హత్యచారం కేసు: పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా | Mathura Rape and Murder Family Victim Sits on Dharna | Sakshi
Sakshi News home page

హత్యచారం కేసు: పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా

Published Wed, Dec 2 2020 2:33 PM | Last Updated on Wed, Dec 2 2020 3:17 PM

Mathura Rape and Murder Family Victim Sits on Dharna - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని మథురలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో అసలైన నిందితులను అరెస్ట్‌ చేయలేదని బాలిక కుంటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నవంబర్‌ 26న కట్టెల కోసం సమీపంలోని అడవిలోకి వెళ్లిన ఓ ఎనిమిదేళ్ల బాలిక అదృశ్యం అయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా, మరుసటి రోజు ఆ బాలిక అడివిలో విగతజీవిగా పడి కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసినట్ల ఆమె తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కానీ, ఒక మానసిక వికలాంగుడిని ఈ కేసులో అరెస్ట​ చేసి అసలు నిందితులను పోలీసులు వదిలేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ ఘటనకు పాల్పడిన మరి కొంత మంది నిందితులు బయటనే ఉన్నారని అన్నారు. అసలు నిందితులను అరెస్ట​ చేసి లోతుగా దర్యాప్తు చేయాలని బాలిక తండ్రి డిమాండ్‌ చేశాడు. అరెస్ట్‌ చేసిన మానసిక వికలాంగుడిని పోలీసులు పలుమార్లు ప్రశ్నిస్తూ వేధిస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగానే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. అదే విధంగా మరింత లోతుగా విచారిస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement