
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఇదివరకే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment