పంచాయుతీరాజ్‌లో అధికార వికేంద్రీకరణ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలను బలోపేతం చేయుడానికి కృషిచేస్తానని, ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖలో అధికార వికేంద్రీకరణ చేపడతామని గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ ద్వారా లభించే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. గురువారం సచివాలయంలోని డి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం మొదటి ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం తన అదృష్టమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గ్రామీణాభివృద్ధి చేపడతావుని చెప్పారు. మొదటి ప్రాధాన్యంగా ఫ్లోరైడ్‌బాధిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తావున్నారు. ఐటీలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతావుని, ఇందుకోసం అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 15 నుంచి 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, 20 నుంచి 25 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.