హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడడమేగాక హతమార్చాడు. ఈ సంఘటన అల్కాపురి టౌన్‌షిప్‌లో జరిగింది. దినేష్ అనే కామాంధుడు అయిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక బండరాయితో మోది హత్య చేశాడు. ఇతను మధ్యప్రదేశ్‌కు చెందిన వాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలిక తల్లిదండ్రులు బీహార్‌కు చెందిన వారు.
Comments
Please login to add a commentAdd a comment