తక్షణమే ‘కోవిడ్‌’ కారుణ్య నియామకాలు  | Immediate Corona Compassionate Appointments Says T Minister KTR | Sakshi
Sakshi News home page

పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆదేశం

Published Fri, May 28 2021 10:08 AM | Last Updated on Fri, May 28 2021 10:10 AM

Immediate Corona Compassionate Appointments Says T Minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19తో మరణించిన పురపాలక ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశం కల్పించే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఈ మేరకు, కరోనాతో మరణించిన ఉద్యోగుల వివరాలతో పాటు కారుణ్య నియామకాల కోసం వారి వారసుల నుంచి వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని రెండు రోజుల్లోగా నిర్దేశిత నమూనాలో పంపించాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ గురువారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో పురోగతిపై ప్రతీ వారం నివేదికలు సమరి్పంచాలని పురపాలక శాఖ ప్రాంతీయ డైరెక్టర్లను కోరారు. అర్హులైన దరఖాస్తుదారులకు రెండు, మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement