Fitment declaration
-
ఆర్టీసీలో కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ పెంపు
సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకాల కింద పనిచేసే ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం సర్వీసులో కొనసాగే వారి వేతనాల(కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్)ను ఆర్టీసీ పెంచింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరించిన విషయం తెలిసిందే. 2017 వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అమలులోకి తెచ్చింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో కన్సాలిడేటెడ్ చెల్లింపులనూ సవరిస్తూ ఆర్టీసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బ్రెడ్ విన్నర్ స్కీం పేరుతో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కొనసాగుతాయి. సర్వీసులో ఉండి చనిపోయే ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. వారి అర్హతల ఆధారంగా ఈ కేటాయింపులుంటాయి. అయితే, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో, గత ప్రభుత్వం కారుణ్య నియామకాలను సరిగా చేపట్టలేదు. దీంతో దాదాపు 1800 కుటుంబాలు ఎదురుచూస్తూ వచ్చాయి. ఆయా కుటుంబాల ఒత్తిడి పెరగటంతో దశలవారీగా వారికి ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పూర్తిస్థాయి ఉద్యోగం కాకుండా, తాత్కాలిక పద్ధతిలో ఇవ్వనుంది. మూడేళ్లపాటు వారి పనితీరు పరిశీలించి తదనుగుణంగా పర్మినెంట్ చేసే విషయంపై నిర్ణయం తీసుకునేలా అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లించనుంది. డ్రైవర్ గ్రేడ్–2, కండక్టర్ గ్రేడ్–2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టుల్లో నియామకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న వారి రెమ్యునరేషన్‌ను పెంచింది. అలాగే, ఆర్టీసీలో వివిధ పోస్టుల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారు తిరిగి వారి సేవలు కొనసాగించే పద్ధతి కూడా అమలులో ఉంది. ఆయా స్థాయిల్లో ఖాళీగా ఉండే పోస్టుల ఆధారంగా వారి సర్వీసులను ఆర్టీసీ కొనసాగిస్తుంది. వారికి కూడా ఆయా పోస్టుల ఆధారంగా కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లిస్తారు. ఇప్పుడు వాటిని కూడా పెంచింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది. 2018 జూన్ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు. ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది. ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. స్వాగతిస్తున్నాం: టీఎంయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయం: ఎన్ఎంయూ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. -
సంతకాలు పెట్టి.. బయటకు వెళ్లాక మాట మారుస్తారా?
సాక్షి, అమరావతి: చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని అంశాలు అంగీకరించాక బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పీఆర్సీ సాధన సమితితో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం ముగిసిన తర్వాత కొందరు ఉపాధ్యాయ సంఘాలు చర్చలను తప్పుపట్టడంపై ఆయన స్పందించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రతి అంశంపైనా మాట్లాడారు. ఉపాధ్యాయుల గురించి వారు అడగడంవల్లే గ్రామాల్లో హెచ్ఆర్ఏను 9 శాతం నుంచి 10 శాతానికి పెంచి రూ.10 వేల సీలింగ్‌ను రూ.11 వేలకు పెంచామని తెలిపారు. ఫిట్మెంట్ ఇంకా పెంచాలని అడిగినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి వారందరినీ ఒప్పించామన్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులుగా ఉన్న స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. ఫిట్‌మెంట్‌పై అప్పుడే అభ్యంతరం చెప్పి ఉంటే దానిపైనా చర్చించే వారమని సజ్జల తెలిపారు. చివరి నిమిషం వరకు చర్చల్లో ఉండి అన్నింటికీ ఒప్పుకుని మినిట్స్‌లో సంతకాలు కూడా పెట్టి సమ్మె విరమిస్తామని చెప్పారని తెలిపారు. అంతా అయిపోయాక సంతకాలు పెట్టి బయటకు వెళ్లిన కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు చర్చలకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచి సంప్రదాయం కాదన్నారు. బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి ఏవో రాజకీయ శక్తులు వారిని బయట నుంచి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
కారుణ్య నియామకాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో భేటీ సందర్భంగా మరో కీలక ప్రటకన చేశారు. గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా.. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల సమక్షంలోనే సీఎస్, అధికారులను మరోసారి ఆదేశించారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్) ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ని 23 శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది. చదవండి: (వైఎస్ జగన్, వైఎస్సార్ లాంటివారే అలా చేయగలరు: సజ్జల) -
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి.. వేతన పెంపు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపును ఎలా వర్తింపజేయాలన్న విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంలో మరింత స్పష్టత తీసుకున్నాకే ముందుకు సాగాలని భావిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలోనూ ఆదే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,128 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 66,239 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నారు. కనిష్టంగా రూ.12 వేల నుంచి మొదలుకొని గరిష్టంగా రూ.40,270 వరకు వీరికి వేతనాలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ కొత్తగా కనీస వేతనాలను నిర్ధారించింది. అయితే పీఆర్సీ సిఫారసు చేసిన వేతనాలను వర్తింపజేయాలా? ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపును అమలు చేయలా? అన్న విషయంలో ఆర్థికశాఖ ఆలోచనలో పడింది. ఫిట్‌మెంట్‌పై సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తూ... ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సహా అన్నిరకాల ఉద్యోగులకు వేతన పెంపును వర్తింపజేస్తామని చెప్పారు. అంతకుమించి వివరాల్లోకి వెళ్లలేదు. దాంతో వీరికి పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత కరువైంది. తక్కువ వేతనాలు ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రం తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపు కాకుండా, పీఆర్సీ సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు పెద్దగా ప్రయోజనం చేకూరదని వాపోతున్నారు. మూడు కేటగిరీలుగా ఔట్సోర్సింగ్ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్/క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం నెలకు రూ. 12 వేలు మాత్రమే పొందుతున్నారు. వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసింది. మరోవైపు రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. అయితే నెలకు రూ.12 వేలు మాత్రమే పొందుతున్న కిందిస్థాయి ఔట్సోర్సింగ్ సిబ్బంది తమకు పీఆర్సీ సిఫారసు చేసిన రూ. 19 వేల కనీస వేతనం కంటే ఎక్కువ ఇవ్వాలని, లేదంటే దానినైనా కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వేతనాలపై 30 శాతం పెంపుతో వేతన స్థిరీకరణ చేస్తే ఒనగూరే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందని, దాని వల్ల తమకు న్యాయం జరగదని అంటున్నారు. గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు మాత్రమే వేతనం ఉంది. వారికి కనీస వేతనం రూ.22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. మరోవైపు ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కూడా కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. వారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. గ్రూపు–3ఏ కేటగిరీలోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ప్రస్తుతం ఆయా శాఖలు రూ. 17,500 ఇస్తున్నాయి. వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. తమకు ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంపు కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్నే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ పీఆర్సీ కొత్త వేతనాలను సిఫారసు చేసింది. తక్కువ వేతనాలున్న ఉద్యోగులు ఇపుడు తమకు వస్తున్న వేతనాలపై కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్ని చెల్లించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు. వారికి ఇపుడు రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ.40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. అయితే వీరికి వేతనాల పెంపును ఎలా చేయాలనే విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరిపాకే ముందుకు సాగాలని భావిస్తోంది. -
జీహెచ్ఎంసీకి పీఆర్సీ కష్టాలు, ప్రభుత్వం ఆదుకోవాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ వేదికగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వరంలా కనిపించగా, ఖజానాకు మాత్రం కాస్త భారంగా మారింది. రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపుపై సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి మోదం..ఖేదం అంటూ రెండు రకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. 30 శాతం ఫిట్మెంట్ వల్ల జీహెచ్ఎంసీలోని దాదాపు ఆరువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, మరో ఏడువేల మంది పెన్షనర్లకు వేతనాలు పెరగనున్నాయి. వీరితోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులకు సైతం వేతనాలు పెంచుతామని సీఎం హామీ ఇవ్వడంతో వారివీ పెరగ్గలవని భావిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాపై భారం పడనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అందరికీ వెరసి నెలకు దాదాపు రూ.120 కోట్లు వేతనాల కింద చెల్లిస్తున్నారు. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.1440 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. సీఎం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ను వర్తింపచేస్తే నెలకు దాదాపు రూ.36 కోట్ల వంతున సంవత్సరానికి రూ.432 కోట్లు అదనపు భారం పడుతుంది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కూడా పెరిగే వేతనాలు వర్తింపచేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఖజానా నుంచే వాటిని చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ వివిధ ప్రాజెక్టులను నెత్తికెత్తుకోవడంతో ఇప్పటికే ప్రతినెలా వేతనాల చెల్లింపులకు తిప్పలు పడుతోంది. గతంలో మొదటివారంలోనే వీటిని చెల్లించేవారు. ప్రస్తుతం నెలాఖరు వరకు జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు రూ.38 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి మరో రూ.38 కోట్లు ప్రతినెలా అందుతున్నందున వేతనాలు చెల్లించగలుగుతున్నారు. వేతనాలు పెరగనున్నందున అందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం పెరగనిదే కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ వర్తింపు.. జీహెచ్ఎంసీ స్థానికసంస్థ అయినా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఫిట్మెంట్ కనుగుణంగా పెరిగే జీతాలు చెల్లించేందుకు స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సమాచారమివ్వడం సంప్రదాయం మాత్రమేనని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో , ఈనెలాఖరున రిటైర్ కావాల్సిన వారు జీహెచ్ఎంసీలో 17 మంది ఉన్నారు. ఈసంవత్సరాంతానికి రిటైర్ కావాల్సిన వారు 236 మంది ఉన్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల రానున్న మూడేళ్లలో రిటైర్ కానున్న 858 మందికి లబ్ధి కలిగిందని జీహెచ్ఎంసీ పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై జీహెచ్ఎంసీలో కొందరు హర్షం వ్యక్తం చేయగా,కొందరు ఎక్కువకాలం పనిచేయాలని తమకు లేదని పెదవి విరిచారు. వేతనాలు, రిటైర్మెంట్ వయసుపెంపుపై మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి సీఎం తన పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు. మేయర్, తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు -
ఉద్యోగులకు పీఆర్సీ 30శాతం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంతా ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటనకు రంగం సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ ఈనెల 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. దీనికి ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం శాసనసభలో 30 శాతం ఫిట్మెంట్తో ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 32 శాతం వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు 33 శాతం వరకు ఫిట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నాయి. ప్రతి ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా రూ.300 కోట్లు ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా. ఈ లెక్కన 30 శాతం ఇస్తే రూ.9వేల కోట్లు ఖర్చు పెరుగుతుంది. అదే 32 శాతం ఇస్తే రూ.9,600 కోట్లు, 33 శాతమిస్తే రూ.9,900 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 29శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ పీరియడ్ రెండేళ్లకు కుదింపు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం కేసీఆర్ కూడా పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు వంటి అంశాలపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తానని శాసనసభలో వెల్లడించారు. ప్రస్తుతం రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. ఉద్యోగ నేతలు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేశారు. తర్వాత భేటీ అయ్యారు. రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పీఆర్సీ ఫిట్మెంట్, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. సంతృప్తికరంగా ఫిట్మెంట్ ఉద్యోగులకు సంతృప్తి కలిగేలా ఫిట్మెంట్ ప్రకటిస్తామని భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే 30 శాతం వరకు పీఆర్సీ ఇచ్చే అవకాశం ఉందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సంతృప్తితో ఉన్న నేపథ్యంలో 32 శాతం వరకు ప్రకటించవచ్చని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే 34శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంపుపై కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. సోమవారం ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ వంటి ఇతర అంశాలపైనా ప్రకటన రావొచ్చని సమాచారం. పీఆర్సీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి రీత్యా రాష్ట్రంలో పీఆర్సీ సిఫార్సుల ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అయితే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న నల్గొండ జిల్లా పరిధిలో ఈ అంశాన్ని ఎవరూ రాజకీయ లబ్ధి కోసం, ప్రచారం కల్పించుకోవడానికి వాడుకోరాదని షరతు విధించింది. 2017 జూన్ 29న జారీ చేసిన ఉప ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని సూచించింది. సాగర్ ఉప ఎన్నిక కారణంగా నల్లగొండ జిల్లాలో కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. పీఆర్సీ ప్రకటనకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర ఆర్ధిక శాఖ శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి లేఖ రాసింది. సీఈవో ఆఫీసు ఈ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. దీంతో పీఆర్సీపై ప్రకటన చేసేందుకు అభ్యంతరం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్ కుమార్ ఆదివారం బదులిచ్చారు. పాఠశాలల కొనసాగింపుపైనా.. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు జరుగుతున్నాయి. ఇందులో 8వ తరగతి వరకు నిలిపివేసే అవకాశం ఉంది. ఇక 9వ తరగతి విద్యార్థులకు కూడా ప్రత్యక్ష బోధనను నిలిపివేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేసే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) నిరంకుశ పాలన సాగిస్తున్నారని పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే 7.5 శాతం ఫిట్మెంట్ నిర్ణయం జరిగిందని దుయ్యబట్టారు. 43 శాతానికి తగ్గకుండా ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వాలన్నారు. హౌస్ అలవెన్స్ తగ్గించడం.. ఉద్యోగస్తులంటే చులకన భావంతో చూడటమేనన్నారు. చదవండి: పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం ‘‘తెలంగాణలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించింది. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. ఉద్యోగ సంఘాల నేతల ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీగా పనిచేశాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని.. ప్రభుత్వంపై ఉద్యమించాలని’’ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. చదవండి: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య -
త్వరలోనే పీఆర్సీ..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి నిర్ణీత గడువు లోపలే పదకొండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు అమలు కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా వచ్చే జూన్ 2న కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పదో పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ 30న ముగుస్తుంది. పదకొండో పీఆర్సీ ఎప్పుడు వేసినా దానిని ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న పీఆర్సీ అమలును ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. శరవేగంగా ప్రక్రియ.. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం వేతన కమిషన్ ఏర్పాటు, అధ్యయనం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు వంటి ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది కాలం పట్టేది. దీనికి భిన్నంగా వీలైనంత వేగంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేసేలా సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీఆర్సీ అధ్యయనాన్ని, వివిధ సంఘాలతో చర్చలను కేవలం 15 రోజుల్లో పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రులు, అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ రెండో తేదీనే పీఆర్సీ తీపి కబురు అందించాలని సీఎం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదో పీఆర్సీకి సంబంధించి బకాయిల చెల్లింపు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. దీంతో కొత్త పీఆర్సీ చెల్లింపులను జూలై నుంచే చేయాలా.. నవంబర్ తర్వాత నుంచి ఇవ్వాలా అన్నదిశగా ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నేడు స్పష్టత వచ్చే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇదే వేదికగా పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లు, తమ సిఫారసుల నివేదికను మంగళవారం సీఎంకు అందించింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ గడువు గతేడాది మార్చి నెలాఖరుతోనే ముగిసింది. 50 శాతానికిపైగా ఫిట్మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జరిపే చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక బుధవారం నాటి భేటీ సందర్భంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల చెల్లింపు, ఉద్యోగుల బదిలీలు, ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు, రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు తదితర అంశాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాస్మోపాలిటన్ నగరాల తరహాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 40 శాతం పెంచడం, కార్పొరేషన్ల పరిధిలో 30 శాతానికి, తదుపరి కేటగిరీని 20 శాతానికి పెంచే ప్రతిపాదన కూడా సీఎం పరిశీలనలో ఉంది. -
ఆద్యంతం హైడ్రామా..!
తెలంగాణ.. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటనలో బుధవారం హైడ్రామా చోటు చేసుకుంది. కార్మిక సంఘాలు 43 శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తూ ఎనిమిది రోజుల క్రితం సమ్మె ప్రారంభించగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మూడు రోజుల క్రితం స్పందించారు. వెంటనే కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసి విషయాన్ని సమీక్షించారు. ఫిట్‌మెంట్‌ను తేల్చేందుకు భారీ కసరత్తు చేసిన సబ్‌కమిటీ.. 40శాతం వరకు ఇవ్వచ్చంటూ మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. మంగళవారం రాత్రి ఉపసంఘంతో భేటీ అయిన కేసీఆర్ ఫిట్‌మెంట్‌ను 43 శాతానికి మార్చారు. బుధవారం కార్మిక సంఘాలను తుది చర్చలకు ఆహ్వానించి వారి సమక్షంలోనే ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంగుతినాల్సి వచ్చింది. అంతమొత్తం ఏపీలో ఇవ్వడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. కానీ బుధవారం ఉదయం మనసుమార్చుకున్న ఆయన కూడా 43 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించారు. చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ వెంటనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫిట్‌మెంట్‌ను కాస్తా 44 శాతానికి పెంచేశారు. వెరసి కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన దానికంటే ఒక శాతం ఎక్కువే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తొలుత 62 శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేయాలని కార్మిక సంఘాలు భావించినా.. అది మరీ ఎక్కువని భావించి వెనక్కు తగ్గి 43 శాతం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంత ఉదారంగా ఉంటారని ముందే ఊహిస్తే మరింత ఎక్కువ డిమాండ్ చేసే వారమని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఆంధ్రప్రదేశ్.. సాక్షి, హైదరాబాద్: గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా హైకోర్టు తీర్పు ఆధారంగా కార్మికులను దారిలోకి తెచ్చుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వం హైడ్రామా మధ్య ఫిట్మెంట్ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి పనిచేసినట్టు తెలుస్తోంది. సమ్మెలోకి దిగిన తర్వాత 10వ తేదీన చర్చలకు పిలిచిన మంత్రివర్గ ఉపసంఘం పరిష్కారానికి కనీసం మూడు వారాల గడువు కావాలని కార్మిక సంఘాల నేతలను కోరారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన 12వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించినప్పటికీ 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వలేమని తేల్చారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం రెండో దఫా కార్మికులతో చర్చలు జరిపింది. ఫిట్మెంట్ 33 శాతమిస్తామని ప్రతిపాదించారు. కుదరకపోవడంతో 38 శాతం వరకు వచ్చారు. ఇక చర్చలు సఫలం కావన్న భావనతో ఆ వివరాలపై మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులు మీడియాతో మాట్లాడతారని సమాచారమిచ్చారు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి అంగీకరించిందనీ, స్వయంగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వివరించబోతున్నారన్న సమాచారం ఏపీ మంత్రులకు అందడంతో హడావిడి మొదలైంది. మంత్రులు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు. ఆ వెంటనే 43 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించి మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ఉదయం నుంచి జరిగిన చర్చల్లో ససేమిరా అన్న మంత్రులు చివర్లో ఒక్కసారిగా 43 శాతం అంగీకరించడంపై కార్మిక సంఘాల నేతలను సైతం విస్మయపరిచింది. అలా ప్రకటించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంకన్నా మనమే ముందున్నామంటూ టీడీపీలో ప్రచారం మొదలైంది. ఇది జరిగిన కొద్దిసేపటికే తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దాంతో అనుకున్న క్రెడిట్ దక్కలేదే అని ఒక మంత్రి మీడియా సమక్షంలోనే నిట్టూర్చారు.