సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు మునిసిపాలిటీలో స్థల వివాదంలో సీపీఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. రెచ్చిపోయిన బైరెడ్డి.. అంతుచూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ సీపీఎం నాయకులపై చిందులు తొక్కారు.
20 ఏళ్లుగా ఈ స్థలంలోనే ఉన్నాం.. పన్నులు చెలిస్తున్నాం. న్యాయం చేయకపోగా మాపైనే దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి మేము పన్నులు కూడా చెల్లించామని.. తమకు న్యాయం చేయమంటే మున్సిపాలిటీ అధికారులు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన బాటపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment