co option
-
నాలుగు స్థానాలు గులాబీ ఖాతాలోకే..!
సాక్షి, పెద్దపల్లి: రామగుండం నగరపాలకసంస్థ కో ఆప్షన్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం లాంఛనమే కానుంది. కోర్టు కేసుల కారణంగా ఇటీవల వాయిదా పడ్డ ఎన్నికను మంగళవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నారు. మొత్తం ఐదు స్థానాలకు గాను ఒక్క మైనార్టీ జనరల్ స్థానానికి మాత్రమే పోటీ ఏర్పడడంతో ఎన్నిక అనివార్యమైంది. కాని బల్దియాలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు చూస్తే టీఆర్ఎస్ ఖాతాలోకి ఐదు కో ఆప్షన్ స్థానాలు వెళ్లడం లాంఛనమే. నేడు ఎన్నిక కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డ రామగుండం నగరపాలకసంస్థ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగే ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్లు ప్రత్యక్ష పద్ధతిన హాజరై సభ్యులను ఎన్నుకుంటారు. కాగా మొత్తం ఐదు స్థానాలకు గాను నాలుగింటికి కేవలం టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మైనార్టీ జనరల్ స్థానానికి టీఆర్ఎస్తో పాటు, కాంగ్రెస్, మరో అభ్యర్థి పోటీ ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. కరోనా కారణంగా ఈ నెల 1న టెలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నిక నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కాని ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ మహాంకాళి స్వామి, మైనార్టీ కో ఆప్షన్ పదవికి పోటీ చేస్తున్న సైమన్రాజ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో అప్పట్లో ఎన్నిక నిలిచిపోయింది. తిరిగి ప్రత్యక్ష పద్ధతిలోనే కోఆప్షన్ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో మంగళవారం ప్రత్యక్ష పద్ధతిలో (చేతులెత్తే) ఎన్నికను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీదే హవా నగరపాలక సంస్థలో ఈ ఏడాది జనవరి 22న ఎన్నికలు జరుగగా అదే నెల 25న ఫలితాలు వెలువడ్డాయి. 50 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 11, బీజేపీ 6, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 9, ఆరు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. అనంతర రాజకీయ పరిణామాలతో ఫార్వర్డ్బ్లాక్కు చెందిన తొమ్మిది మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఆరుగురు టీఆర్ఎస్కు మద్దతు పలికారు. దీంతో టీఆర్ఎస్ బలం 35కి చేరింది. ఈక్రమంలో టీఆర్ఎస్ ఖాతాలోకే కో ఆప్షన్ కూడా వెళ్లనుంది. మైనార్టీ జనరల్కు పోటీ ఐదు కో ఆప్షన్ స్థానాల్లో కేవలం మైనార్టీ జనరల్ స్థానానికే పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి మహ్మ ద్ రఫీ, కాంగ్రెస్ నుంచి ఫజల్ బేగ్, బొల్లెద్దుల సైమన్రాజు పోటీలో ఉన్నారు. 35 మంది కార్పొరేటర్లు చేజారకుండా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ ఇప్పటికే మంతనాలు పూర్తి చేశారు. అ ద్భుతం జ రిగితే తప్ప ఐదవ స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతా లోకి వెళ్లడం ఖాయంగా మారింది. ఇక కాంగ్రెస్ మద్ద తు పలికిన బేగ్కు, అదనంగా ఓట్లు పడుతా యా అ నే ఆసక్తి ఏర్పడింది. కాగా ఎవరికి మద్దతు ఇ వ్వాలో ఇంకా బీజేపీ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
సాక్షి, నారాయణపేట: గ్రామాల్లోని టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటై ఏడు నెలులు కావస్తుండగా సర్పంచ్, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఇప్పటికే కొలువుదీరారు. పరిపాలనా సౌలభ్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి జవాబుదారీతనం పెంచడానికి అదనంగా త్వరలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాల కమిటీలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మళ్లీ పంచాయతీల్లో కొత్త పదవుల పండుగ వచ్చినట్లయింది. పంచాయతీ బరిలో నిలిచి ఓటమి పాలైనవారంతా ఇప్పుడు కోఆప్షన్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,684 పంచాయితీల్లో నియామకం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 71 మండలాల పరిధిలోని 1,684 గ్రామ పంచాయతీల్లో త్వరలో కోఆప్షన్ సభ్యుల నియామకం జరగనుంది. గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేయడంతో పాటు పర్యవేక్షణ పెరిగి నిధుల సద్వినియోగం చేసుకోవడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు మున్సిపాలిటీల్లో, మండల పరిషత్, జిల్లా పరిషత్ తరహాలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ కోఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాలను నియమించింది. కొత్త చట్టం ప్రకారం గ్రామ కోఆప్షన్ సభ్యులను నియమించాలని అన్ని పంచాయతీలకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు సైతం పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన కాపీలను అధికారులు అందజేశారు. కో అప్షన్సభ్యుల ఎంపిక ఇలా సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటు ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులుంటారు. కొత్త చట్టంలోని 7(3) ప్రకారం గ్రామాభివృద్ధి విషయంలో శ్రద్ధ కలిగిన విశ్రాంత ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్ మొదటి కోఆప్షన్ సభ్యుడిగా, గ్రామంలోని వివిధ సంఘాల అధ్యక్షుల్లో ఒకరిని రెండో కో ఆప్షన్ సభ్యుడిగా, గ్రామాభివృద్ధికి విరాళమిచ్చే దాతల్లో ఒకరిని మూడో కో ఆప్షన్ సభ్యుడిగా గ్రామ పంచాయతీ నియమిస్తుంది. గ్రామ పంచాయతీ అభివృద్ధికి సలహాలు, సూచనలు కో ఆప్షన్ సభ్యులు ఇవ్వొచ్చు. మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వీరికి ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీలకు గాను 5,052 మంది కో ఆప్షన్ సభ్యులను నియమించే అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ శ్రేణులో చిగురించిన ఆశలు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యులతో పాటు స్థాయీ సంఘాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు మొదలు పెడుతుండడంతో గ్రామాల్లోని టీఆర్ఎస్ నాయకుల్లో పదవుల సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 80 శాతం సర్పంచులను టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఆయా గ్రామాల్లో వార్డుసభ్యులుగా పోటీచేసి ఓటమి పాలైనవారంతా ఇప్పుడు కో ఆప్షన్సభ్యులుగా పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. స్థాయీ సంఘం కమిటీల నియామకం గ్రామాల్లో నాలుగు స్థాయి సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి పారిశుద్ధ్యం నిర్వహణ కమిటీ, రెండోది వీధి దీపాల నిర్వాహణ కమిటీ, మూడోది మొక్కల పెంపకం, నా లుగోది సంతల నిర్వాహణ, పనుల నిర్వాహణ కోసం కమిటీలను వేయనున్నారు. వీటిలో ఒ క్కో సంఘంలో పది మందికి తక్కువ కాకుండా నియమించుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 1,684 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కొక్క కమిటీకి పది అనుకున్నా 67,360 మందికి అవకాశాలు కల్పించనున్నారు. పది మంది కంటే ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. గైడ్లేన్స్ వచ్చిన తర్వాతే.. గ్రామ పంచాయతీలో నూతన చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాల కమిటీలను వేస్తాం. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో గైడ్లేన్స్ రావాల్సి ఉంది. ఈ నెల 3 తర్వాత పూర్తిస్థాయిలో చేసేందుకు అవకాశం ఉంది. – మురళి, డీపీఓ, నారాయణపేట జిల్లా -
సర్వం సిద్ధం
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుంది. చైర్పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను గురువారం ఎన్నుకోనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం ముస్తాబైంది. ఇందులో ఎన్నిక నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రిసైడింగ్ అధికారి హోదాలో ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి బుధవారం రాత్రి పరిశీలించారు. ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ సమస్యల లేకుండా చూడాలని సీఈవో జయప్రకాశ్ నారాయణ్కు సూచించారు. నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మంలో 144 సెక్షన్ జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పోలీస్ యాక్ట్ 30ను అమలు చేసి, ఖమ్మంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నిక ప్రక్రియను రికార్డు చేసేందుకు జిల్లా పరిషత్ ఆవరణతో పాటు సమావేశ మందిరంలో సీసీ కెమెరాలు అమర్చారు. అపరిచిత వ్యక్తులను లోనికి అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జెడ్పీ ప్రధాన ద్వారాల రెండు వైపులా బారీకేట్లను ఏర్పాటు చేశారు.