విజయనగరం ఫోర్ట్ : జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో కారుణ్య నియామకాలకు పైరవీలు మొదల య్యాయి. నియామకాల కోసం పెద్దమొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లగా జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. జిల్లా పరిషత్‌లో కొత్త పాలక వర్గం కొలువుదీరడంతో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పైల్ సిద్ధం చేసినట్టు భోగట్టా. అయితే కారుణ్య నియామకాలను సొమ్ము చేసుకోవాలని అధికారులు, ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పైరవీలు ప్రారంభించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ. 2 లక్షలు నుంచి రూ. రెండున్నర లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
జిల్లా పరిషత్‌లో 15 కారుణ్య నియామకాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని నాలుగైదు రోజుల్లో భర్తీ చేయనున్నట్టు తెలిసింది. కాసులు చేతిలో పడగానే నియామక ఉత్తర్వులు అందజేయడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. సొమ్ము సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం పంపించారు. అయితే పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుండడంతో అంత సొమ్ము ఏవిధంగా ఇవ్వాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు ముందే ఈ పక్రియను చేపట్టాలని జిల్లా పరిషత్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. బదిలీలు జరిగితే సీటు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందే చక్క బెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ మోహన్‌రావు వద్ద ప్రస్తావించగా కారుణ్య నియమాకాలకు సంబంధించిన ఫైల్ ఇంతవరకు తన వద్దకు రాలేదని తెలిపారు. డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం తనకు తెలియదని చెప్పారు. నియామకాలు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలన్నారు.
కారుణ్య నియామకాల్లో కాసుల వేట!
Published Thu, Sep 4 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement