చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ... | Kurnool district YSRCP MLAs takes on Chandrababu govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ...

Published Wed, Jul 15 2015 1:17 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ... - Sakshi

చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ...

కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బి.రాజశేఖరరెడ్డి, ఎస్వీ.మోహన్రెడ్డి, గౌరు. చరితారెడ్డి బుధవారం కర్నూలులో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అధికార పార్టీ మాత్రం తమ పార్టీనే టార్గెట్ చేస్తుందని వారు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ నేతలు దృష్టి పెట్టకుండా తమ నేతలపై అక్రమకేసులు పెట్టే పనిలో ఉన్నారని విమర్శించారు.

అలాగే టీడీపీ ప్రభుత్వానికి అధికారులు కొమ్ము కాస్తున్నారని... ఈ నేపథ్యంలో అధికారులను పార్టీలో చేర్చుకుంటే మంచిదని టీడీపీ నేతకు హితవు పలికారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడంపై వారు స్పందించారు. పుష్కరాలపై చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement