
సాక్షి, కర్నూలు : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని ఐజయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతల మేకపాటి గౌతమ్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి పార్టీ నేతలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో పలవురు నేతుల చేరారు. వీరిలో.. బన్నురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జగన్ మోహన్ రెడ్డి, మిడుతుర్ నాగిరెడ్డి, బన్నుర్ చంద్రరెడ్డి, పీరుసాహెబ్, పెట్ట జగదీష్ రెడ్డి, పేరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను పార్టీ నేతలు కండువా కప్పి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment