Alkapuri Township
-
మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి
సాక్షి, హైదరాబాద: మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. అనంతరం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డు వేలంలో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్‌లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.చదవండి: Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు! -
చిన్నారిపై లైంగిక దాడి, హత్య
హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడడమేగాక హతమార్చాడు. ఈ సంఘటన అల్కాపురి టౌన్షిప్లో జరిగింది. దినేష్ అనే కామాంధుడు అయిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక బండరాయితో మోది హత్య చేశాడు. ఇతను మధ్యప్రదేశ్‌కు చెందిన వాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలిక తల్లిదండ్రులు బీహార్‌కు చెందిన వారు. -
దండోపాయంతో ‘దారి’లోకి..
-
దండోపాయంతో ‘దారి’లోకి..
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మహిళా అనుచరులుగా చెలామణి అయిన ఫర్హానా, అఫ్షాలు కూడా మొదట్లో అతడి బాధితులే అని తేలింది. నయీమ్ బంధువులైన వీరిద్దరు అల్కాపురి టౌన్‌షిప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఇంట్లో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నార్సింగ్ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. తొలినాళ్లలో నయీమ్ క్రూరత్వాన్ని చవిచూసిన వీరు.. ఆ తర్వాతే అతడి వెంట ఉంటూ నేరాల్లో పాలుపంచుకోవడం, ఆస్తులకు బినామీగా మారడం చేశారు. మరోవైపు నయీమ్ రాష్ట్ర సరిహ ద్దులు దాటి ప్రయాణించేప్పుడు తన ఆయుధాలను మహిళల వద్ద ఉంచేవాడని తేలింది. వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అధీనంలోకి తీసుకొని బినామీగా.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలన్‌కు చెందిన ఫర్హానాకు 1999లో మిర్యాలగూడకు చెందిన సయ్యద్ అహ్మద్‌తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేసే వాడు. 2007లో భర్త చనిపోవడంతో 2009 వరకు అత్తగారింట్లోనే ఉంది. వరుసకు అన్న అయిన నయీమ్ ఇంట్లో పిల్లల్ని చూసుకునే పని చేయాల్సిందిగా అత్త చెప్పడంతో ఫర్హానా అంగీకరించింది. తన మూడో కుమారుడైన సలీమ్‌ను తీసుకుని నయీమ్ వద్దకు వచ్చింది. అప్పట్లో నయీమ్ హయత్‌నగర్‌లో ‘రంగన్న’ అనే పేరుతో ఉన్న ఇంట్లో నివసించేవాడు. ఆ ఇంట్లో యువతులపై జరిగే ఘోరాలను ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ ఫర్హానాను బెదిరించాడు. సలీమ్‌ను కూడా తీవ్రంగా హింసించడంతో అతడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. వావి వరసలు మర్చిపోయిన నయీమ్... ఫర్హానాతోనూ వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఓ దశలో ఆమె పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చిందని నమ్మిన తర్వాత తన ఆస్తులకూ బినామీగా మార్చుకున్నాడు. అల్కాపురి టౌన్ షిప్‌లోని నయీమ్‌కు మూడంతస్తుల ఇల్లు ఉంది. మూడో అంతస్తులో జిమ్ ఉండగా రెండో అంతస్తులో నయీమ్ తన భార్య పిల్లలతో ఉండేవాడు. మొదటి అంతస్తులో ఫర్హానాతోపాటు యువతులు, మైనర్లు, గ్రౌండ్ ఫ్లోర్లో డ్రైవర్ కేసీఆర్ అలియాస్ కిషోర్ నివసించే వాడు. నయీమ్ తమపై చేస్తున్న అఘాయిత్యాలను మైనర్లు అప్పుడప్పుడు ఫర్హానాతో చెప్పేవారు. వారిని ఆమె ఓదార్చుతున్న విషయం తెల్సుకున్న నయీమ్.. శిక్షగా ఆమెకు గుండు గీయించాడు. ఫర్హానాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత నేరాల్లోనూ ఆమెను వాడాడు. సొంత బావ నదీంను చంపిన తర్వాత మృతదేహాన్ని కొత్తూర్ తీసుకు వెళ్లి కాల్చేయడానికీ ఫర్హానాను వెంట తీసుకెళ్లాడు. పని ఇప్పిస్తానంటూ.. అఫ్షాను.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని ఈదులగూడెంకు చెందిన అఫ్షా వరుసకు నయీమ్ మేనకోడలు. ఈమె తండ్రికి భువనగిరిలో కేబుల్ నెట్వర్క్ ఉండేది. భువనగిరిలో పదో తరగతి వరకు చదివిన అఫ్షా చదువు అక్కడితో ఆపించి, తన వద్దకు పంపమంటూ నయీమ్ ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో చదువు మాన్పిం చిన అఫ్షా తల్లిదండ్రులు 2010లో మిర్యాలగూడకు చెందిన అమీర్‌కు ఇచ్చి ఆమె వివాహం చేశారు. డిగ్రీ పూర్తి చేసిన అమీర్ ఖాళీగానే ఉండటంతో అతడి తండ్రే కుటుంబ పోషణ చూసేవారు. ఏడాది తర్వాత వీరికి పాప పుట్టింది. ఓ సందర్భంలో బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా నయీమ్ కూడా అక్కడకు వచ్చాడు. అఫ్షా, ఆమె భర్తను చూసిన నయీమ్ హైదరాబాద్ వస్తే పని ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వారు పాపతో సహా అప్పట్లో నయీమ్ ఇంటికి వచ్చారు. కొన్ని రోజులకు అమీర్ ప్రైవేట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. బావ నదీంను హత్య చేయడానికి నిర్ణయించుకున్న రోజే అఫ్షాను నయీమ్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆమె జీవితం నయీమ్ చేతిలో చిక్కింది. కొన్ని నేరాల్లోనూ పాలుపంచుకుంది. వారంతా ఎక్కడున్నారు? అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంటికి మారడానికి ముందు నయీమ్ షాద్‌నగర్‌లో ఓ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఏడాది పాటు తన తమ్ముడి భార్య హీనా, కుమార్తె చియాన్లను తీవ్రంగా హింసించగా వీరిద్దరూ సైతం కనిపించకుండా పోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే నయీమ్ మిర్యాలగూడ నుంచి సాదియా, మాలియా, జోహా పేర్లతో ఉన్న యువతులను చదివిస్తానంటూ తీసుకువచ్చాడు. ఆ ముగ్గురిపైనా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించేవాడు. వీరితో పాటు నయీమ్ తమ్ముడి కుమార్తె షమ, బంధువు అషు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలియట్లేదు. అలాగే రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో తన వెంట ఉండే శమ అలియాష్ అహేలా, సదా అలియాస్ నీలోఫర్, కరీన అలియాస్ అఫ్సలను తీసుకెళ్లేవాడు. వారికి జీన్‌ప్యాంట్స్ వేసి నడుముకు ఆయుధాలు ఉంచేవాడు. ఆపై బుర్ఖా వేయించి తనతో పాటే తీసుకువెళ్లేవాడు. వీరు ఎవరు? ఎక్కడున్నారన్న అంశాలపై పోలీసు విభాగం దృష్టిపెట్టింది. -
నయీమ్ చుట్టూ ‘గడాఫీ’ సైన్యం!
* ఆడవాళ్లే రక్షణ కవచాలు.. డెన్ల రక్షణ బాధ్యతలూ వారికే * ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో లిబియాకు నియంత గడాఫీని మించిపోయాడు. గడాఫీ తరహాలో తనకు రక్షణ కవచంగా మహిళలను, యువతులను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆయుధాల వినియోగంలోనూ శిక్షణ ఇప్పించాడు. అవసరమైన సందర్భాల్లో వారిని ‘ఎర’లుగానూ వినియోగించుకున్నాడు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు మహిళల విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నయీమ్ ఇంట్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఫర్హానా వంట మనిషిగా పనిచేస్తోంది. అదే పట్టణానికి చెందిన అమీర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య అఫ్సానా అలియాస్ ఇన్షియాద్ నయీమ్ ఇంట్లోనే ఉండేది. వారిద్దరూ నయీమ్‌కు నమ్మినబంట్లు కావడంతో సెల్ఫ్ డిఫెన్స్, తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చాడు. వారికి అత్యాధునిక పిస్టళ్లు, తూటాలు అందజేసి.. భార్య, పిల్లలతో పాటు ఇంటి వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించాడు. ఆయుధాలతో పాటు స్థలాల డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, నగదును కూడా వారి సమక్షంలోనే ఇంట్లోనే దాచేవాడు. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు దాడి చేసిన సమయంలో ఫర్హానా, అఫ్సానా పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హ్యాండ్ బ్యాగుల్లో పిస్టళ్లు, తూటాలు దొరికాయి. ఆశ్రయం కల్పిస్తామని తీసుకువచ్చి.. నయీమ్ నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, తండాల నుంచి ఆడపిల్లల్ని డబ్బు చెల్లించి తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారితో పాటు చిన్న వయసులోనే భర్త చనిపోయిన, అనాథలుగా మారిన వారిని కూడా ఆశ్రయం కల్పిస్తామంటూ తీసుకువచ్చి కొందరు బంధువులు నయీమ్‌కు అప్పగిస్తున్నారని తెలిసింది. సోమవారం నయీమ్ ఇంట్లో పట్టుబడిన ఐదుగురు ఆడపిల్లలూ ఇలానే అక్కడికి చేరి ఉంటారని భావిస్తున్నారు. సెటిల్మెంట్ల కోసంగానీ, మరెక్కడికైనాగానీ వెళ్లేటపుడు మహిళలు, యువతులను తీసుకెళ్లేవాడు. అలాగైతే ఎవరో కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్నట్లు పోలీసులు భావిస్తారని.. తనిఖీలు చేయడానికి వెనకడుగు వేస్తారనే నయీం వ్యూహం. అంతేగాకుండా టార్గెట్ చేసిన వారిని ఆకర్షించడం కోసం యువతుల్ని ఎరగా వేస్తాడని పోలీసులు చెబుతున్నారు. ఇక అల్కాపురిలోని ఇంట్లో ఉన్న వంట గదుల్లో వంట చేసిన ఆనవాళ్లేమీ లేవని పోలీసులు చెబుతున్నారు. నిత్యం హోటళ్ళ నుంచి తెచ్చుకుని తినేవారని.. వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను రక్షణ కోసమే వినియోగించారని పేర్కొంటున్నారు.