రాణించిన ముంబై బౌలర్లు.. ఇక బ్యాట్స్ మెన్సే!
రాణించిన ముంబై బౌలర్లు.. ఇక బ్యాట్స్ మెన్సే!
Published Mon, Apr 24 2017 9:56 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
► పుణే స్కోరు 161/6
► శుభారంభం అందించిన పుణే ఓపెనర్లు
ముంబై: వరుసగా 6 మ్యాచ్ లు గెలిచిన ముంబై ఏడోదానిపై కూడా పట్టు విడువ లేదు. టీం మెంటర్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు కానుక ఇవ్వాలని నిశ్ఛయించుకున్నారో ఎమోగానీ రైజింగ్ పుణే మ్యాచ్ లో కట్టు దిట్టంగా బౌలింగ్ చేసి బౌలర్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ముంబై బౌలింగ్ కు తలవంచిన పుణే నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి160 పరుగులు చేసింది.తొలుత టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫుణే ఓపేనర్లు 76 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించగా మిగతా బ్యాట్స్ మెన్స్ దాటిగా ఆడే ప్రయత్నంలో విఫలమయ్యారు.
ఓపెనర్లు రహానే 5 ఫోర్లు 1 సిక్సర్ తో 38 పరుగులు, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరద్దరిని కృనాల్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన కేవీ శర్మ పెవీలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, ధోని, బెన్ స్టోక్స్ లు దాటిగా ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. స్మిత్(17)ను హార్భజన్, బెన్ స్టోక్స్(17) ను జాన్సన్ బౌల్డ్ చేయగా, ధోని(7) పరుగులతో బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయి నిరాశపర్చాడు. మనోజ్ తివారీ (22) దాటిగా ఆడే ప్రయత్నం చేసి ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, శర్మలకు రెండెసి వికెట్లు పడగా, జాన్సన్, హార్భజన్ లకు చెరో వికెట్ దక్కింది.
Advertisement