కడప : రాయలసీమ అభివృద్ధి విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేటలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ 300 ఏళ్లకు సరిపడే అపారమైన ఖనిజ సంపద సర్వే ఫలితాలు ఎందుకు బయటపెట్టడం లేదని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
రాయలసీమలో బయటపడ్డ ఒక్క పుల్లరిన్ ఖనిజ సంపదతోనే ఆంధ్రప్రదేశ్లో మొత్తం తారు రోడ్డులకు బదులు బంగారు రోడ్డులు వేయించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రానికి సంపదనిచ్చే రాయలసీమను కాదని ఒక్క అమరావతి మీదే ఎందుకింత ప్రేమ అని ముఖ్యమంత్రి చంద్రబాబును బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రశ్నించారు.