కరీంనగర్ సిటీ : మూడున్నరేళ్ల ప్రత్యేకపాలనకు తెరపడనుంది. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం శనివారం కొలువుదీరనుంది. నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
షెడ్యూల్ ఇదీ..
- శనివారం ఉదయం 10 గంటల్లోపు రెండు కో ఆప్షన్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు
- 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు
- 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటన
- 1 గంట వరకు ఉపసంహరణ
- 1 గంటకు ప్రత్యేక సమావేశం, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం
- అనంతరం అవసరమైతే కో ఆప్షన్ పదవులకు ఓటింగ్. ఫలితం వెల్లడి
- మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నిక
- అనంతరం ఫలితాల వెల్లడి, జెడ్పీ చె రపర్సన్, వైస్‌చైర్మన్ ప్రమాణస్వీకారం
ఎన్నిక నిర్వహణ ఇలా..
- జిల్లా పరిషత్ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం విధివిధానాలు జారీ చేసింది.
- ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేస్తారు.
- జాతీయ పార్టీలకు ముందు వరుసలో అవకాశం కల్పిస్తారు.
- పార్టీల వారీగా తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది.
- పలానా పార్టీ నుంచి పలానా జెడ్పీటీసీని చైర్‌పర్సన్‌గా, వైస్‌చైర్మన్‌గా నియమించామని పార్టీఇచ్చిన ఆథరైజేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి(పీవో)కి అందచేస్తారు.
- దీనినే అభ్యర్థుల నామినేషన్‌గా పరిగణిస్తారు.
- అభ్యర్థికి మరొకరు ప్రతిపాదిస్తారు. ఇంకొకరు బలపరుస్తారు.
- ఒక్క పార్టీ నుంచి మాత్రమే ఆథరైజేషన్ వస్తే, ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు పీవో ప్రకటిస్తారు.
- రెండు పార్టీలు పోటీపడితే ఎన్నిక నిర్వహిస్తారు.
- ఒక అభ్యర్థి పేరు చెప్పి అనుకూలంగా ఎంతమంది ఓటు వేస్తారో చేతులెత్తండి అని పీవో అడగగానే,చేతులెత్తిన జెడ్పీటీసీలను సిబ్బంది లెక్కిస్తారు.
- ఎవరికి ఎక్కువ మంది చేతులెత్తెతే వారే విజేతలు.
- చైర్‌పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకనే వైస్‌చైర్మన్‌ను ఎన్నుకుంటారు.