compassionate appointments
-
కారుణ్య నియామకాలు హక్కు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వోద్యోగం పొందేందుకు వాటిని హక్కుగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఈ మేరకు వెలువరించింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగి మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దన్నది మాత్రమే కారుణ్య నియామకాల వెనక ఉన్న సదుద్దేశం. అందుకోసం సదరు నియామకానికి అవసరమైన నియమ నిబంధనలను విధిగా సంతృప్తి పరచాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. -
కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణ లో మరణించిన సిబ్బంది వారసులకోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చే యాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1,600 కుటుంబాలు ఈ పథకంకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో 813 దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు బస్ భవన్‌కు ఫార్వర్డ్ చేశారు. ఇప్పట్లో ఈ నియామకాలు వద్దని గతంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించటంతో మిగతా దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, కారుణ్య నియామకాలపై ఎన్ఎంయూ నేత నరేందర్, టీజేఎంయూ నేత హన్మంతు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ధన్యవాదాలు తెలిపారు. అయితే నియామకాలు తాత్కాలిక పద్ధతిలో కాకుండా రెగ్యులర్ బేసిస్‌లో చేపట్టాలని ఓ ప్రకటనలో కోరారు. ఆ కుటుంబాలకు న్యాయం: మంత్రి పొన్నం ‘ఆర్టీసీలో నియామకాలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కండక్టర్ నియామకాలు చేపట్టాం. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు దీంతో న్యాయం జరుగుతుంది’. -
AP: గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో మరోసారి ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంటూ మరోసారి కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సర్వీసులో ఉండగా మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఊరట కల్పిస్తూ అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించనున్నారు. 2016 నుంచి 2020 జనవరి వరకు మృతి చెందిన 311 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అనుమతించారు. ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా 2020 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరణించిన ఆర్టీసీ సిబ్బంది వారసులకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈమేరకు రెండో విడత కారుణ్య నియామకాలకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మూడు దశల్లో.. 2020 జనవరి 1 నుంచి 2023 ఆగస్టు 15 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. ఆయా కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన పోస్టులను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు మిగిలిపోతే వారికి మళ్లీ జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశగా జిల్లా కమిటీల ద్వారా కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టారు. మిగిలిన ఉద్యోగాల కల్పనకు కూడా ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. ఆర్టీసీలో 715 పోస్టుల గుర్తింపు కారుణ్య నియామకాల కోసం ఆగస్టు 15 నాటికి ఆర్టీసీలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలను గుర్తించారు. రాష్ట్రంలో 12 ఆర్టీసీ రీజియన్ల వారీగా మొత్తం 715 ఉద్యోగాలను గుర్తించారు. వీటిలో డ్రైవర్ పోస్టులు 346, కండక్టర్ పోస్టులు 90, అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు 50 ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఈ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. – సీహెచ్.ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ ప్రభుత్వానికి ఎన్ఎంయూ కృతజ్ఞతలు కారుణ్య నియామకాల భర్తీకి ఆర్టీసీలో 715 పోస్టులను గుర్తించడం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు సర్క్యులర్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి జగన్, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి: AP: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరో శుభవార్త -
AP: ‘కారుణ్య’ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకం కింద టైపిస్ట్, ఎల్డీ టైపిస్ట్, యూడీ టైపిస్ట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పొందినవారు కంప్యూటర్ పరీక్ష పాసైతే వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారు ఇక నుంచి తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనకు స్వస్తి చెబుతూ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి పోలా భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యోగులు రెండేళ్లలోపు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు గత నిబంధనలను సడలించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు ఎంతోకాలంగా ఇబ్బందిపడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకం కింద టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు పొందినవారు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ టెస్ట్ పాస్ అయితేనే వారి సర్వీసు రెగ్యులర్ చేసేవారని, టైపింగ్‌కు ప్రాధాన్యత తగ్గిపోవడంతో అది నేర్పించేవారు లేక, ఆ పరీక్ష పాస్ కాలేక చాలామంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి రెగ్యులర్ కాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల నుంచి మినహాయింపు ఇచి్చందని వివరించారు. ఇది కూడా చదవండి: ‘అప్పటికీ సునీతమ్మ ఫోన్ చేయలేదు.. ఇప్పుడు బతికున్నోళ్లను బజారుకీడుస్తోంది’ -
TS: జీసీసీలో కారుణ్య నియామకాలపై గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ)లో కారుణ్య నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదుల సంఖ్యలో ఉద్యోగులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే వరుసగా మూడేళ్లు లాభాలతో కొనసాగినప్పుడే కారుణ్య నియామకాలు చేపట్టాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడేళ్ల నుంచి లాభాలు గడించినప్పటికీ కోవిడ్–19 కారణంగా ఆ తర్వాత నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో జీసీసీ కారుణ్య నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఈ ఫైలుపై సీఎం సంతకం చేశారు. దీంతో కారుణ్య నియామకాల ఆర్జీలకు అతి త్వరలో మోక్షం కలగనుంది. 330 మంది ఉద్యోగులతో.. తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్(టీఎస్జీసీసీ) పరిధిలో 330 మంది ఉద్యోగులు శాశ్వత, తాత్కాలిక పద్దతిలో పనిచేస్తున్నారు. మూడు డివిజినల్ కార్యాలయాలు, 18 సొసైటీలు, 311 రెగ్యులర్ డిపోలు, 158 సబ్ డిపోలున్నాయి. మరో 125 స్వయం సహాయక సంఘాలతోనూ జీసీసీ అనుసంధానమై కార్యకలాపాలు సాగిస్తోంది. జీసీసీ ద్వారా తేనె, ఇప్పపువ్వు, గమ్, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులతోపాటు సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, కందిపప్పు, ఇతర ఆహార మసాలాలు, సుగంధ ద్రవ్య పొడి(పౌడర్)లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలకు వంట సరుకులన్నీ దాదాపు జీసీసీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు జీసీసీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ తయారీ యూనిట్లు విశాఖ కేంద్రంగా నడిచేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రతి యూనిట్ కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో జీసీసీకి ఏటా కేటాయింపులు జరిపినప్పటికీ రాబడి అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు లాభాల బాటలో కార్పొరేషన్ ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. టీఎస్జీసీసీ పరిధిలో ఎనిమిదేళ్లలో 30 ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారు. ఇందుకు సంబంధించి క్లెయిమ్స్ పూర్తి చేసినప్పటికీ కారుణ్య నియామకాలకు అర్హులైన వారసులు 30 మంది దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీరి దరఖాస్తులు పరిశీలించి కారుణ్య నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. -
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు..
సాక్షి, అమరావతి: ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: విశాఖపై విద్వేషాల కబ్జా పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
కారుణ్య నియామకం హక్కుకాదు
న్యూఢిల్లీ: కారుణ్య నియామకం అనేది హక్కు కాదని, బాధితులకు ఊరడింపు మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హఠాత్∙సంక్షోభాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి బాధిత కుటుంబానికి కారుణ్య నియామకం దోహదపడుతుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనని, ఆర్టికల్ 16 ప్రకారం చట్టంలో నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తేల్చిచెప్పింది. 24 ఏళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తి కుమార్తెకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గతవారం తోసిపుచ్చింది. కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్‌లో పనిచేసే ఓ వ్యక్తి 1995లో ఏప్రిల్‌లో విధి నిర్వహణలో ఉండగానే మృతిచెందాడు. అప్పట్లో ఆయన కుమార్తె మైనర్. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ మేజరైన తర్వాత ఆమె కంపెనీకి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఇవ్వలేమంటూ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బాధితురాలిని కంపెనీలో చేర్చుకోవాలని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం దీన్ని సమర్థించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కంపెనీ యాజమాన్యం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 30న తీర్పును వెలువరించింది. -
CM YS Jagan: సీఎం జగన్ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం ఉండదు. అయితే 2019 అక్టోబరులో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో దాదాపు 200 మంది చనిపోయారు. అందులో అత్యధికులు కరోనా సమయంలో మరణించారు. కరోనా సమయంలో వలంటీర్లతో పాటు సచివాలయాల ఉద్యోగుల ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాల్లో వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. దానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. గొప్ప మనస్సు ఉన్న సీఎం.. సర్వీస్ నిబంధనలను సడలించి ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప మనస్సుకు అద్దం పడుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో కొనియాడింది. మానవతా దృక్పథంతో ఆలోచించి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌కు సచివాలయాల ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు విప్పర్తి నిఖిల్‌కృష్ణ, భార్గవ్ తేజ్, ఉపాధ్యక్షుడు బీఆర్ఆర్ కిషోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఓకే.. కానీ ‘మూడేళ్ల పనితీరు’ మెలిక
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు (బ్రెడ్ విన్నర్ స్కీం) లైన్ క్లియర్ అయింది. ఉద్యోగం చేస్తూ మరణించిన, అనారోగ్య సమస్యలతో అన్‌ఫిట్ అయినవారి వారసులను అర్హతల ఆధారంగా ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు పచ్చజెండా ఊపింది. కానీ నేరుగా పూర్తిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకోకుండా.. ‘మూడేళ్ల పనితీరు’ నిబంధన పెట్టింది. వారసులను మూడేళ్లపాటు కన్సాలిడేటెడ్ పే (కనీస స్థిర వేతనం చెల్లింపు) పద్ధతిన తాత్కాలికంగా నియమించుకుని.. ఆ తర్వాత పనితీరు బాగుంటే రెగ్యులర్ చేయనుంది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో.. ఈ నియామకాలను కూడా పోస్టులు ఖాళీ అయ్యే కొద్దీ, విడతల వారీగా చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టీసీలో ప్రస్తుతం 1,350 మంది ఉద్యోగుల కుటుంబాలు కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్నాయి. మూడేళ్ల తాత్కాలిక నియామకాలతో.. ఆర్టీసీలో గతంలో కారుణ్య నియామకాలు చేపట్టినప్పుడు ఉద్యోగులకు నేరుగా పేస్కేల్‌ను వర్తింపజేసేవారు. ఇప్పుడు తొలి మూడేళ్లపాటు తాత్కాలిక పద్ధతిన నియమించనున్నారు. మూడేళ్ల తర్వాత పనితీరు మెరుగ్గా ఉంటే కొనసాగిస్తారు. పనితీరు కొలమానానికి సంబంధించి 38 అంశాలతో జాబితాను కూడా విడుదల చేశారు. మూడేళ్లపాటు ఏటాకనీసం 240 పనిదినాలకు తక్కువ కాకుండా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత వారి పనితీరును అంచనా వేసేదుకు టెస్ట్ నిర్వహిస్తారు. అందులో 60 శాతం సానుకూలత సాధించాల్సి ఉంటుంది. లేకుంటే విధుల్లో కొనసాగించరు. చదవండి: జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల ఘర్షణ 2018 నుంచి ఎదురుచూపులు ఆర్టీసీలో చివరిసారిగా నాలుగేళ్ల కింద కారుణ్య నియామకాలు చేశారు. అప్పటి నుంచి దాదాపు 1,095 మంది ఉద్యోగులు చనిపోగా.. వెయ్యి మంది వారసులు, అనారోగ్య సమస్యలతో అన్‌ఫిట్ అయిన డ్రైవర్ల కుటుంబాలకు సంబంధించి 255 మంది ‘కారుణ్యం’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 80మందికి ఎంపిక ప్రక్రియ, శిక్షణ పూర్తిచేసినా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఆ సమయంలోనే ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె పరిస్థితి తారుమారు అయింది. ఖర్చు తగ్గించే పేరిట వెయ్యికిపైగా బస్సులను తొలగించి, అద్దె బస్సులను తీసుకోవడంతో సిబ్బంది మిగిలిపోయారు. దీనికితోడు రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచడంతో రెండేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకుండా పోయాయి. దీంతో కారుణ్య నియామకాలు అటకెక్కాయి. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. తగిన అర్హతల ఆధారంగా.. వారసులలో అర్హతల ఆధారంగా.. గ్రేడ్–2 డ్రైవర్, గ్రేడ్–2 కండక్టర్, శ్రామిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టుల్లో ఒక దానికి ఎంపిక చేస్తారు. నెలకు డ్రైవర్‌కు రూ.19 వేలు, కండక్టర్‌కు రూ.17 వేలు, మిగతా రెండు పోస్టులకు రూ.15 వేల చొప్పున కన్సాలిడేటెడ్ పేను ఖరారు చేశారు. సంస్థలో ఖాళీలు ఏర్పడే కొద్దీ వీరికి పోస్టింగ్ ఇస్తారు.ఇప్పటికే ఎంపికై ఎదురు చూస్తున్న వారికి ముందుగా పోస్టింగ్ ఇస్తారు. మిగతావారిలో మొదట చనిపోయిన ఉద్యోగుల వారసులకు ముందుగా అనే విధానంలో పోస్టింగ్ చేపడతారు. విధి నిర్వహణలో భాగంగా బస్సుల్లో/సంస్థ ప్రాంగణాల్లో ఉండి.. ప్రమాదాలు, గుండెపోటు, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలతో చనిపోయినవారి వారసులకు సీనియారిటీతో సంబంధం లేకుండా ముందుగా పోస్టింగ్ ఇస్తారు. -
కారుణ్యం.. దారుణం..బట్టబయలు చేసిన మెటర్నిటీ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమనాలో..నిద్రమత్తు అనాలో కానీ..గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరుకు ఇదో మచ్చు తునక. ఓ మహిళ తనకు వివాహం కాలేదని చెప్పి..ఏకంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళాఉద్యోగి ఒకరు మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్మెంట్ నిమిత్తం చేసుకున్న దరఖాస్తును జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారులు వాటిని చెల్లించే రాష్ట్రస్థాయి వైద్య విభాగానికి పంపించారు. ఫైలును పరిశీలించిన సదరు విభాగం మెటర్నిటీ ప్రయోజనాలను రెండు కాన్పుల వరకు మాత్రమే పొందే అవకాశం ఉందని, ఆమెకది నాలుగో కాన్పు అయినందున నిధులివ్వడం కుదరదని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫైలును తిప్పి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో..అసలు ఆమె ఉద్యోగంలో చేరడమే అక్రమ మార్గంలో చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకం కింద రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన ఆమె తనకు వివాహం కాలేదని పేర్కొంటూ ఉద్యోగం పొందినట్లు వినిపిస్తోంది. ఇప్పుడు మెటర్నీటీ ప్రయోజనం పొందేందుకు ఆస్పత్రి సేవల ఖర్చులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు జతచేయడంతో వాటిని పరిశీలించిన సంబంధిత విభాగం నాలుగోకాన్పుగా గుర్తించింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు వారి సంతానంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వవచ్చునని, అమ్మాయిలైతే వివాహం కాని వారికి వర్తిస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మిగతా సంతతి నిరభ్యంతరం కూడా అందుకు అవసరం.ఈ నేపథ్యంలో అసలు ఆమె నియామకమే అక్రమంగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం ద్వారా విచారణ జరిపించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంధ పాలన ఎన్నాళ్లు..? ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారులు ఎన్నాళ్లు అంధ పాలన సాగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యుటేషన్‌పై వచ్చి మూడేళ్లకు తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఐదేళ్లు దాటినా.. ఆ తర్వాత సైతం జీహెచ్ఎంసీయే సొంత డిపార్ట్మెంట్లా పాతుకుపోయిన వారి విషయంలోనే ఏమీ చేయని ఉన్నతాధికారులు.. ఇతర విభాగాల్లోనూ వక్రమార్గాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...) -
కారుణ్య నియామకాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో భేటీ సందర్భంగా మరో కీలక ప్రటకన చేశారు. గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా.. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల సమక్షంలోనే సీఎస్, అధికారులను మరోసారి ఆదేశించారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్) ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ని 23 శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది. చదవండి: (వైఎస్ జగన్, వైఎస్సార్ లాంటివారే అలా చేయగలరు: సజ్జల) -
కారుణ్య నియామకాలు 30లోగా పూర్తి
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విధి విధానాలు, షెడ్యూల్‌ను నిర్దేశిస్తూ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ప్రక్రియ ఇలా.. ► ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు తమ పరిధిలోని అర్హుల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 20లోగా పూర్తి చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్ సెలక్షన్ కమిటీలు ఈ నెల 23లోగా పూర్తి చేస్తాయి. ► కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు ఎంపికను రీజనల్ కమిటీలు ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ► ఎంపికైన వారికి ఈ నెల 27లోగా వైద్య పరీక్షలు చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఉద్యోగాలకు రీజనల్ మేనేజర్లు ఈనెల 30లోగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ► కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. క్లాస్–4 ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, నాన్‌గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.8 లక్షలు, గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. ఉద్యోగ సంఘాల హర్షం.. కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
వచ్చే నెల 30వ తేదీలోగా ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌తో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కారుణ్య నియామకాలను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక, వివిధ శాఖలకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ల దాఖలు, కోర్టు తీర్పుల సత్వర అమలు, వివిధ పథకాలకు కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాబట్టడం, నూతన ప్రతిపాదనలు సమర్పించడం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. ప్రతి నెలా మొదటి బుధవారం సమావేశం ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నెలా మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ► రాష్ట్ర సచివాలయం మొదలు.. గ్రామస్థాయి వరకూ ఈ–ఆఫీస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ► ఒక అంశానికి సంబంధించిన ఫైలును.. క్షేత్రస్థాయి కార్యాలయం మొదలు, రాష్ట్ర సచివాలయం వరకూ ఒకే నంబర్‌తో నిర్వహించేలా చూడాలని, దీనికి సంబంధించి కొన్ని యునిక్ నంబర్లను రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. ► వివిధ శాఖల్లో డీపీసీ క్యాలెండర్ల ప్రకారం సకాలంలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌చంద్ర, పూనం మాలకొండయ్య, ప్రవీణ్‌కుమార్, అజయ్ జైన్, కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు. -
తక్షణమే ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో మరణించిన పురపాలక ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశం కల్పించే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఈ మేరకు, కరోనాతో మరణించిన ఉద్యోగుల వివరాలతో పాటు కారుణ్య నియామకాల కోసం వారి వారసుల నుంచి వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని రెండు రోజుల్లోగా నిర్దేశిత నమూనాలో పంపించాలని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ గురువారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో పురోగతిపై ప్రతీ వారం నివేదికలు సమరి్పంచాలని పురపాలక శాఖ ప్రాంతీయ డైరెక్టర్లను కోరారు. అర్హులైన దరఖాస్తుదారులకు రెండు, మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. -
ఉద్యోగస్తుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: పేర్ని నాని
సాక్షి, విజయవాడ : మంత్రిగా ఉండే రెండున్నర సంవత్సర కాలంలో తనను కలిసిన ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో జేఏసీ గొప్ప గొంతుగా నిలవడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉన్నా ఉద్యోగులకు న్యాయం జరిగితే చాలు అని అన్నారు. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి అండ కల్పిస్తూ ప్రస్తుతం కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని ఆలోచన చేశామన్నారు. మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి కారుణ్య నియామకాలలో ఎవ్వరినీ అనర్హుల జాబితాలో పెట్టలేదని అన్నారు. మానవత్వం, హృదయంతో ఆలోచించి మంత్రులుగా పాలన అందించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని మంత్రి తెలిపారు. 2014 తర్వాత పాలకులు ఉద్యోగ సంఘ నాయకుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఎన్నికల ప్రచారాలకు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చారని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వానికి సంఘం, జెండాలతో పనిలేదని జెండా నీడలో ఉన్న కార్మికులే ముఖ్యమని తెలిపారు. ప్రజల ఆశయాల మేరకు ప్రభుత్వం పనిచేయాలి ఉద్యోగస్తుల సంక్షేమమే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి తెలిపారు. సీపీఎస్ రద్దుకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడని అన్నారు. విపరీతమైన ఆర్థిక బాధలు ప్రభుత్వానికి ఉన్నాయని, అందుకే ఆలస్యం అవుతుందన్నారు. మీ నమ్మకాన్ని ముఖ్యమంత్రి వమ్ము చేయరని, మూడు రాజధానుల అంశంలో తమ మద్దతుకు జేజేలు పలుకుతున్నామన్నారు. సీఎం జగన్ నిర్ణయానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు ,అంచనాల మేర ప్రభుత్వం పని చేయాలని, ముఖ్యమంత్రి ప్రభుత్వం చిన్న ఉద్యోగి నుంచి అందరికీ ఋణపడి ఉంటుందన్నారు. తమకు ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నీతిమంతులకు అండగా ఉంటుంది ‘‘అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 85 నుంచి 90 శాతం సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీలు నెరవేర్చగలడానికి కారణం మీరే. మీ శ్రమ ద్వారా ఈ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. మీ త్యాగం ప్రభుత్వం మరువదు. మీ గొంతులోని తీవత్ర ఆద్రత ముఖ్యమంత్రి చెవిలో వేస్తాను. అవినీతి ఆలోచనలు చేస్తే 2 నిమిషాల్లో పీకేస్తానని సీఎం తెలిపారు. రవాణ శాఖలో లంచం లేకుండా ప్రమోషనన్లు ఈ ప్రభుత్వంలోనే జరిగాయి. మా ప్రభుత్వం నీతిమంతులకు అండగా ఉంటుంది. డబ్బు కోసం అధికారులు ప్రజలను పీడించకుండా ఉండాలి. హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాము. ఉద్యోగులకు ఈ .హెచ్ .యస్ హెల్త్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటాము. క్లాస్ 4 ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాము. ఆర్టీసీ బస్టాండులో ప్రవేటు స్కూల్ బస్సులు రానీయం. ప్రభుత్వ డ్రైవర్లు, మహిళా ఉద్యోగులు, బాషాపండిట్‌ల సమస్యలు పరిష్కరిస్తాం’’. అని ప్రభుత్వ ఉద్యోగులను ఉద్ధేశించి మంత్రి మాట్లాడారు. -
జెడ్పీలో కారుణ్య నియామకాలు
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు లభించాయి. జిల్లా పరిషత్ పరిధిలో మండల, జిల్లాస్థాయిలో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆయా జిల్లాలకు కేటాయించారు. సూపర్ న్యూమరీ జూనియర్ అసిస్టెంట్లుగా ఆరుగురికి, టైపిస్టులుగా ముగ్గురికి, అడెండర్లుగా నలుగురికి ఉద్యోగం దక్కింది. శుక్రవారం జిల్లా పరిషత్ చాంబర్లో చైర్మన్ జనార్థన్ రాథోడ్, వైస్ చైర్మన్ ఆరె రాజన్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. జెడ్పీలో రికార్డు అసిస్టెంట్లుగా పని చేస్తున్న నలుగురికి పదోన్నతి కల్పించారు. ఇందులో గుండయ్య (మంచిర్యాల), కూనల్సింగ్ (ఆదిలాబాద్) ఉన్నారు. మరో ఇద్దరు నిరాకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. 2012 నుంచి నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని, చైర్మన్‌గా ఎన్నికై మొదటిసారి కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని నాలుగు జిల్లాలకు కేటాయించామని వివరించారు. సీనియార్టీ జాబితా తయారు చేసి సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. 427 జీవో ప్రకారం ప్రతీ యేడాది మంజూరయ్యే ఐదు పోస్టులను కలెక్టర్ ద్వారా మంజూరు చేయించామన్నారు. ఈ జెడ్పీ సీఈవో కిషన్ పాల్గొన్నారు. ఉద్యోగం పొందిన వారు వీరే.. సహానబేగం, జూనియర్ అసిస్టెంట్, జెడ్పీపీ (మంచిర్యాల), గ్లోరి దీప్తి జూనియర్ అసిస్టెంట్, జెడ్పీపీ (ఆసిఫాబాద్), ఎం.శీరిష జూనియ ర్ అసిస్టెంట్ జెడ్పీపీ (నిర్మల్), రమణశ్రీ జూని యర్ అసిస్టెంట్ జెడ్పీపీ (మంచిర్యాల), అర్జున్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ జెడ్పీపీ (నిర్మ ల్), కె. సిద్దాంత్, జూనియర్ అసిస్టెంట్ (ఆదిలాబాద్), ఎం.రంజిత్‌కుమార్, టైపిస్టు (నిర్మ ల్), టి.తేజశ్రీ టైపిస్టు, (నిర్మల్), డి. నాగేంద్ర టైపిస్టు, ఇంద్రవెల్లి, ఎ.దేవుబా యి, అటెండర్ (నిర్మల్), కె. కల్యాణ్, అటెండర్, బోథ్, డి. కల్యాణి, అటెండర్ (మంచిర్యాల), అబ్దుల్ మజీద్, అటెండర్ (ఆసిఫాబాద్). -
విలీనానికి ముందే కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : విలీన వేళ ఆర్టీసీ కార్మికులకు అండగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు అమలుచేయనున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుచేసి ఆర్టీసీ సిబ్బంది మొత్తాన్ని ప్రభుత్వోద్యోగులుగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల 11న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని సోమ లేదా మంగళవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల మొత్తం రూ.210 కోట్లను విడుదల చేసింది. గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజ మాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 2015 డిసెంబర్ 31 వరకు 237 మంది పేర్లతో ఉన్న జాబితాను ఆమోదించింది. వీరందరికీ మెడికల్ పరీక్షలు నిర్వహించి శిక్షణకు పంపించారు. కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెం.మీల నుంచి 145 సెం.మీలకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు. అలాగే డిస్ ఎంగేజ్ (డ్యూటీకి గైర్హాజరైన వారు) అయిన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. 2015 తర్వాత కారుణ్య నియామకాలను త్వరలో చేపట్టేందుకు.. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తంచేస్తున్నాయి. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మరణిస్తున్న ఘటనలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీలో సుమారు 52 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటివరకు ఇలా కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. -
కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
ఆర్టీసీకి కార్మికులే చక్రాల్లాంటి వారు. అలాంటి కార్మికుల కుటుంబాలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నా.. సంస్థే అప్పుల్లో కూరుకుపోయినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కానీ అధికారంలోకొచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీకి పునర్జీవం పోశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి చరిత్ర సృష్టించారు. తాజాగా ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. సాక్షి, అనంతపురం : ఆర్టీసీ కార్మికుల కుటుంబీకుల కల సాకారం కాబోతోంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జిల్లాలోని 110 కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. గత నెలలోనే 149 మందికి... గతనెలలోనే 31 డిసెంబర్ 2012 నాటికి మృత్యువాత పడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లోని 149 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పిం చేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 1 జనవరి 2013 నుంచి ఇప్పటి వరకు మరణించిన కార్మికుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ ఎండీ సర్క్యులర్ విడుదల చేశారు. రీజియన్‌లో 110 మంది జిల్లాలో 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 110 మంది కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వం ఆర్టీసీ కుటుంబాలను విస్మరించింది. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనతి కాలంలోనే ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవడంతో కార్మిక సంఘాల నేతలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. అభినందనీయం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రకెక్కారు. ఇప్పుడు కారుణ్య నియామాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వెయ్యి మంది కా ర్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. సీఎం సార్‌కు అభినందనలు. ఆర్టీసీ ఎండీకి కృతజ్ఞతలు. – పీవీ రమణారెడ్డి, ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు -
కారుణ్య నియామకాలకు 1,344 మంది అర్హులు!
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వ వైద్యులతో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు 4 నెలల్లో 10 పర్యాయాలు సమావేశమైంది. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న 1,921 మంది ఉద్యోగులను పరీక్షించి 1,344 మంది ఉద్యోగానికి అనర్హులని తేల్చింది. మరో 227 మందిని పైస్థాయి వైద్యపరీక్షల కోసం రిఫర్ చేసింది. వీరిలో కూడా చాలామంది వైద్యపరీక్షల్లో అనర్హులయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అనారోగ్య కారణాలతో అనర్హులైన కార్మికుల కుటుంబాల్లో వారు సూచించిన వారసుడికి ఉద్యోగావకాశం కల్పించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అన్ని ఏరియాల్లో దరఖాస్తులను స్వీకరించి ఉద్యోగ నియామకపత్రాలు అందజేస్తోంది. రామగుండం–1 ఏరియాలో డైరెక్టర్(ఆపరేషన్స్–పా) ఎస్.చంద్రశేఖర్ బుధవారం 40 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, రామగుండం–1 తదితర ఏరియాల్లో ఆగస్టు మొదటివారంలో కారుణ్య నియామకపత్రాలను అందజేయనున్నారు. వారసులకు కారుణ్యనియామక అవకాశం కల్పించేందుకు పదవీ విరమణ దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ వైద్యపరీక్షలు చేస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. మెడికల్ బోర్డ్ నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని, పైరవీలకు అవకాశం లేదన్నారు. కార్మికులెవరూ ప్రలోభాలకు గురికావద్దని, ఎవరైనా పైరవీల పేరిట మోసం చేసేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
1,500 మంది ఆశలపై నీళ్లు..
-
ఆర్టీసీలో కారుణ్యం రద్దు
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై యాజమాన్యం కాఠిన్యం ప్రదర్శిస్తోంది. ఇకపై ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా తనువు చాలిస్తే వారి కుటుంబంలో అర్హులకు ఉద్యోగం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. గత ఆర్టీసీ బోర్డులోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వివరాల్లోకి వెళ్తే.. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాల విధానాన్ని అమలుచేస్తున్నారు. అయితే, 1996–2000 మధ్య కాలంలో గతంలో చంద్రబాబు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు నిలిపేశారు. ఇప్పుడు కూడా ఆయన హయాంలో ఏకంగా కారుణ్య నియామకాలను రద్దుచేయడం గమనార్హం. కాగా, సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం సుమారు 1,500 మందిపై ప్రభావం చూపనుంది. మరోవైపు.. కారుణ్య నియామకాలకు సంబంధించి నిబంధనల పేరుతో వంద మంది మహిళా అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై అక్కడి యాజమాన్యం అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం (ఉద్యోగం ఇవ్వకుండా అదనంగా కొంత మొత్తం ప్రయోజనం కల్పించే విధానం) అమలుచేస్తున్నారని, ఇక్కడ అదే విధానాన్ని అమలుచేస్తున్నట్లు సంస్థ చెబుతున్నప్పటికీ ‘రద్దు’ నిర్ణయాన్ని మాత్రం యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఏఎంబీలోనూ వివక్ష కారుణ్య నియామకం లేకుండా అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం (ఏఎంబీ) కింద గతంలో రూ.లక్ష ఇచ్చేవారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం వద్దనుకునే వారికి కొంత మొత్తం ఆర్టీసీ అందించే వీలుంది. 3, 4వ తరగతి ఉద్యోగి అయితే వారి కుటుంబానికి రూ.లక్ష.. రెండో తరగతి అంటే సూపర్వైజర్గా పనిచేసే ఉద్యోగి కుటుంబానికి రూ.1.25 లక్షలు, ఆఫీసర్ కేడర్ అయితే రూ.1.50 లక్షలు అందేలా ఏర్పాటుచేశారు. అయితే, ఇప్పుడు అన్ని కేడర్లకు ఒకే విధంగా రూ.5 లక్షలు అందించే విధంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 18 నుంచి అమలులోకి వచ్చేలా ఉత్తర్వులిచ్చారు. 1,500మందికి మొండిచెయ్యి ఇదిలా ఉంటే.. మూడేళ్లుగా కారుణ్య నియామకాలు కోసం సుమారు 1,500 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగం వద్దని.. తమకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని కాళ్లరిగేలా సంస్థ చుట్టూ తిరుగుతున్నారు. అయితే, వీరికి కేవలం రూ.లక్ష మాత్రమే ఇస్తామని, పెంచిన రూ.5 లక్షలు ప్రయోజనం వీరికి వర్తించదని ఆర్టీసీ తెగేసి చెబుతోంది. అలాగే, ఉద్యోగి చనిపోతేనే కాదు.. మెడికల్‌గా అన్‌ఫిట్ అయిన ఉద్యోగి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామని 2015లో చెప్పిన యాజమాన్యం ఇప్పుడు దాని ఊసెత్తడంలేదు. దీంతో 200మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైగా ప్రభుత్వం అనుమతించిన కేడర్ పోస్టుల కంటే అదనంగా నియామకాలు చేస్తున్నారు. ఈడీలు మొదలుకుని ఆర్ఎంలు, డీవీఎంల కేడర్లలోనూ అధికంగా సిబ్బందిని నియమించుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందిని ఈ విధంగా నియమించుకుని ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని చెబుతూ కారుణ్య నియామకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: యూనియన్ నేతలు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు రద్దుచేస్తూ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎన్ఎంయూ, ఈయూ నేతలు రాజారెడ్డి, చంద్రయ్య, దామోదరరావులు తెలిపారు. కారుణ్య నియామకం వద్దనుకునే వారికి ఏఎంబీ కింద రూ.10 లక్షలు అందించాలని వారు డిమాండ్ చేశారు. -
దరఖాస్తు చేసిన వారానికే ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని, దరఖాస్తు చేసిన వారం రోజులకే ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భార్యభర్తలిద్దరు ఒకేచోట పని చేసేందుకుగాను స్పౌస్ కేసుల్లో బదిలీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ విషయాల్లో అనేక సార్లు స్పష్టతనిచ్చినా సరిగా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు సాటి ఉద్యోగుల కుటుంబాలపై సానుభూతి లేదా’అని ప్రశ్నించారు. ఖాళీలు లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించయినా ఉద్యోగాలివ్వాలన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జోషిని ఆదేశించారు. ఇది మానవత్వానికి సంబంధించిన అంశమని, చనిపోయిన ఉద్యోగి కుటుంబం వీధిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హరితహారం, తెలంగాణ కంటి వెలుగు, ధరణి వెబ్సైట్ తదితర కార్యక్రమాలపై శనివారం ప్రగతి భవన్లో కలెక్టర్లు, జేసీలతో సమావేశం నిర్వహించిన సీఎం పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో.. మిషన్ భగీరథ పనులు రెండు నెలల్లో నూటికి నూరు శాతం పూర్తవ్వాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ రూరల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పనుల వేగం పెంచాలన్నారు. భగీరథ చివరి దశకు చేరుకుందని, గ్రామాల్లో అంతర్గత పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కొన్ని చోట్ల భగీరథ పైపు లైన్లు పగులగొట్టి పొలాలకు నీళ్లు పెడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమంపై మాట్లాడుతూ.. ‘ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసవరమైన వారికి చికిత్స అందించేందుకు వచ్చే నెల చివరి వారం నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో కంటి వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. ప్రతి మండలానికి ఓ కంటి పరీక్ష బృందం నియమించాలి. గ్రామంలో ఎన్ని రోజులు క్యాంపు నిర్వహించాలో ముందే నిర్ణయించి, ప్రజలకు సమాచారమివ్వాలి. అందరూ పరీక్షలు చేయించుకునేలా చైతన్యం కలిగించాలి. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రైవేటు, ప్రభుత్వ కంటి వైద్యశాలలకు తరలించి, ఆపరేషన్లు చేయించాలి. రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని ప్రాథమిక అంచనా. వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎన్జీవోలు, విద్యార్థులు, దాతలు, టీచర్లు, మహిళా సంఘాలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి’ అన్నారు. ‘మహిళా సంక్షేమం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతర ప్రయత్నాలు జరగాలి. మహిళా అధికారులు కనీసం నెలకోసారి సమావేశమై కార్యక్రమాలు రూపొందించాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి’’అని సూచించారు. జిల్లాల్లో అవసరాలు తీర్చడం కోసం ప్రతి కలెక్టర్‌కు రూ.2 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రతులను కలెక్టర్లకు సీఎం అందించారు. జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం, ధరణి వెబ్ సైట్ ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాల వివరాలు పంపితే వెంటనే నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. స్టీల్, సిమెంట్‌తో పాటు ఇతర మెటీరియల్ ధరలు పెరిగినందున నిర్మాణ వ్యయం పెరుగుతోందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇతర నిర్మాణాల వ్యయం కూడా పెరిగినందున ధరల సవరణపై బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ సమావేశమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రగతి లేదు ‘తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా నిలిచింది. 2017–18లో 19.84 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించింది. 2018–19లో 21 శాతం వచ్చే అవకాశం ఉంది. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత ప్రగతి లేదు. పెరిగిన సంపద ప్రజల బాగోగులకు వినియోగించాలి. భవిష్యత్ తరాలకు ఎంత సంపద ఇచ్చినా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుంటే అది వృథా. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంచడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్లు బాధ్యతతో నిర్వర్తించాలి. గ్రామాల్లోని నర్సరీలను సందర్శించాలి. గ్రామాల్లో మొక్కలు పెంచే బాధ్యతలను సర్పంచులకు ఇస్తూ ఇటీవలే చట్టం కూడా తెచ్చాం. కొత్త చట్టం ప్రకారం ప్రతి పంచాయతీ, మునిసిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఇది గ్రామ కార్యదర్శి బాధ్యత. ఫారెస్ట్ రేంజ్ అధికారుల సహకారంతో నర్సరీలు నిర్వహించాలి. స్థానిక సంస్థలకు రూ. 2,500 కోట్లను బడ్జెట్లో కేటాయించాం. ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి కూడా రూ.3 లక్షల నిధులొస్తాయి. పెద్ద గ్రామాలకు రూ.25 లక్షలు వస్తాయి. ఇవి కాకుండా పన్నుల ద్వారా ఆదాయం, ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులొస్తాయి. వాటితో స్థానికంగా పనులు చేసుకోవాలి’అని చెప్పారు. -
కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హత రద్దు
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో చనిపోయిన, వైద్య కారణాలతో పదవీవిరమణ చేసిన ఉద్యోగుల భార్యలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వడానికి కావాల్సిన కనీస విద్యార్హతను రద్దుచేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం లెవల్–1 లేదా గ్రూప్–డి విభాగంలో కారుణ్య నియామకానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. కారుణ్య నియామకాల విషయం లో చాలామంది మహిళలకు కనీస విద్యార్హత లేకపోవడాన్ని పలు రైల్వే జోన్లు తమ దృష్టికి తీసుకొచ్చాయని రైల్వేబోర్డు తెలిపింది. దీంతో కనీస విద్యార్హత నిబంధనను రద్దుచేశామంది. కొద్దిపాటి శిక్షణతో ఈ మహిళలు విధులు నిర్వర్తించగలరని ఉన్నతాధికారులు సంతృప్తి చెందితే కారుణ్య నియామకాలు చేపట్టవచ్చంది. ఈ మేరకు రైల్వేబోర్డు ఏప్రిల్ 6న అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖ రాసింది. -
ఎట్టకేలకు ‘కారుణ్యం’
సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణి యాజమాన్యం ఎట్టకేలకు కారుణ్యనియమకాల సర్క్యులర్‌ను జారీచేసింది. ఈ సర్క్యులర్‌లో గతంలో ఉన్న 5 జబ్బులకు తోడు మరో 11 జబ్బులను చేర్చి మొత్తం 16 రకాల జబ్బులున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 09.03.2018 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారు అర్హులని తెలిపింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 3,600 మందికి ఊరట కలగనుంది. వీరు అర్హులు 1)పక్షవాతం, 2)మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, 3)కాలేయ సంబంధిత వ్యాధులు 4)కేన్సర్, 5)మానసిక వ్యాధులు, 6)మూర్ఛ, 7) గని ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు (ఉదాహరణకు కాళ్లు, చేతులు, కళ్లు ఇతరత్రా), 8)గుండె జబ్బులు, 9)టీబీ 10)హెచ్ఐవీ 11)కుష్టు వ్యాధి 12)కీళ్లవ్యాధి 13) దృష్టిలోపం, వినికిడిలోపం 14)మెదడు సంబంధిత వ్యాధులు 15) ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు 16) రోడ్డు, ఇతర ప్రమాదాలలో గాయపడి అంగవైకల్యం పొందిన వారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారి ఉద్యోగం పొందే వారసుడి వయసు 35 సంవత్సరాలు ఉండాలని నిబంధన విధించింది. అయితే గతంలో (2015) ఇచ్చిన వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో సర్వీసు ఒక్క సంవత్సరం ఉన్నవారికి, వయోపరిమితి 40 సంవత్సరాలు ఉన్నవారికి అవకాశం కల్పించింది. యాజమాన్యం ఈ సర్క్యులర్‌లో 2 రెండు సంవత్సరాల సర్వీసుతోపాటు, వయోపరిమితిని 35 సంవత్సరాలకు కుదించింది. దీంతో చాలామంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముందని, యాజమాన్యం పునరాలోచించాలని పలు కార్మిక సంఘాల నాయకులు వేడుకుంటున్నారు. ఏడాది వారికీ అవకాశం కల్పించాలి కారుణ్య నియామకంలో యాజమాన్యం ఒక్క సం వత్సరం సర్వీసు ఉన్నవారికి కూడా అవకాశం కల్పి స్తే ఆమోద యోగ్యంగా ఉంటుంది. మరికొంత మందికి అవకాశం వస్తుంది. వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారే అర్హులని పేర్కొనడం సరికాదు. –భూక్యా శ్రీరామ్, పీవీకే–5షాఫ్టు గని రేపు దిగిపోయేవారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు రేపు దిగిపోయే కార్మిక కు టుంబానికి కూడా సహా యం చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారు అర్హుల ని ప్రకటించటం దారుణం. అందరూ తెలం గాణ వాసులే. అంతా సింగరేణి తల్లీవడి పిల్లలే. అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి. –వీరస్వామి, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ వయోపరిమితి పెంచాలి వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచాలి. తాజాగా విడుదల చేసిన కారుణ్య నియామకాల సర్క్యులర్‌లో వయోపరిమితిని 35 ఏళకు కుదించటంతో.. వందలాది కుటుంబాలు ఉద్యోగాలను పోగొట్టుకునే ప్రమాదముంది. వయోపరిమితిని పెంచి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి. –రాంశంకర్‌కోరి, పీవీకే–5షాఫ్ట్ -
సీఎం సార్ ఎప్పుడొస్తారో..?
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి పర్యటనపై సందిగ్ధం వీడడంలేదు. వస్తానని చెప్పి నాలుగు నెలలు గడిచింది. కానీ ఇంతవరకు రాలేదు. కనీసం ఎప్పుడొస్తారనే విషయం కూడా తెలియదు. ఇటు అధికారికంగా, అటు యూనియన్‌పరంగా ఎవరూ ప్రకటించడంలేదు. మరోవైపు కార్మికులు సీఎం రాక కోసం ఎదురుచూస్తున్నారు. కారుణ్య నియామకాల జాప్యంతో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారని, అందుకే సీఎం పర్యటన వాయిదా వేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. మందమర్రి(మంచిర్యాల జిల్లా): గత అక్టోబర్ 5న జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అదే నెల 8న హైదరాబాద్‌లోని ప్రగతి భవనలో కార్మికులు, టీబీజీకేఎస్ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ‘తాను ఇన్నినాళ్లు సింగరేణి కార్మికుల బాగోగు లు పట్టించుకోలేదు. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదు. కోల్‌బెల్ట్ పర్యటనకు నేనే వస్తాను’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించించారు. క్షేత్ర స్థాయిలో కార్మికులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకుంటానని సెలవిచ్చారు. సీఎం హామీ ఇచ్చి నాలు గు నెలలు గడిచిపోయింది. కానీ ఇంకా పర్యటనకు రాలేదు. కారుణ్యమే అసలు కారణం..? సీఎం పర్యటన జాప్యానికి కారుణ్య నియామకాలే ప్రతిబంధకంగా మారాయని తెలుస్తోంది. వారసత్వ ఉద్యోగాలకు న్యాయపరమైన సమస్య ఏర్పడడంతో కారుణ్య నియామకాలు చేపడతామని సీఎం ప్రకటించారు. 1 నుంచి నాలుగు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉన్న వారు ఈ నియామకాలకు అర్హులని పేర్కొన్నా రు. కోటి ఆశలతో కార్మికుల పిల్లలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. యేడాది సంవత్సరం సర్వీస్ ఉన్న వారే 4వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. నాలుగు నెలలు గడిచినా కారుణ్య నియామకాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా కార్మికులు ఉద్యోగ విరమణ కూడా చేశారు. దీంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే వాయిదా... ఆరు భూగర్భ గనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా సింగరేణి ఉన్నతాధికారులు ఏర్పాట్లు సైతం చేశారు. మందమర్రిలో కాసీపేట, కేకే6 గనులతో అటు భూపాలపల్లిలో మరో రెండు గను లు ప్రారంభిస్తారన్న సమాచారం కూడా అందింది. దీంతో ఆయా ఏరియాల్లో హడావిడి చేశారు. సీఎం మాత్రం పర్యటించలేదు. టీబీజీకేఎస్ నాయకులు కూడా ఆ ప్రస్తావన తీసుకు రావ డం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచీ అధికారిక ప్రకటన రావడం లేదు. దీంతో కార్మికలోకంలో సందిగ్ధత నెలకొంది. హామీలు అమలయ్యేనా? సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా అమలు కు నోచుకోవడంలేదని కార్మికులు పేర్కొంటున్నారు. కార్మిక ఆదాయ పన్ను రద్దు నేటికీ అమలుకు నోచుకోవడం లేదని, దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయడం లేదని వాపోతున్నారు. కార్మికుల సొంతింటికల అడుగు ముందుకు పడలేదు. పదో వేతన ఒప్పందానికి సంబంధించిన ఎరియర్స్ ఇప్పటికీ చెల్లించలేదు. గతేడాది వచ్చిన లాభాల నుంచి ఏరియ ర్స్ కోసమే కొంత డబ్బు సమకూర్చామని దాట వేసే ధోరణిని ముఖ్యమంత్రి అవలంభించారని నేతలు విమర్శిస్తున్నారు. కారుణ్య నియామకాలతో సహా హామీలు గాలిలో కలిసి పోతుండడం కార్మికవర్గాన్ని తీవ్రనిరాశకు గురవుతోంది. ము ఖ్యమంత్రి స్పందించి సమస్యలు పట్టించుకోవాలని, రోడ్డున పడుతున్న కుటుంబాలను కాపా డాలని కార్మికులు కోరుతున్నారు.