RPS
-
రమేష్‌కు ఆర్పీఎస్ లండన్ అవార్డు
వనపర్తి: జిల్లా కేంద్రంలోని నవీన ఫొటోపార్లర్ రమేష్‌కు ఆర్పీఎస్ (రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ) లండన్ అవార్డు ప్రకటించింది. ఇటీవల చైనా దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫొటో పోటీల్లో బ్లాక్ అండ్ వైట్ విభాగంలో ఈ ఫొటోగ్రాఫర్ పది ఫొటో లు పంపించగా వాటిలో వాటర్ క్వీరీర్కు సంబంధించిన ఫొటోలకు ఆర్పీఎస్ రిబ్బన్ (తృతీయ) బహుమతి ప్రకటించారు. అలాగే మార్చిలో బెంగుళూరులో నిర్వహించిన పోటీల్లో బెస్ట్ రూరల్ లైఫ్ అవార్డు, ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో హానరబుల్ మేన్‌టేన్ ఆఫ్ మెరిట్ రిబ్బన్ అవార్డు లభించింది. -
బైరెడ్డి అరెస్టు
నంద్యాలవిద్య: రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డిరాజశేఖర్‌రెడ్డి శనివారం నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు శనివారం పట్టణంలో బలగాలను మోహరించారు. ఇదే సమయంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని టూటౌన్ సీఐ శ్రీనివాసులు, సిబ్బందితో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభా ప్రాంగణానికి సమీపంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల పర్యటనను అడ్డుకోవచ్చనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం బైరెడ్డిని పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ధోనీపై మళ్లీ తూటాలు: పుణెలో కలకలం
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతోన్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఆర్పీఎస్)లో ఆ జట్టు యజమాని వ్యాఖ్యలు కలకలం రేపాయి. సంజీవ్ గొయాంకా ఎంఎస్ ధోనీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే సంజీవ్ సోదరుడైన హర్ష్ గొయాంకా ధోనీపై పేల్చిన మాటాల తూటాలు వివాదాస్పదం కావడం, వాటికి బదులుగా ధోనీ భార్య సాక్షి ఇచ్చిన ఘాటు కౌంటర్లు హైలైట్ కావడం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ గొయాంకా.. ధోనీ, స్మిత్, జట్టులోని ఇతర ఆటగాళ్లగురించిన విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఎంఎస్ ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతని మైండ్ సెట్, గెలవాలనే తపన అమోఘం. ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతను. అయితే ధోనీ కన్నా అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న ఆటగాడు ఇంకొకరున్నారు.. అతనే స్టీవ్ స్మిత్! గెలుపు తప్ప మరేదీ వద్దనుకునే యాటిట్యూడ్ స్మిత్‌ది. అందుకే టీమ్‌మేట్స్‌కు ‘12 బంతుల్లో 30 పరుగులు కొట్టు.. లేదా, అవుటై వచ్చెసెయ్..’ లాంటి సూచనలు చేస్తాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. ఫుడ్ పాయిజన్ వల్ల స్మిత్ సరిగా ఆడని కారణంగానే ఈ సీజన్ తొలి మ్యాచ్‌లలో పుణె జట్టు సరిగా ఆడలేకపోయింది..’ అంటూ ఎడాపెడా స్మిత్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ, జట్టు విజయయాత్రలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదన్నట్లు మాట్లాడారు సంజీవ్ గొయాంకా. హైదరాబాద్‌లో ఆదివారం(మే 21న) జరగనున్న ఫైనల్స్‌లో పుణె జట్టు ముంబైతో తలపడనున్న సంగతి తెలిసిందే. 2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుణె జట్టు ప్రస్థానం ఆదివారంతోనే ముగియనుంది. దీనిపైనా గొయాంకా తనదైన శైలిలో స్పందించారు. సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్ల ఎంపికలో లోపాల వల్లే గత ఏడాది పుణె మెరుగ్గా రాణించలేదని గొయాంకా అన్నారు. ఈ సారి స్మిత్ చెప్పినట్లే.. ఇమ్రాన్ తాహిర్, బెన్ స్టోక్స్‌లు రాణించారని, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ ప్లేయర్లు మెరవడం మరింతగా కలిసి వచ్చిన అంశమని గొయాంకా అన్నారు. (ప్రతీకారంతోనే ధోనీ భార్య ఇలా చేసిందా?) -
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
-
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
-
ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన రసవత్తర పోరులో పుణె విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఆకట్టుకున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తొమ్మిది వికెట్లతో తేడాతో గెలిచి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ 73 పరుగులోకే ఆలౌట్ అయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఇది ఓవరాల్ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ అత్యల్ప స్కోరుగా నమోదైంది. పుణె బౌలర్లు శార్ధుల్ ఠాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ కుప్పకూలింది. ఇక ఆపై 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణె భారీ విజయం సాధించింది. రాహుల్ త్రిపాఠి (28) వికెట్ కోల్పోయినా మిగతా పనిని అజింక్యా రహానే (34 నాటౌట్), స్టీవ్ స్మిత్ (15 నాటౌట్) లు పూర్తి చేశారు. దాంతో ఇంకా 8 ఓవర్లకు మిగిలి ఉండగానే పుణె విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ లోకి ప్రవేశించిన రైజింగ్ పుణె పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే. -
కుప్పకూలిన కింగ్స్ పంజాబ్
► ఆఖరి పోరులో విఫలమైన కింగ్స్ పుణె: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు మధ్య జరుగుతున్న అమీతుమీ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 73 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్లే ఆఫ్ అర్హత కోసం జరుగుతున్న ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ కనీస పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. పుణే బౌలర్లు శార్ధుల్ టాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. పరుగుల ఖాతా తెరవకముందే గప్టిల్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ వృధ్దిమాన్ సాహా, షాన్ మార్ష్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా టాకుర్ మార్ష్(10) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేకపోయాడు. దీంతో కింగ్స్ పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్సర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా క్రిస్టియన్ అడ్డుపడ్డాడు. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ లో మాక్స్ వెల్, గప్టిల్ డకౌట్ అవ్వగా, అక్సర్(22), సాహా(13), మార్ష్(10), స్వప్నిల్(10) లు మినహా మిగతా అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. దీంతో కింగ్స్ పంజాబ్ 15.5 ఓవర్లకే ఆలౌట్ అయింది. -
పుణేను ఓడించడం కష్టమే: విలియమ్సన్
హైదరాబాద్: శనివారం ఉప్పల్ లో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే ఐపీఎల్ మ్యాచ్ లో పుణేను ఓడించడం కష్టమేనని సన్ రైజర్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న రైజింగ్ పుణే తో జరిగే మ్యాచ్ టఫ్ గేమ్ అని, అయినా సమిష్టిగా రాణిస్తామని విలియమ్సన్ మీడియా కు తెలిపాడు. ప్రతి ఒక మ్యాచ్ చాలేంజ్ అని, ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడామని, పుణే తో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ విజయాలు సొంతం కావని, ముఖ్యంగా టీ20 లో ఇది సాధ్యం కాదని తెలిపాడు. దీన్ని దృష్టి లో ఉంచుకోని ముందుకు వెళ్తామని విలియమ్సన్ పేర్కొన్నాడు. జట్టులో మూడో నెంబర్ బ్యాట్స్ మన్ గా జట్టుకు ఏమి కావాలో అది చేస్తానన్నాడు. జట్టుకు అవసరమైతే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్దం అన్నాడు. డెవిడ్ వార్నర్ మంచి నాయకుడని, అతని నాయకత్వంలో ఆడటం సంతోషంగా ఉందని విలియమ్సన్ తెలిపాడు. ఢిఫెండింగ్ ఛాంపియన్స్ అయినందుకు మాజట్టు పై కొంత ఒత్తిడి ఉందని, గత సీజన్ లో కంటే ఈ సీజన్ లో మా ఆట తీరు చాలా మెరుగైందని చెప్పాడు. గత మ్యాచ్ ఢిల్లీ తో భారీ స్కోరు చేసినా ఓడిపోయామని, ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, మంచి క్రికెట్ ఆడుతూ ఇంకా రెండు మ్యాచ్ లు నెగ్గి ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తామని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ ఐపీఎల్ అనుభవం వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ న్యూజిలాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు. -
టాప్ ఆర్డర్ విఫలం..పుణే లక్ష్యం 156
► తొలి ఓవర్ ను మేడిన్ చేసిన ఉనద్కత్ ► రాణించిన మనీష్, గ్రాండ్ హోమ్, సూర్యకుమార్ కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రైజింగ్ పుణేల మధ్య జరుగుతున్నఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా పుణే కు156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రైజింగ్ పుణే కోల్ కతా బ్యాట్స్ మెన్ లను కట్టు దిట్టమైన బంతులతో ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలి ఓవర్ ను మేడిన్ చేసి వికెట్ తీసిన ఉనద్కత్ ఈ సీజన్ లో తొలి ఓవర్ ను మేడిన్ చేసిన బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. దీంతో కోల్ కతా పరుగులు ఏమి చేయకుండానే వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్సన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో హిట్ వికెట్ అయి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక వైపు వికెట్లుపడుతున్న గంభీర్ దాటిగా ఆడాడు. ఈ తరుణంలో సుందర్ బౌలింగ్ లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కోట్టిన గంభీర్ మరో సిక్స్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి కోల్ కతా 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. ఈ సీజన్ లో పవర్ ప్లే లో కోల్ కతా నమోదు చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇది. హైదరాబాద్ మ్యాచ్ లో 40 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్ కూడా నిలదొక్కుకోలేకపోయాడు. మనీష్ పాండే, గ్రాండ్ హోమ్ తో కలిసి దాటిగా ఆడాడు. 4 ఫోర్లు ఒక సిక్సర్ తో 37 పరుగులు చేసిన మనీష్ పాండే క్రిస్టియన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద రహానేకు చిక్కాడు. వీరిద్దరు ఐదో వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో కోల్ కతా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆ వెంటనే గ్రాండ్ హోమ్ 36 ( 2 సిక్స్ లు, మూడు ఫోర్లు) కూడా అవుటయ్యీడు. ఉనద్కత్ వేసిన 19 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్, కౌల్టర్ నైల్ మరో సిక్స్ బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో స్టోక్స్ 1 వికెట్ తీసి నాలుగు పరుగులే ఇవ్వడంతో కోల్ కతా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది. ఇక పుణే బౌలర్ల లో ఉనద్కత్, వాషింగ్టన్ లకు చెరో రెండు వికెట్లు దక్కగా, స్టోక్స్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్టియన్ లకు ఒక్కో వికెట్ దక్కింది. -
పుణే మ్యాచ్ కు ఊతప్ప దూరం
►టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రైజింగ్ పుణే కోల్ కతా: ఐపీఎల్ లో భాగాంగా కోల్ కతా ఈడేన్ గార్డెన్స్ లో జరగతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు కోల్ కతా బ్యాట్స్ మన్ రాబిన్ ఊతప్ప దూరమయ్యాడు. ఇతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. హైదరాబాద్ తో ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలని భావిస్తుంది. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడింటిలో ఓడిపోయింది. దీంతో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ తర్వాత పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఇక గత మ్యాచ్ లో బెన్ స్టోక్స్ దూకుడు బ్యాటింగ్ తో గట్టెక్కిన రైజింగ్ పుణే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. కోల్ కతా తో నెగ్గి ప్రథమార్థంలో ఓటమికి ప్రతీకారం తీసుకోవాలని భావిస్తుంది. ►తుది జట్లు కోల్ కతా నైట్ రైడర్స్:సునీల్ నరైన్, గంభీర్ (కెప్టెన్), మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, జాక్సన్, డి గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, కౌల్టర్ నైల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్. రైజింగ్ పుణే: రహానే, రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, బెన్ స్టోక్స్, తివారీ, క్రిస్టియన్, వాషింగ్టన్ సుంధర్, తాకుర్, ఉనాద్కత్, ఇమ్రాన్ తాహీర్, -
ఉత్కంఠ పోరులో పుణేదే గెలుపు
ముంబై: వరుసగా 6 మ్యాచ్ లు గెలిచిన ముంబై ఇండియన్స్ అతివిశ్వాసంతో బరిలోకి దిగి ఓటమి పాలైంది. ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైపై 3 పరుగులు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ అద్భుత విజాయాన్ని సాధించింది. టీం మెంటర్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్న రోహిత్ శర్మ సేనకు నిరాశే ఎదురైంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. పుణే ఓపెనర్లు రహానే 5 ఫోర్లు 1 సిక్సర్ తో 38 పరుగులు, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరద్దరిని కృనాల్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ పెవిలియన్ పంపాడు. స్మిత్(17), బెన్ స్టోక్స్(17), మనోజ్ తివారీ (22) పరుగులు చేశారు. ధోని(7) నిరాశపరిచాడు. తివారీ చివర్లో వేగంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో పుణే 160 పరుగుల మార్క్‌ను చేరుకుంది. ముంబై బౌలర్లలో బుమ్రా, శర్మలకు రెండెసి వికెట్లు పడగా, జాన్సన్, హార్భజన్ లకు చెరో వికెట్ దక్కింది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఉన్న జట్టుకు 161 పరుగులు సాధారణ లక్ష్యమే. కానీ అతి విశ్వాసంతో ఆడిన ముంబై బ్యాట్స్‌మెన్ అనవసర షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. తొలి వికెట్ కు 4.2 ఓవర్లలో 35 పరుగులు జోడించాక బట్లర్ (17)ను స్టోక్స్ ఔట్ చేశాడు. పార్థీవ్ పటేల్ (33) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫె సెంచరీ (39 బంతుల్లో 58: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసినా జట్టును గట్టెక్కించలేకపోయాడు. ముంబై విజయానికి చివరి ఓవర్లలో 17 పరుగులు అవసరం కాగా, ఆఖరి వేసిన పుణే బౌలర్ ఉనత్కద్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా(13)ను, నాలుగో బంతికి రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఐదో బంతికి మెక్ క్లీనగన్ రనౌటయ్యాడు. ముంబై విజయానికి 11 పరుగులు అవసరం కాగా చివరి బంతికి భజ్జీ సిక్స్ కొట్టిన ప్రయోజనం లేకపోయింది. దీంతో పుణే వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తాను వేసిన నాలుగు ఓవర్లలో ఓ మెయిడిన్ తో పాటు రెండు కీలక వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
రాణించిన ముంబై బౌలర్లు.. ఇక బ్యాట్స్ మెన్సే!
► పుణే స్కోరు 161/6 ► శుభారంభం అందించిన పుణే ఓపెనర్లు ముంబై: వరుసగా 6 మ్యాచ్ లు గెలిచిన ముంబై ఏడోదానిపై కూడా పట్టు విడువ లేదు. టీం మెంటర్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు కానుక ఇవ్వాలని నిశ్ఛయించుకున్నారో ఎమోగానీ రైజింగ్ పుణే మ్యాచ్ లో కట్టు దిట్టంగా బౌలింగ్ చేసి బౌలర్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ముంబై బౌలింగ్ కు తలవంచిన పుణే నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి160 పరుగులు చేసింది.తొలుత టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫుణే ఓపేనర్లు 76 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించగా మిగతా బ్యాట్స్ మెన్స్ దాటిగా ఆడే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఓపెనర్లు రహానే 5 ఫోర్లు 1 సిక్సర్ తో 38 పరుగులు, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరద్దరిని కృనాల్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన కేవీ శర్మ పెవీలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, ధోని, బెన్ స్టోక్స్ లు దాటిగా ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్మిత్(17)ను హార్భజన్, బెన్ స్టోక్స్(17) ను జాన్సన్ బౌల్డ్ చేయగా, ధోని(7) పరుగులతో బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయి నిరాశపర్చాడు. మనోజ్ తివారీ (22) దాటిగా ఆడే ప్రయత్నం చేసి ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, శర్మలకు రెండెసి వికెట్లు పడగా, జాన్సన్, హార్భజన్ లకు చెరో వికెట్ దక్కింది. -
హార్దిక్ పాండ్యా చితక్కొట్టుడు..
-
తాహీర్ తడాఖా..
-
పుణె ఫీల్డింగ్: ముంబై బ్యాటింగ్
-
ధోని సరదాగా..!
పుణె: ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ తో మూడో వన్డేల సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన తొలి వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొందర్లో రివ్యూకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాడిగా ఉన్న ధోని పొరపాటున డీఆర్ఎస్ సంకేతాలిచ్చాడు. అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోసం కెప్టెన్ అప్పీల్ చేయవలసిన సమయంలో ధోని రివ్యూకు వెళ్లాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ కాబట్టి ధోని అలా తొందర్లో రివ్యూకు వెళ్లాడు. అయితే ఇదే స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని సరదాగా రివ్యూ కోసం వెళ్లాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా తమ జట్టు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన బౌలింగ్ లో ధోని రివ్యూ కోరాడు. పొలార్డ్ అవుట్ విషయంలో ధోని రివ్యూ అంటూ సైగ చేశాడు. ఇక్కడ రివ్యూలు లేకపోయినా థర్డ్ అంపైర్ అంటూ సంకేతాలిచ్చాడు ధోని. తాహీర్ అప్పీల్ కు అంపైర్ స్పందిచకపోవడంతో ధోని ఇలా చేసి నవ్వులు పూయించాడు. కాగా, టీవీ రిప్లేలో అది అవుట్ గా కనబడినప్పటికీ ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోవడంతో పొలార్డ్ బతికిపోయాడు. -
హార్దిక్ పాండ్యా చితక్కొట్టుడు..
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఓ దశలో తడబడినప్పటికీ చివరకు తేరుకుని గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(35 నాటౌట్;15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీల మోత మోగించాడు. ఇన్నింగ్స్ 16 ఓవర్ లో్ నితీష్ రానా ఆరో వికెట్ గా అవుటైన తరువాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా తొలుత నెమ్మదిగా ఆడాడు. తొలి తొమ్మిది బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా.. ఆఖరి ఓవర్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 20.0 ఓవర్ లో 28 పరుగులు పిండుకుని ముంబైను పటిష్ట స్థితికి చేర్చాడు. పుణె బౌలర్ అశోక్ దిండా వేసిన చివర ఓవర్ లో నాలుగు సిక్సర్లు, ఫోర్ తో స్కోరును పరుగులు పెట్టించాడు. ఇందులో వరుసగా కొట్టిన మూడు సిక్సర్లు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. మిగతా ముంబై ఆటగాళ్లలో జాస్ బట్లర్(38), పార్ధీవ్ పటేల్(19),నితీష్ రానా(34), పొలార్డ్(30)లు ఫర్వాలేదనిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. తాహీర్ మ్యాజిక్.. పుణె సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఆది నుంచి ముంబై ఇండియన్స్ కు చెమటలు పట్టించిన తాహీర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులతో పటిష్టంగా కనిపించిన ముంబైను పుణె బౌలర్ ఇమ్రాన్ తాహీర్ కట్టడి చేశాడు. ప్రధానంగా తాహీర్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లో బంతి వ్యవధిలో తాహీర్ రెండు వికెట్లు తీశాడు. ఇక్కడ తొలి మూడు వికెట్లు తాహీర్ ఖాతాలో చేరడం విశేషం. పార్ధీవ్ పటేల్, రోహిత్ శర్మ, జాస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లను తాహీర్ సాధించి పుణెకు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్ ను ఏ ఫ్రాంచైజీ కొనగోలు చేయడానికి ముందుకు రాని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులు ముందు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ ను పుణె జట్టులోకి తీసుకుంది. ఆ ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్ లోనే తన ప్రతాపాన్ని చూపించాడు తాహీర్. అతనికి జతగా భాటియా రెండు వికెట్లు తీయగా, జంపా, బెన్ స్టోక్స్ లకు తలో వికెట్ దక్కింది. -
తాహీర్ తడాఖా..
పుణె: ఐపీఎల్ -10 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్ ను వణికిస్తూ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పార్థీవ్ పటేల్(19), రోహిత్ శర్మ(3), జాస్ బట్లర్(38) వికెట్లను సాధించి ముంబైకు షాకిచ్చాడు. ముంబై ఇండియన్స్ మంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాహీర్ తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. దాంతో ముంబై 62 పరుగులకు మూడు వికెట్లను నష్టపోయింది. ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్ ను ఎవరూ కొనగోలు చేయని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులు ముందు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ ను పుణె జట్టులోకి తీసుకుంది. జట్టు పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్ లోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు తాహీర్. ఈ మ్యాచ్ లో రెండు ఓవర్లు బౌలింగ్ ను పూర్తి చేసిన తరువాత మూడు వికెట్లను తీసిన తాహీర్ తొమ్మిది పరుగుల్ని మాత్రమే ఇవ్వడం ఇక్కడ మరో విశేషం. -
పుణె ఫీల్డింగ్: ముంబై బ్యాటింగ్
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. దాంతో ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. గతేడాది ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన పుణె ఆ సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. చివర నుంచి రెండో స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఈసారి ఎలాగైనా ఆది నుంచి కచ్చితమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని పుణె యోచిస్తోంది. మరొకవైపు ముంబై కూడా ఏ మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోకూడదనే భావనలోనే ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఓవరాల్ సీజన్ లో అద్భుమైన సారథిగా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ.. తొలిసారి కెప్టెన్సీ లేకుండా ఈ లీగ్ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. తర్వాత ఆ జట్టు రద్దు కావడం, ధోనీ పుణె జట్టుకు వెళ్లడం తెలిసిందే. ఐపీఎల్ తొమ్మిదో సీజన్ లో పుణె కు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని.. పదో సీజన్ లో సాధారణ పాత్రకే పరిమితం కానున్నాడు. ముంబై తుది జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), పార్దీవ్ పటేల్, అంబటి రాయడు,పొలార్డ్, నితీష్ రానా, బట్లర్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, బుమ్రా, సౌథీ, మెక్‌క్లాన్‌గన్ పుణె తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, మనోజ్ తివారీ, ఎంఎస్ ధోని,స్టోక్స్, భాటియా,చాహర్, జంపా,ఏబీ దిండా,ఇమ్రాన్ తాహీర్ -
‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’
-
‘అంత డబ్బా.. మాటలు రావడం లేదు’
బెంగళూరు: ఐపీఎల్ వేలంపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అమితాసక్తి కనబరిచాడు. బెంగళూరులో జరిగిన వేలంను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెల్లవారుజామునే మేల్కొన్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్నే మార్చేసే ధర దక్కిందని వ్యాఖ్యానించాడు. ‘ వేలంపాటను ప్రత్యక్షంగా చూడాలని అలారం పెట్టుకుని తెల్లజామున 3.30 గంటలకు నిద్రలేచాను. వేలంలో నా వంతు వచ్చే వరకు 40 నిమిషాలు వేచి చూశాను. అలా ఉత్సాహంగా ఎదురు చూశాను. నిజానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడలేదు. ట్విటర్ ను ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ట్విటర్ లో రీప్రెష్ కొడుతూనే ఉన్నాను. నెటిజన్లు పెట్టిన ట్వీట్లు చూసి పుణే నన్ను దక్కించుకుందని తెలుసుకున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేసేంత పెద్ద ధర. నాకు మాటలు రావడం లేదు. గత కొద్ది రోజులుగా నా జీవితంలో అన్ని మంచి విషయాలు వింటున్నాను. ముఖ్యంగా ఈ వారం నాకు బాగా కలిసొచ్చింద’ని స్టోక్స్ అన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా స్టోక్స్ రికార్డు సృష్టించాడు. సోమరవారం బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్-10 వేలంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. -
బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే
= సీమను ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది = బైరెడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజం అనంతపురం న్యూటౌన్ : రాష్ట్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, రాయలసీమను మరోసారి దారుణంగా మోసం చేస్తున్నార ని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. రాయలసీమ యునైటెడ్ ఫోరం తరఫున పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డికి మద్దతుగా సోమవారం అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా బైరెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి అంటూ ఉన్నదంతా ఊడ్చేసి అక్కడ పెడితే రాయలసీమ మాటేమిటని ప్రశ్నించారు. సీమకు నీళ్లు, నిధుల గురించి మాట్లాడని చంద్రబాబు.. అవసరమొస్తే సీమవాదం ఎత్తుకుంటారని దుయ్యబట్టారు. పుష్కరాల పేరిట రూ.కోట్లు తగలేసిన ప్రభుత్వం.. సీమలో వలసలు పోతుంటే మాటమాత్రమైనా ప్రస్తావించడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నాగార్జునరెడ్డి, ప్రఖ్యాత కథా రచయిత బండినారాయణస్వామి, రాయలసీమ విమోచన సమితి జిల్లా కన్వీనర్ రాజశేఖరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు భార్గవ్, నాయకులు రాధాకృష్ణరావు, కృష్ణకుమార్ పాల్గొన్నారు. -
మోసం.. బాబు నైజం
– శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కారు – శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్న నీటిని దిగువకు తీసుకపోయారు – సీమ ప్రజలు మేల్కొకపోతే తీవ్ర అన్యాయం – ముగిసిన బైరెడ్డి దీక్షలు కర్నూలు సిటీ: ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. అమరావతిని ఫ్రీజోన్ చేయాలని కోరుతూ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో బైరెడ్డి చేపట్టిన నిరహార దీక్షలను.. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారన్నారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా కర్నూలుకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా తుంగలోకి తొక్కారన్నారు. రాజధాని కోసం రైతులనుంచి దౌర్జన్యంగా భూములు లాక్కొని.. టీడీపీ నేతలకు దోచి పెట్టారని ధ్వజమెత్తారు. దోచుకున్న డబ్బు ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు ఉన్నారని, పదవులు, పైసలు శాశ్వతం కాదనే విషయాన్ని వారు గమనించుకోవాలన్నారు. సీమ ప్రజలపై చిన్న చూపు రాయలసీమ ప్రజలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చిన్నచూపని, అందుకే రాజధాని, ప్రముఖ విద్యా సంస్థలన్నీ కోస్తా ప్రాంతంలోనే నెలకొల్పుతున్నారని బైరెడ్డి విమర్శించారు. రాష్ట్రం విడిపోయి మూడేళ్లయినా నేటికీ రాజధాని సరిహద్దు ఎంత అనే దానిపై స్పష్టత రాలేదన్నారు. చట్ట ప్రకారం రాజధానిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలన్నారు. శ్రీశైలం డ్యాం డెడ్‌స్టోరేజీలో ఉన్నా దిగువకు నీరు తీసుకోయారని, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇకనైనా సీమ ప్రజలు మేల్కొకపోతే తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఫ్రీజోన్‌పై ప్రభుత్వం స్పందించకపోతే చలో అమరావతిపై త్వరలోనే ప్రకటన చేస్తామని బైరెడ్డి పేర్కొన్నారు.దీక్షల్లో ఆర్యూ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర, ఆర్పీఎస్ నాయకులు, విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీ జోన్‌గా ప్రకటించే వరకు ఉద్యమం
- సర్కారు తీరుపై బైరెడ్డి ఆగ్రహం నందికొట్కూరు: అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ విషయంలో ప్రభుత్వ వ్యవహార తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా ప్రకటించారని, వెనబడిన రాయలసీమ జోన్లో కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధానిని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. జోన్లు ఏర్పాటు చేస్తే రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతిలో 7 వేల పోస్టులుంటే ఇతర జోన్లకు ఇవ్వడం ఏ మేరకు సమంజసమని సర్కారును నిలదీశారు. రాయలసీమ పరిధిలో 700 ఎస్ఐ పోస్టులుంటే 40 పోస్టులకు నోట్ఫికేషన్ ఇచ్చి సర్కారు చేతులు దులిపేసుకుందన్నారు. జోన్ సిస్టంపై సర్కారును నిలదీయాలని రాయలసీమ ఎమ్మెల్యేలను కోరారు. ఫ్రీ జోన్ కోసం కర్నూలులో నిరాహార దీక్ష చేపడుతునట్లు ప్రకటించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ
– ఓటమి భయంతోనే కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా – విలేకరుల సమావేశంలో ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కర్నూలు సిటీ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఖూనీ చేస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సీఎం అయి రెండున్నరేళ్లు అయినా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడ నేరవేర్చేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిదీ డబ్బుతో కొంటున్నారన్నారు. ఒక పార్టీపై గెలిచిన వారిని సంతలో పశువులను కొన్నట్లు కోట్లు ఖర్చుపెట్టి కొంటున్నారని విమర్శించారు. రెయిన్గన్లతో సీమను సస్యశ్యామలం చేశామని ప్రకటించడం దారుణమన్నారు. పంటలు కాపాడి ఉండిటే పనులు లేక రైతులు వలసలు ఎందుకు పోతున్నారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే నగర పాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థి పోటీ చేస్తారని త్వరలోనే పేరు ప్రకటిస్తామన్నారు.