ఉత్కంఠ పోరులో పుణేదే గెలుపు | Pune beats Mumbai Indians by 3 runs | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో పుణేదే గెలుపు

Published Mon, Apr 24 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

ఉత్కంఠ పోరులో పుణేదే గెలుపు

ఉత్కంఠ పోరులో పుణేదే గెలుపు

ముంబై: వరుసగా 6 మ్యాచ్ లు గెలిచిన ముంబై ఇండియన్స్‌ అతివిశ్వాసంతో బరిలోకి దిగి ఓటమి పాలైంది. ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైపై 3 పరుగులు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ అద్భుత విజాయాన్ని సాధించింది. టీం మెంటర్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్న రోహిత్ శర్మ సేనకు నిరాశే ఎదురైంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.

పుణే ఓపెనర్లు రహానే 5 ఫోర్లు 1 సిక్సర్ తో 38 పరుగులు, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరద్దరిని కృనాల్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ పెవిలియన్ పంపాడు. స్మిత్(17), బెన్ స్టోక్స్(17), మనోజ్ తివారీ (22) పరుగులు చేశారు. ధోని(7) నిరాశపరిచాడు. తివారీ చివర్లో వేగంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో పుణే 160 పరుగుల మార్క్‌ను చేరుకుంది. ముంబై బౌలర్లలో బుమ్రా, శర్మలకు  రెండెసి వికెట్లు పడగా, జాన్సన్, హార్భజన్ లకు చెరో వికెట్ దక్కింది.

డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఉన్న జట్టుకు 161 పరుగులు సాధారణ లక్ష్యమే. కానీ అతి విశ్వాసంతో ఆడిన ముంబై బ్యాట్స్‌మెన్ అనవసర షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. తొలి వికెట్ కు 4.2 ఓవర్లలో 35 పరుగులు జోడించాక బట్లర్ (17)ను స్టోక్స్ ఔట్ చేశాడు. పార్థీవ్ పటేల్ (33) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫె సెంచరీ (39 బంతుల్లో 58: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసినా జట్టును గట్టెక్కించలేకపోయాడు. ముంబై విజయానికి చివరి ఓవర్లలో 17 పరుగులు అవసరం కాగా, ఆఖరి వేసిన పుణే బౌలర్ ఉనత్కద్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా(13)ను, నాలుగో బంతికి రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఐదో బంతికి మెక్ క్లీనగన్ రనౌటయ్యాడు. ముంబై విజయానికి 11 పరుగులు అవసరం కాగా చివరి బంతికి భజ్జీ సిక్స్ కొట్టిన ప్రయోజనం లేకపోయింది. దీంతో పుణే వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తాను వేసిన నాలుగు ఓవర్లలో ఓ మెయిడిన్ తో పాటు రెండు కీలక వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement