
సాక్షి,హైదరాబాద్: నా మీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అభివృద్ది చేసినందుకే నాపై ప్రజలు కోపంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండగ కార్యక్రమం నిర్వహించింది. పంచాయితీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖలో కార్యుణ నియామకాల్ని చేపట్టింది. ఎంపికైన 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించింది.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదు. కానీ తమ ప్రభుత్వం కారుణ్య నియామకాల్ని చేపట్టింది. నామీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నాపై కోపంగా ఎందుకు ఉంటారు? మహిళలకు ఉచిత బస్సు కల్పించినందుకా? నాపై కోపం..? ఉద్యోగాలు ఇచ్చినందుకా నాపై కోపం? రుణమాఫీ చేసినందుకా నాపై కోపం? 59వేల మంది ఉద్యోగాలు ఇచ్చినందుకా? నాపై కోపం అని ప్రశ్నించారు. అనంతరం, తెలిపారు. అనంతరం,బిల్డ్ నౌ పోర్టల్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment