Mandal Praja Parishad
-
పవన్ కళ్యాణ్ చులకన చూపు.. ఎంపీపీలపై క్షుద్ర రాజకీయం
-
‘కో–ఆప్టెడ్’కు ఇద్దరు పిల్లల నిబంధన
సాక్షి, హైదరాబాద్: మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)లలో కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను వర్తింపజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉన్న నియమ, నిబంధనలన్నీ కో–ఆప్టెడ్ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. శుక్రవారం ఎంపీపీ లు, శనివారం జెడ్పీపీలలో కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్ని క జరగనుంది. 1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు అనర్హులు కానున్నారు. ఎంపీపీలలో ఒకరిని, జెడ్పీలలో ఇద్దరి చొప్పున కో–ఆప్టెడ్ సభ్యులుగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిని ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సమా వేశం నిర్వహించే రోజు ఉదయం 9–10 గంటల మధ్య కో–ఆప్టెడ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశానికి కూడా ఎన్నికైన సగం కంటే ఎక్కువ మంది సభ్యుల కోరం ఉంటేనే ఈ ఎన్నిక నిర్వహిస్తారు. కో–ఆప్టెడ్ సభ్యుడిగా పోటీచేసే వ్యక్తి స్థానిక ఓటరై ఉండటంతో పాటు 21 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉండొద్దు. కో–ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యాక ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికల కోసం నిర్వహించే సమావేశానికి వారిని ఆహ్వానిస్తారు. అయితే వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఎంపీపీ, జెడ్పీపీ కో–ఆప్షన్ ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చిన పక్షంలో డ్రా ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ కో–ఆప్టెడ్ ఎన్నిక జరగకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. -
నేడు అధికారులకు విప్ల నియామక లేఖలు
సాక్షి,హైదరాబాద్: శుక్రవారం మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. 7న తొలుత కో ఆప్షన్ సభ్యుల నామినేషన్ల స్వీకారం, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత ఎంపీపీ పదవులకు ఎన్నికలుంటాయి. ఒక్కో ఎంపీపీ పరిధిలో ఒక్కో కోఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక పూర్తికాకపోతే ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు అవకాశం లేదు. ఎంపీపీ పదవులకు ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ వెబ్సైట్లో ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లను పొందుపరిచింది. ఎన్నికలు జరగనున్న మొత్తం 538 ఎంపీపీల్లో మహిళలకు 269 స్థానాలు దక్కుతాయి. నేడు విప్ల అందజేత... శుక్రవారం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు (గురువారం) ఉదయం 11 గంటలలోపు రాజకీయ పార్టీలు విప్ల నియామకానికి సంబంధించిన లేఖను, ఫామ్–ఎను ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ లేఖతోపాటు విప్ జారీచేసే వ్యక్తి గుర్తింపు కార్డుతోపాటు ఆధారిత లేఖ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పత్రాన్ని గురువారం అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి నుంచి విప్ అధికారం పొందిన వ్యక్తి ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో చేయి ఎత్తే పద్ధతిలో ఎవరికి ఓటేయాలన్న దానిపై సభ్యులకు విప్ జారీచేస్తారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జనతా దళ్, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీలకు విప్ జారీచేసే అవకాశముంది. అయితే గెలుచుకునే ఎంపీపీ స్థానాలను బట్టి ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మరో ఒకటి, రెండు పార్టీలు విప్‌ను జారీచేయవచ్చునని తెలుస్తోంది. షెడ్యూల్ ఏరియాలోని వరంగల్, ఖమ్మం జెడ్పీల పరిధిలోని బయ్యారం, గార్ల, గంగారం మండలాలను షెడ్యూల్ మండలాలుగా గుర్తించారు. గతంలో షెడ్యూల్ మం డలాలు 24 ఉండగా, సవరించిన జాబితా ప్రకారం 33కు చేరుకున్నాయి. దీంతో ఎస్సీ, బీసీలకు స్థానాలు తగ్గాయి. రిజర్వేషన్ల కోటాను ఖరారు చేస్తూ ఇదే పద్ధతిలో కోటా కేటాయించాలని ఆదేశాలిచ్చారు. మహిళల హవా... రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మహిళల జనాభా అధికంగా ఉండడంతో ఆ జిల్లాల్లో వారికి ఎక్కువ ఎంపీపీ స్థానాలు కేటాయించారు. జిల్లాల వారీగా నిజామాబాద్‌లో 51.75 శాతం, నిర్మల్‌లో 51.47, జగిత్యా లలో 51.10, కామారెడ్డిలో 50.77, మెదక్‌లో 50.67, ములుగులో 50.38, రాజన్న సిరిసిల్లలో 50.36, జయశంకర్ భూపాలపల్లిలో 50.28, సిద్దిపేటలో 50.22, భద్రాద్రి కొత్తగూడెంలో 50.09, వరంగల్ అర్బన్‌లో 50.09, కరీంనగర్లో 50.08, వికారాబాద్‌తో 50.01 శాతంగా మహిళలున్నట్లు ఎస్ఈసీ రికార్డులను బట్టి తెలుస్తోంది. అదే విధంగా 17 జిల్లాల్లో సగటున 49.96 శాతం నుంచి 49.22 శాతంలో, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో 48.88 శాతం మహిళలు ఉన్నట్టు రిజర్వేషన్ల జాబితాలో ప్రకటించారు. -
ఎంపీపీ పోరు హోరాహోరీ
మర్పల్లి: మండలాధ్యక్ష పదవి కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీగా మారింది. ఈ రెండు పార్టీల నాయకులు ఎక్కడా రాజీపడకుండా ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఈనెల4న జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు తీవ్ర సందిగ్ధంగా మారింది. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలుండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 6, టీఆర్ఎస్ 5, టీడీపీ 2 స్థానాలు గెలుచుకోగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే సిరిపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన మర్రి ఇందిరమ్మ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల బలం సమానంగా మారింది. అయితే ఏకంగా ఎంపీపీ పదవినే ఇస్తామని ఇండిపెండెంట్ అభ్యర్థి గడ్డమీది సుమిత్రమ్మ మద్దతును కూడా టీఆర్ఎస్ కూడగట్టింది. అంతేకాకుండా మండల ఉప అధ్యక్ష పదవిని ఇస్తామంటూ కోటమర్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన అంజయ్యను కూడా టీఆర్ఎస్ రహస్య శిబిరానికి తరలించినట్లు సమాచారం. దీంతో ఎంపీపీ రేసులో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు నాయకులు భావించారు. అదే సమయంలో పార్టీ విప్ జారీ చేస్తే మర్రి ఇందిరమ్మ టీఆర్ఎస్కు ఓటేయడం అనుమానమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంపీటీసీ అంజయ్యతో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతున్నారని, ఆయన మద్దతును తిరిగి సంపాదించడానికి ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీంతో ఎంపీపీ ఎన్నికపై తిరిగి ఉత్కంఠ నెలకొంది. కాగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మర్పల్లిని ఎలాగైనా దక్కించుకోవాలని హస్తం నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీడీపీ నుంచి గెలుపొందిన ఇద్దరు అభ్యర్థుల మద్దతును కూడా కూడగట్టేందుకు ఆ పార్టీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు కూడా తమకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో ఎంపీపీ పీఠం ఎవరివైపు మొగ్గనుందో అంచనాకు రావడం కష్టతరంగా మారింది. -
ప్రాదేశిక పాలనే ప్రత్యేకం
విశాఖ రూరల్, పాడేరు, చోడవరం, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘ప్రాదేశిక’ పాలనలో సింహభాగం ‘ప్రత్యేక’ పాలన సాగింది. 1959 నుంచి ఇప్పటి వరకు 16 మంది స్పెషల్ ఆఫీసర్లే పరిషత్‌ను పాలించారు. దాదాపుగా 55 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ జిల్లా పరిషత్‌కు కేవలం ఏడుగురు మాత్రమే చైర్పర్సన్లుగా వ్యవహరించారు. ప్రతీ ఎన్నిక, పాలనలోను ఎన్నో ప్రత్యేకతలు, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1959కి ముందు రాష్ట్రంలో జిల్లా బోర్డులు ఉండేవి. ఆ తరువాత జిల్లా పరిషత్, పంచాయతీ సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీల రహితంగా జరిగే ఎన్నికల్లో సమితి అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకొనేవారు. 1985 వరకు ఇదే విధానం ఉండేది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ సమితిల స్థానంలో మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేశారు. 1985 కంటే ముందు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే.. ఆ తర్వాత పార్టీ గుర్తులపై ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే విధానం ప్రవేశపెట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్లను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరికొన్ని మార్పులు చేశారు. మండల ప్రజా పరిషత్‌లు మండల పరిషత్‌లు గాను, జిల్లా ప్రజా పరిషత్‌లు జిల్లా పరిషత్‌లుగా మార్చారు. మండల పరిషత్ అధ్యక్షులతో సంబంధం లేకుండా ప్రతీ మండలానికి ఒక జిల్లా ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ)ని ఎన్నుకోవడం, అలా ఎన్నికైన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1959లో పరిషత్ ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా 1959 నవంబర్ 1న జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. తొలి విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్‌గా రాజా సాగి సూర్యనారాయణరాజును ప్రభుత్వం నియమించింది. ఆయన 1962 వరకు పాలన సాగించగా ఆ తరువాత తొలిసారిగా పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాగి సీతారామరాజు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మధ్యలో స్వల్పకాలం మినహా 1976 వరకు ఆయనే జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. 1976 నుంచి 1980 వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది. 1981లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాతమాడుగుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు బొడ్డేడ రామారావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో ప్రత్యక్ష పద్ధతిలో జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునే పద్ధతి వచ్చాక బాకూరు చిన అప్పలరాజు తొలి చైర్మన్ అయ్యారు. అనంతరం పరోక్ష పద్ధతిలో మణికుమారి ఎన్నికైనప్పటికీ కోర్టు కేసుతో పదవిని చేపట్టలేకపోయారు. అనంతరం వంజంగి కాంతమ్మ, గొర్లె రామ్మూర్తినాయుడు చైర్పర్సన్ పదవులను నిర్వహించారు.