
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మణికొండలో రెయిలింగ్ సరిగా ఉంచకపోవడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రజనీకాంత్ మృతిచెందడం బాధాకరమని, ఆ సంఘటనకు పురపాలక శాఖ మంత్రిగా తాము బాధ్యత వహిస్తామని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ఆ ఘటనపై ఇప్పటికే డీఈఈ, ఏఈఈలను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
చదవండి: టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కోరిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చామని, మిగతా రూ.5 లక్షలు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలు అనేవి తమకు వారసత్వంగా వచ్చిన సమస్యలని, ఏడేళ్లలో టీఆర్‌ఎస్ హయాంలోనూ కొన్ని నాలాల ఆక్రమణలు చోటుచేసుకుని ఉండొచ్చని వివరించారు. మండలిలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమంపై జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకరరావు అనుబంధ ప్రశ్నలు వేశారు. వీటిపై కేటీఆర్ స్పందించారు.
చదవండి: నేను గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మార్పు.. కేసీఆర్ రోడ్డుమీదకు