బైరెడ్డి అరెస్టు
నంద్యాలవిద్య: రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డిరాజశేఖర్‌రెడ్డి శనివారం నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు శనివారం పట్టణంలో బలగాలను మోహరించారు. ఇదే సమయంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్‌పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని టూటౌన్ సీఐ శ్రీనివాసులు, సిబ్బందితో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభా ప్రాంగణానికి సమీపంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల పర్యటనను అడ్డుకోవచ్చనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం బైరెడ్డిని పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.