kalvakuntla taraka ramarao
-
మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మణికొండలో రెయిలింగ్ సరిగా ఉంచకపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి రజనీకాంత్ మృతిచెందడం బాధాకరమని, ఆ సంఘటనకు పురపాలక శాఖ మంత్రిగా తాము బాధ్యత వహిస్తామని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ఆ ఘటనపై ఇప్పటికే డీఈఈ, ఏఈఈలను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కోరిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చామని, మిగతా రూ.5 లక్షలు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలు అనేవి తమకు వారసత్వంగా వచ్చిన సమస్యలని, ఏడేళ్లలో టీఆర్ఎస్ హయాంలోనూ కొన్ని నాలాల ఆక్రమణలు చోటుచేసుకుని ఉండొచ్చని వివరించారు. మండలిలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమంపై జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకరరావు అనుబంధ ప్రశ్నలు వేశారు. వీటిపై కేటీఆర్ స్పందించారు. చదవండి: నేను గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మార్పు.. కేసీఆర్ రోడ్డుమీదకు -
సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, వైద్య సిబ్బందిని ట్విటర్లో బుధవారం అభినందించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారిలో 98 శాతం మేరకు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేటలో ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇదే స్ఫూర్తితో జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ కొత్తగా 558 మందికి వ్యాక్సినేషన్ జిల్లాలో బుధవారం 558 మందికి వ్యాక్సినేషన్ చేశారు. కోవిడ్ పరీక్షలు 2,326 మందికి చేయగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వేములవాడలో రెండు, ఇల్లంతకుంటలో ఒక్క కేసు ఉంది. ప్రస్తుతం 193 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఒకరు మరణించారు. దీంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 564కు చేరింది. పొలాల బాట పట్టిన వైద్యసిబ్బంది కరోనా వైరస్ నివారణకు జిల్లా వైద్యసిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. టీకా తీసుకోవడంతోనే కరోనా వైరస్‌ను ఎదుర్కొనవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం 18 ఏళ్లు పైబడ్డ 4,60,859 మందిని గుర్తించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేస్తున్న కృషితోనే ప్రస్తుతం జిల్లాలో 135 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రత్యేక కార్యాచరణతో వ్యాక్సినేషన్ జిల్లాలో వైద్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 ఉపఆరోగ్యకేంద్రాలలో క్షేత్రస్థాయి సిబ్బందితో టీకా తీసుకోని వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు. టీకా తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకినా ఆస్పత్రికి వెళ్తే పరిస్థితులు రావని అవగాహన కల్పిస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లి మరీ టీకాలు ఇస్తున్నారు. పనిచేసుకుంటున్న వారి వద్దకు వెళ్లి టీకా తీసుకునేలా ప్రోత్సహించారు. జిల్లాలో తొలి, రెండో డోసులను 4,55,544 మందికి ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో టీకా తీసుకోని వారు 53 వేల మందిని గుర్తించారు. ఏఎన్ఎంలు నిత్యం 13 వేల నుంచి 15 వేల మందికి టీకా ఇస్తున్నారు. ఈ లెక్కన మూడు, నాలుగు రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రత్యేక సందర్భాల్లోనే టీకాకు దూరం జిల్లాలో దాదాపు నూరుశాతం వ్యాక్సినేషన్ అయ్యిందని చెప్పుకోవచ్చు. బాలింతలు, గర్భిణులు, కరోనా పాజిటివ్ ఉన్న వారు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు, వివిధ జబ్బులతో ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నవారు మాత్రమే కరోనా టీకా తీసుకోలేదు. ఇలాంటి వారు 5,335 మంది ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. Congratulations Collector Garu & DMHO team 👏 https://t.co/K8NmPztAs7 — KTR (@KTRTRS) September 29, 2021 -
కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌కు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణలో డ్రగ్స్‌పై అధికార, ప్రతిపక్షాల సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అయితే తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా నిన్న సోమవారం పరువునష్టం దావా వేయగా వివరాలు సక్రమంగా లేవని చెప్పడంతో మంగళవారం మరోసారి మంత్రి కేటీఆర్ దావా వేశారు. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. సిటీ సివిల్ కోర్టులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్ట దావా పిటిషన్ వేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సిటీ సివిల్ కోర్ట్ మూడో అదనపు సీనియర్ న్యాయమూర్తి ఆ పిటిషన్‌పై విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. అక్టోబర్ 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
‘సైదాబాద్ హత్యాచార ఘటన’పై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి లైంగిక వేధింపులు, అత్యాచారం వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా. నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి’ అని కేటీఆర్.. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు. చదవండి: టీడీపీలో కుతకుతలు.. నిన్న జేసీ, కాల్వకు.. నేడు ఉమా, ఉన్నం సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్ 9) చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి ఓ యువకుడు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది. ఈ సమయంలోనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు సంఘాలు, సామాజికవేత్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం Deeply anguished with the news of a 6 year old child’s sexual molestation & murder in Singareni colony While the perpetrator has been arrested within hours, I request Home Minister @mahmoodalitrs Garu & @TelanganaDGP Garu to ensure that justice is delivered expeditiously 🙏 — KTR (@KTRTRS) September 12, 2021 -
తక్షణమే ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో మరణించిన పురపాలక ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశం కల్పించే ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఈ మేరకు, కరోనాతో మరణించిన ఉద్యోగుల వివరాలతో పాటు కారుణ్య నియామకాల కోసం వారి వారసుల నుంచి వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని రెండు రోజుల్లోగా నిర్దేశిత నమూనాలో పంపించాలని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ గురువారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో పురోగతిపై ప్రతీ వారం నివేదికలు సమరి్పంచాలని పురపాలక శాఖ ప్రాంతీయ డైరెక్టర్లను కోరారు. అర్హులైన దరఖాస్తుదారులకు రెండు, మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. -
ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయో, లేదో: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతాంగానికి నేరుగా డబ్బులు అందించిన ఘనత తెలంగాణదని, ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్‌లో కూడా ఇదే స్పష్టమైందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... తమ ప్రణాళిక సంఘం విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని తెలిపిందన్నారు. రైతుబంధు లబ్ధిదారులు చిన్న, సన్నకారు రైతులే అని తేలిందన్నారు. వాస్తవాల్ని ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయో లేదో చూడాలన్నారు. తెలంగాణల అప్పులో ఉందని మొత్తుకుంటున్నారు.. కానీ రాష్ట్ర ఆదాయం పెరిగిందని గుర్తించాలన్నారు. అదే విధంగా షీ టీమ్స్ పైన కూడా ఒక మంచి రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ తీసుకున్న పథకాల వల్లే టీఆర్ఎస్ గెలుస్తుందని, అసాధారణ ఫలితాలు ప్రజలు ఇస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నికలో కూడా తామే గెలుస్తున్నామని గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆలోచన సరళి, విశ్వాసం టీఆర్ఎస్ పైనే ఉందని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావని అర్థం అవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాకు మాత్రమే ఎక్కువ అని, ప్రజలకు చేసిందేమీ ఉండదు మంత్రి విమర్శించారు. -
కేటీఆర్‌కు మంచు లక్ష్మీ లేఖ..
హైదరాబాద్: నటి మంచు లక్ష్మి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు లేఖ రాశారు. నగరానికి వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న నష్టం గురించి ఆమె తెలిపారు. మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారని, ఫిల్మ్ నగర్ రోడ్డు నంబరు 1లో తాను ఆ దృశ్యాన్ని చూశానన్నారు. అంతేకాక ఎత్తైన వినాయక విగ్రహాలను తరలించేందుకు అడ్డంగా ఉన్న కేబుల్ వైర్లను కూడా కట్ చేశారని చెప్పారు. వీటన్నింటిని తిరిగి బాగు చేసే బాధ్యతా ఎవరు తీసుకుంటారో ఓ సిటిజన్ గా తెలుసుకోవాలని ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం వినాయక చవితి మతపరంగా కాకుండా ఓ పోటీగా భావిస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగను ఇతరుల కన్నా వైభవంగా జరపాలని కష్టపడుతున్నారు. ఆ విధంగా కాకుండా ప్రాంతానికి ఒకే మండపం ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. అలా చేయడం వల్ల వ్యక్తులో ఐక్యమత్యం పెరుగుందన్నారు. అంతేకాక అందరూ కలిసి పండుగను జరుపుకుని, కలిసి మెలసి ఉండాలనే ఆలోచన వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా తెలుపుతున్నానని కేటీఆర్‌కు చెప్పారు. ఆయన వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకుంటారని తెలుసని ఆమె అన్నారు. రానున్న రోజులో గణపతి విగ్రహాల ఎత్తుపై పరిమితులు పెట్టాలని మంచు లక్ష్మీ కేటీఆర్‌ను కోరారు. మట్టి గణపతి విగ్రహాలకు ఆదరణ పెరగడం సంతోషంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో గణపతి వేడుక కోసం రోడ్డును తవ్వి, కట్టెలు కడుతున్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. Here's my heartfelt letter on the eve of #GaneshChaturthi. Guys, do share & support if you feel the same. @KTRTRS looking forward to best! pic.twitter.com/n8CVBtA86N — Lakshmi Manchu (@LakshmiManchu) August 25, 2017 -
పంచాయుతీరాజ్‌లో అధికార వికేంద్రీకరణ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలను బలోపేతం చేయుడానికి కృషిచేస్తానని, ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖలో అధికార వికేంద్రీకరణ చేపడతామని గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ ద్వారా లభించే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. గురువారం సచివాలయంలోని డి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం మొదటి ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం తన అదృష్టమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గ్రామీణాభివృద్ధి చేపడతావుని చెప్పారు. మొదటి ప్రాధాన్యంగా ఫ్లోరైడ్బాధిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తావున్నారు. ఐటీలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతావుని, ఇందుకోసం అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 15 నుంచి 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, 20 నుంచి 25 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. -
13ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ ప్రకటన
కోదాడటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రం మాట తప్పినా, సీమాంధ్ర పాలకుల కుట్రలతో తేడా వచ్చినా యుద్ధం తప్పదని, అది కూడా కోదాడ నుంచే ప్రారంభమవుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. బుధవారం కోదాడలోని నాగార్జున లాడ్జిసెంటర్‌లో ఏర్పా టు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్రం చెప్పినట్లుగానే నడుచుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకుంటానని చెప్పడం పచ్చి అవకాశవాదమన్నారు. సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చెబుతున్న చంద్రబాబు, తెలుగుదేశం నాయకులకు చివరకు మిగిలేది కొబ్బరిచిప్పలేనని ఎద్దేవా చేశారు. 13 సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్, తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు చేసిన ఉ ద్యమాలు, త్యాగాల ఫలితమే రాబోయే తెలంగాణ రాష్ట్రం అన్నారు. జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ మంత్రులు కొత్త సూట్లు, షేర్వాణీలు కుట్టించుకొని తామే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రులమంటూ పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విద్యార్థులు, ఉద్యోగులు ఎన్నో ఉద్యమాలు చేస్తే కంటికి కనిపించని సదరు నాయకులు నేడు తామే తెలంగాణ తెచ్చామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలు మునిగితే, ఆంధ్రవారికి మూడవ పంటకు నీరు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముంపు బాధితులకు నయాపైసాతో సహా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పా రు. అంతకు ముందు కోదాడలో పది వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాట అలరించాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, గాదరి కిశోర్, మాలె శరణ్యారెడ్డి, జేఏసీ నాయకులు రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, పందిరి నాగిరెడ్డి, జిఎల్‌ఎన్‌రెడ్డి, చిలకా రమేష్, సీపీఐ నాయకులు బద్దం భద్రారెడ్డి, బీజేపీ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.