సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో భేటీ సందర్భంగా మరో కీలక ప్రటకన చేశారు. గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా.. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల సమక్షంలోనే సీఎస్, అధికారులను మరోసారి ఆదేశించారు.
చదవండి: (ఫిట్‌మెంట్‌తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్)
ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ని 23 శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది.
చదవండి: (వైఎస్ జగన్, వైఎస్సార్ లాంటివారే అలా చేయగలరు: సజ్జల)
Comments
Please login to add a commentAdd a comment