ఆదోని : కర్నూల్ జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామని డిప్యూటి సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కాగా, ఆదోని కస్తూరిభా గాంధీ స్కూల్‌లో 53 మంది విద్యార్థులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, డీఎమ్‌హెచ్‌వో అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. ఆదోని గాంధీస్కూల్‌లో కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు.
ఒకవేళ.. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని ఆదేశించారు. అదేవిధంగా, కరోనాను ఎదుర్కొవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
చదవండి: వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment