ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుంది. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను గురువారం ఎన్నుకోనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం ముస్తాబైంది. ఇందులో ఎన్నిక నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రిసైడింగ్ అధికారి హోదాలో ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి బుధవారం రాత్రి పరిశీలించారు. ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ సమస్యల లేకుండా చూడాలని సీఈవో జయప్రకాశ్ నారాయణ్‌కు సూచించారు. నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఖమ్మంలో 144 సెక్షన్
జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పోలీస్ యాక్ట్ 30ను అమలు చేసి, ఖమ్మంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నిక ప్రక్రియను రికార్డు చేసేందుకు జిల్లా పరిషత్ ఆవరణతో పాటు సమావేశ మందిరంలో సీసీ కెమెరాలు అమర్చారు. అపరిచిత వ్యక్తులను లోనికి అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జెడ్పీ ప్రధాన ద్వారాల రెండు వైపులా బారీకేట్లను ఏర్పాటు చేశారు.
సర్వం సిద్ధం
Published Thu, Aug 7 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement