
రాయలసీమ విచ్ఛిన్నాన్ని అడ్డుకుంటాం: బైరెడ్డి
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగినట్టేనని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు.
రాయలసీమ విచ్ఛిన్నాన్ని కోర్టు ద్వారానైనా అడ్డుకుంటామన్నారు. సీమ విచ్ఛిన్న మవుతుంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విభజన అనివార్యమైతే ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.