మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి | Software Engineer Dies Due To Heart Attack In Manikonda's Alkapur After Laddu Auction | Sakshi
Sakshi News home page

మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి

Published Mon, Sep 16 2024 11:35 AM | Last Updated on Mon, Sep 16 2024 12:58 PM

Software Engineer Dies Due To Heart Attack In Manikonda's Alkapur After Laddu Auction

సాక్షి, హైదరాబాద​: మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్‌ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. అనంతరం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం  రాత్రి  టౌన్‌షిప్‌ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన‌ లడ్డు వేలం పాటలో  శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 

15 లక్షల వరకు లడ్డు వేలం‌లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో  గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్‌లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్‌ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.
చదవండి: Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement