Karnool District
-
తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలలో వైఎస్సార్ పెన్షన్ కానుక
-
కర్నూలు: కోవిడ్ నిబంధలను అనుసరించి ఉల్లి క్రయవిక్రయాలు
-
కర్నూలులో ఉరుములు, మెరుపులతో అకాల వర్షం
-
కర్నూలులో కొత్తగా 11 ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రులు..
ఆదోని : కర్నూల్ జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామని డిప్యూటి సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కాగా, ఆదోని కస్తూరిభా గాంధీ స్కూల్లో 53 మంది విద్యార్థులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, డీఎమ్హెచ్వో అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఆదోని గాంధీస్కూల్లో కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒకవేళ.. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని ఆదేశించారు. అదేవిధంగా, కరోనాను ఎదుర్కొవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
ఆరోగ్య శ్రీ తో వినికిడి వరాన్ని పొందిన చిన్నారులు
-
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి
-
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ఏపీ సీఎం వై ఎస్ జగన్
-
కర్నూలు పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇదివరకే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, కర్నూలు : నంద్యాలలో షేక్ అబ్దుల్ సలామ్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు కారణం పోలీసులే అంటూ సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. తమ కుటుంబానికి సాయం చేసే వారు ఎవరూ లేరంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధంలేని కేసులో పోలీసులు అన్యాయంగా ఇరికించారని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు నాకు చోరీ కేసును అంటగట్టారని ఆవేదన చెందారు. కాగా ఈనెల 3న అబ్దుల్ సలాం కుటుంబం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య) పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్సలామ్ (45) తన భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్ (10)తో కలిసి మంగళవారం గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్నాడు. ఆ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు సోమవారం అబ్దుల్ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డల ప్రాణాలను సైతం తనతో తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతా కలసి రైలు పట్టాలను ఆశ్రయించారు. వారి మీదనుంచి గూడ్స్ రైలు దూసుకుపోయింది. నలుగురి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని కౌలూరు గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
దేవనకొండలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, కర్నూలు : జిల్లాలోని దేవనకొండలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో ఉన్న దాదాపు 300 కుటుంబాలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరాయి. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. మరోవైపు జీతాలు పెంచడంతో వైఎస్సార్ క్రాంతి ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన మహా నాయకుడు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి మంత్రి అభినందనలు తెలిపారు. -
ఇఎస్ఐ ఆసుపత్రుల్లో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, కర్నూలు : రాయలసీమ జోన్ జాయింట్ డైరెక్టర్ పరిధిలోని ఇఎస్ఐ ఆసుపత్రుల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని వచ్చిన నివేదిక మేరకు విజిలెన్స్ అధికారులు తగిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలోని డిస్పెన్సరీల్లో మందులకు సంబంధించిన రికార్డులను శనివారం తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం సాయంత్రానికి పూర్తి నివేదికను ఇవ్వననున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
పార్టీలకు అతీతంగా నవరత్నాలు : బుగ్గన
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం కర్నూల్లో జిల్లాలో పర్యటించిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళలను పెద్ద ఎత్తున మోసం చేశారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసిం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని బుగ్గన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని మంత్రి తెలిపారు. -
నందికొట్కూర్ ప్రచార సభలో వైఎస్ జగన్
-
దోచుకుని దేశంలో ధనిక సీఎం అయ్యారు: వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు: చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏమాత్రం మారలేదని.. ఆయన మాత్రం దేశంలో అత్యంత ధనిక సీఎం అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం అత్యంత ధనికుడని, కానీ రాష్ట్రంలోని రైతులు మాత్రం అత్యంత పేదలుగా మిగిలిపోయారని అన్నారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్రానికి చెందిన రైతులపైనే ఉందని వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషి ఇప్పటివరకూ ఏ ఒక్క సీఎం కూడా చేయలేదని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడి అరాచక పాలనను అంతంచేసి.. రాజన్న రాజ్యం తీసుకువస్తామని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని.. ప్రత్యేక హోదాను ముందుగా ప్రకటించిన వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూర్‌లో జరిగిన సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నందికొట్కూర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న తొగురు ఆర్థర్ని, ఎంపీ అభ్యర్థి బ్రహ్మనందరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హమీలను ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కటీ కూడా అమలుచేయ్యలేదు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఉన్న ఉద్యోగాలు తీయించారు. సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు తొలగించారు. ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోభృతి ఇస్తామన్నారు. కానీ 57 నెలల మోసం చేసి.. ఎన్నికలకు చివరి మూడునెలలు భృతి ఇస్తామని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయని, మన బతుకులు మారుతాయని ఎంతో ఆశపడ్డం. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు. స్థానికలకే 75శాతం ఉద్యోగాలు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి.. ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. తొలిఏడాదే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. రాష్ట్రాంలోని పరిశ్రమల్లో ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అన్ని పరిశ్రమల్లో స్థానికలకే 75శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా శాసనసభలో చట్టం చేస్తాం. ఉద్యోగాలన్ని మన పిల్లలకే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కాంట్రాక్టులకు కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు వచ్చే విధంగా చట్టం చేస్తాం. ఐదేళ్ల కాలంలో ఆయన చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు, అబద్ధంలేదు, చూపని సినిమా లేదు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మరోసారి కుట్ర చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటుకు మూడు వేల రూపాయలు పంచుతున్నాడు. అక్రమంగా గెలవడానికి మూటల మూటల డబ్బు పంపుతా ఉన్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం డ్వాక్రా మహిళను ఆదుకుంటాం. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి.వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటా.. పిల్లల్ని బడికి పంపితే చాలు ఏడాదికి 15వేలు చేతిలో పెడతాం. పేద పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పెద్దపెద్ద చదువులను చదవిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొదుపు రుణాలను మాఫీ చేస్తాం. మళ్లీ రాజన్న రాజ్యం వచ్చే విధంగా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి 75వేలు చేతిలో పెడతాం. పెట్టుబడి కోసం ప్రతి రైతుకు ఏడాదికి 15వేలు ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తాం. పెన్షన్లు పెంచుతాం. పేదలకు ఇళ్లు కట్టిస్తాం. నవరత్నాల ద్వార పేదల బతుకుల్లో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది’’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అధికార పార్టీ అడ్డదారి!
-
అధికార పార్టీ అడ్డదారి!
సాక్షి, ఆదోని రూరల్: ఆడలేక మద్దెల ఓడమన్నట్టు.. ప్రజాక్షేత్రంలో గెలిచే అవకాశాలు పూర్తిగా దూరమవడంతో కుట్రలు, కుతంత్రాలకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. ఏదోవిధంగా మళ్లీ అధికారాన్ని చేపట్టాలనే దురుద్దేశంతో ఓటర్ల తొలగింపునకు పూనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు ఫారం – 7 ద్వారా ఆన్లైన్లో వైఎస్ఆర్సీపీ నాయకులే దరఖాస్తు చేసినట్లు కుతంత్రాలు చేశారు. ఆదోని పట్టణంలోని రెండు మీసేవా కేంద్రాలు అడ్డాగా టీడీపీ నాయకులు కుట్రలు పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని నియోజకర్గంలో ఇప్పటి వరకు ఫారం–7 దరఖాస్తులు 8,500 దాఖలు అయినట్లు సమాచారం. పట్టణ పరిధిలోని 21వ వార్డులో 229 నుంచి 235 వరకు 7 పోలింగ్ బూత్‌లకు సంబంధించి దాదాపు 400 ఫారం–7 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఈ వార్డులో మొత్తం ఓటర్లు 6892మంది ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్ భీమా వెంకటలక్ష్మీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు కుట్రపన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదయ్తుల్లా, చిన్న స్వామి గౌడ్, భీమా, నర్సప్ప, బైచిగేరి రాముడు, చంద్రశేఖర్‌రెడ్డి పేర్ల మీద ఓట్లు తొలగించాలని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేశారు. దీంతో వారు ఏ మాత్రం తమ ప్రమేయమే లేదని, ఎవరు దరఖాస్తు చేశారో తేల్చాని తహసీల్దార్ విశ్వనాథ్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఫారం–7 దరఖాస్తులు వెల్లువెత్తడంతో అధికారులు సైతం అయోమయానికి గురయ్యారు. అదేవిధంగా తమ ప్రమేయం ఏ మాత్రం లేకుండా తాము దరఖాస్తు చేయడమేమిటని వైఎస్ఆర్సీపీ నాయకులు తహసీల్దార్ విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. అప్పటికే అనుమానాలు రావడంతో తహసీల్దార్ ఈ నెల 3న(ఆదివారం) టూటౌన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ 182, 419 అండ్ 66డి ఆఫ్ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పోలీసులు వాస్తవాలేంటో ప్రజల ముందు ఉంచే అవకాశం ఉన్నందున టీడీపీ నాయకులు ఎదురు దాడిని తీవ్రం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి దేశ పౌరుడిగా చెప్పుకోవాలంటే ఓటు హక్కు ఎంతో విలువైంది. నాకు పోలింగ్ బూత్ నంబర్ 229లో ఓటు హక్కు ఉంది. ఓటు హక్కును తొలగించేందుకు సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలపై అధికారులు నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టాలి. –నాగరాజు, ఎస్కేడీ కాలనీ 7వ రోడ్డు ఇది టీడీపీ నాయకుల కుట్రే మా పోలింగ్ స్టేషన్ 232లో నాపేరు, నా ఫొటోతో 23మంది ఓట్లను తొలగించాలని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసినట్లు తెలిసింది. మా వార్డులో టీడీపీకి మెజారిటీ లేకపోవడంతో కుట్రలు పన్నుతున్నారు. ఏదోవిధంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. –చిన్న స్వామి గౌడ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు -
కర్నూలు జిల్లాలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమం
-
కర్నూలు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
‘పాదయాత్ర చూసి చంద్రబాబుకు నిద్రపట్టడంలేదు’
సాక్షి, కర్నూలు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని ఐజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతల మేకపాటి గౌతమ్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి పార్టీ నేతలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో పలవురు నేతుల చేరారు. వీరిలో.. బన్నురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జగన్ మోహన్ రెడ్డి, మిడుతుర్ నాగిరెడ్డి, బన్నుర్ చంద్రరెడ్డి, పీరుసాహెబ్, పెట్ట జగదీష్ రెడ్డి, పేరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను పార్టీ నేతలు కండువా కప్పి ఆహ్వానించారు. -
కర్నూలులో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
కర్నూలులో కాల్‌మనీ కలకలం
-
కర్నూలు జిల్లాలో నాటుసారా గొడవ
-
పించన్ కోసం వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
-
జనపథం - నంద్యాల కర్నూలు జిల్లా
-
ఫ్యాక్షన్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు
-
నీళ్లను చూస్తే పరార్
-
ప్రాణం తీసిన ‘నానో’ వివాదం
-
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు
-
కర్నూలులో వింత.. వేపచెట్టుకు కల్లు
-
నేడు కర్నూలులో షర్మిల యాత్ర
సాక్షి ప్రతినిధి, కర్నూలు: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.