నట్టు తెలిసింది. కాసులు చేతిలో పడగానే నియామక ఉత్తర్వులు అందజేయడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. సొమ్ము సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం పంపించారు. అయితే పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుండడంతో అంత సొమ్ము ఏవిధంగా ఇవ్వాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు ముందే ఈ పక్రియను చేపట్టాలని జిల్లా పరిషత్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. బదిలీలు జరిగితే సీటు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందే చక్క బెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ మోహన్‌రావు వద్ద ప్రస్తావించగా కారుణ్య నియమాకాలకు సంబంధించిన ఫైల్ ఇంతవరకు తన వద్దకు రాలేదని తెలిపారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. నియామకాలు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. -
రేపు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక
కరీంనగర్ సిటీ : మూడున్నరేళ్ల ప్రత్యేకపాలనకు తెరపడనుంది. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం శనివారం కొలువుదీరనుంది. నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్పర్సన్, వైస్‌చైర్మన్, ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ఇదీ.. శనివారం ఉదయం 10 గంటల్లోపు రెండు కో ఆప్షన్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటన 1 గంట వరకు ఉపసంహరణ 1 గంటకు ప్రత్యేక సమావేశం, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం అవసరమైతే కో ఆప్షన్ పదవులకు ఓటింగ్. ఫలితం వెల్లడి మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నిక అనంతరం ఫలితాల వెల్లడి, జెడ్పీ చె రపర్సన్, వైస్‌చైర్మన్ ప్రమాణస్వీకారం ఎన్నిక నిర్వహణ ఇలా.. జిల్లా పరిషత్ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం విధివిధానాలు జారీ చేసింది. ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. జాతీయ పార్టీలకు ముందు వరుసలో అవకాశం కల్పిస్తారు. పార్టీల వారీగా తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది. పలానా పార్టీ నుంచి పలానా జెడ్పీటీసీని చైర్‌పర్సన్‌గా, వైస్‌చైర్మన్‌గా నియమించామని పార్టీఇచ్చిన ఆథరైజేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి(పీవో)కి అందచేస్తారు. దీనినే అభ్యర్థుల నామినేషన్‌గా పరిగణిస్తారు. అభ్యర్థికి మరొకరు ప్రతిపాదిస్తారు. ఇంకొకరు బలపరుస్తారు. ఒక్క పార్టీ నుంచి మాత్రమే ఆథరైజేషన్ వస్తే, ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు పీవో ప్రకటిస్తారు. రెండు పార్టీలు పోటీపడితే ఎన్నిక నిర్వహిస్తారు. ఒక అభ్యర్థి పేరు చెప్పి అనుకూలంగా ఎంతమంది ఓటు వేస్తారో చేతులెత్తండి అని పీవో అడగగానే,చేతులెత్తిన జెడ్పీటీసీలను సిబ్బంది లెక్కిస్తారు. ఎవరికి ఎక్కువ మంది చేతులెత్తెతే వారే విజేతలు. చైర్పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకనే వైస్‌చైర్మన్‌ను ఎన్నుకుంటారు.