సాక్షి, హైదరాబాద్: మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)లలో కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను వర్తింపజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉన్న నియమ, నిబంధనలన్నీ కో–ఆప్టెడ్ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. శుక్రవారం ఎంపీపీ లు, శనివారం జెడ్పీపీలలో కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్ని క జరగనుంది. 1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు అనర్హులు కానున్నారు. ఎంపీపీలలో ఒకరిని, జెడ్పీలలో ఇద్దరి చొప్పున కో–ఆప్టెడ్ సభ్యులుగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిని ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సమా వేశం నిర్వహించే రోజు ఉదయం 9–10 గంటల మధ్య కో–ఆప్టెడ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశానికి కూడా ఎన్నికైన సగం కంటే ఎక్కువ మంది సభ్యుల కోరం ఉంటేనే ఈ ఎన్నిక నిర్వహిస్తారు. కో–ఆప్టెడ్ సభ్యుడిగా పోటీచేసే వ్యక్తి స్థానిక ఓటరై ఉండటంతో పాటు 21 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉండొద్దు. కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యాక ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికల కోసం నిర్వహించే సమావేశానికి వారిని ఆహ్వానిస్తారు. అయితే వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఎంపీపీ, జెడ్పీపీ కో–ఆప్షన్ ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చిన పక్షంలో డ్రా ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ కో–ఆప్టెడ్ ఎన్నిక జరగకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment