SV Mohan Reddy
-
జగన్ ఉండుంటే అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు: SV Mohan Reddy
-
ఇదేనా నీ పాలనా.. ఇదేనా నీ రాజకీయ అనుభవం.. బాబుపై YSRCP నేతలు ఫైర్
-
మంత్రి టీజీ భరత్ పై ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్
-
మద్యం, ఇసుక దందాలో టీడీపీ నేతలు బిజీ...
-
చంద్రబాబుపై ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్
-
చంద్రబాబుపై ఎస్.వి. మోహన్ రెడ్డి ఫైర్
-
మాల వేసుకొని డ్రామాలు చేయడానికి ఇది సినిమా కంపెనీ కాదు
-
వంద రోజుల ’వంచన’ పాలన.. ఇదేనా మంచి ప్రభుత్వం’
సాక్షి, కర్నూలు: సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. హామీలు నిలబెట్టుకోకుండా మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు ఎలా ప్రచారం చేస్తున్నారంటూ నిలదీశారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ‘తిరుపతి లడ్డూ’ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు.ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడు టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లడ్డూ అంశంలో ఆలయ అధికారులు చెప్పిన మాటలకు, సీఎం చంద్రబాబు చెప్పే మాటలకు పొంతన లేదు. జులై 12 తేదీన ట్యాంకర్లు వచ్చాయని అంటున్నారు.. జులై 12న ఉన్నది సీఎం చంద్రబాబు కాదా..?. లడ్డూలో కల్తీ జరగడానికి, వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్వీ మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: తిరుమల ‘లడ్డూ’ కుట్ర.. చంద్రబాబు తప్పులు ఒక్కోక్కటిగా బట్టబయలు‘‘రాజకీయంగా జగన్‌పై బురద చల్లడానికి సీఎం చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్ తప్పు చేయలేదు కాబట్టే.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. టీటీడీని టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. దీనిపై తమ నాయకులు ప్రమాణాలు చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించాము. మంచి ప్రభుత్వం అంటూనే చంద్రబాబు.. అమ్మ ఒడి, నిరుద్యోగ భృతి, మహిళలకు మూడు సిలిండర్లు, 15 వేల రూపాయలు ఎగ్గొట్టారు. తిరుపతి లడ్డూపై నిజ నిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
చంద్రబాబును గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కించాలి.. బాబుపై సెటైర్లు
-
పవన్ పార్టీకి అతీగతీ లేదు.. లోకేష్‌ది దిగజారుడు రాజకీయం
సాక్షి, కర్నూలు: పవన్ కల్యాణ్‌కు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదని, కేవలం బీజేపీ-టీడీపీకి మధ్య బ్రోకర్‌గా పని చేస్తున్నాడని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్టీకి అతీగతీ లేదని.. అసలు పోటీ చేసేందుకు గుర్తు కూడా లేదని ఎద్దేవా చేశారాయన. శుక్రవారం ఆయన కర్నూల్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇక టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పైనా ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. యువగళం పాదయాత్ర లో దిగజారుడు లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తూ.. విమర్శలు చేస్తున్నారన్నారాయన. ‘‘నారా లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మరోసారి చంద్రబాబు, నారా లోకేష్ సిద్దంగా వున్నారు. రాయలసీమ లో హైకోర్టు పెడుతామని చంద్రబాబు, నారా లోకేష్ చెప్పడం లేదు. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడుకి కూడా అర్థం కావడం లేదు. రైతులకు రుణ మాఫీ చెప్పి రాష్ట్రంలోని రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. మరో వైపు అక్కా చెల్లెళ్ళు రుణమాఫీ పేరుతో పసుపు కుంకుమ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు లేకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు. కాబట్టి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక బీజేపీకి ఏపీలో ఉనికే లేదు. తమకు ఉనికి ఉందంటూ చాటుకునే ప్రయత్నంలో భాగంగానే సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు వాళ్లు అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్ -
‘చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’
సాక్షి, కర్నూలు: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు అర్థరహితమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని మరిచిన చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బి.వై.రామయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగనన్న మాట ఇస్తే తప్పే ప్రస్తే లేదని కొనియాడారు. అమరావతిలో జరుగుతున్నది రైతు ఉద్యమం కాదని, చంద్రబాబు బినామీల ఆందోళన మాత్రమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును సమర్థించే టీడీపీ నేతలు కర్నూల్లో హైకోర్టు వద్దని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబు మాయలో ఉన్నారన్నారు. ఇకనైనా ప్రాంతాల అభివృద్ధి కోసం టీడీపీ నేతలు ఆలోచించాలని కోరారు. -
అన్ని వర్గాలకు మేలు చేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది
-
‘2 రోజుల్లో అధికారంలోకి వైఎస్సార్సీపీ’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో రెండు రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు తగిలించాల్సిందేనని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ రోజున వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్ తెలుగు దేశం పార్టీకి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాట మార్చిన చంద్రబాబు: కాటసాని చంద్రబాబు ఓటమి భయంతో దేశంలో వివిధ నాయకులను కలిసేందుకు వెళ్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నరేంద్ర మోదీని పొడిగిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి ఆయనను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలను ఆకర్షించాయని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబుని లోకేష్ బాబు జాగ్రత్తగా చూసుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొంగ సర్వేలను ప్రకటిస్తూ ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పార్టీకి సేవలందించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కర్నూలు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు: ఎస్వీ
సాక్షి, కర్నూలు : అధికారులతో పాటు, వ్యవస్థలను వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్ చేసి వారిని రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆయన దృష్టి అంతా మొత్తం రాజకీయంపై ఉండేదని, అందుకు సంబంధించిన విషయాలను వెంకటేశ్వరరావు ప్రతిరోజు చంద్రబాబుకు వివరించేవారన్నారు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతలపై కన్నా రాజకీయంగానే ఎక్కువ ఆసక్తి చూపించేవారని ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి, పార్టీలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలని నిర్ణయించేది వెంకటేశ్వరరావేనని అన్నారు. అధికారులను టీడీపీ ఏవిధంగా మభ్యపెడుతుందో అందరికీ తెలుసునని అన్నారు. పోలీస్ శాఖను వాడుకుని ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలనుకుంటున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కాగా ఇంటెలిజెన్స్ ఐజీ విధుల నుంచి ఏబీ వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే. చదవండి....(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) మరోవైపు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో అధికారుల బదిలీ అన్నది సాధారణ అంశమే. ఇప్పుడే కాదు.. ఏ ఎన్నికల సమయంలోనైనా ఈసీ తన అధికారాలను ఉపయోగించుకుంటుంది. 2009 ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఎస్ఎస్పీ యాదవ్‌ను ఈసీ బదిలీ చేసింది. నాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎస్ఎస్పీ యాదవ్‌పై ఫిర్యాదు చేయడంతో ఆ వెంటనే ఈసీ బదిలీ చేసింది. ఇక ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ వికారాబాద్ ఎస్పీగా ఉన్న అన్నపూర్ణను బదిలీ చేసింది ఈసీ. రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో వికారాబాద్ ఎస్పీని బదిలీ చేసింది ఈసీ. -
వైఎస్సార్ సీపీలో చేరిన కాండ్రు కమల
సాక్షి, అమరావతి: వరుస షాక్‌లు, పార్టీలో భగ్గుమంటున్న అసమ్మతితో తెలుగుదేశం పార్టీ విలవిల్లాడుతోంది. ఆ పార్టీ కీలక నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వారిని ఆపేందుకు టీడీపీ అధిష్టానం చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా కర్నూలు అర్బన్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీ కంగుతింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఎస్వీ మోహన్‌రెడ్డికి చంద్రబాబు మళ్లీ సీటు ఇవ్వలేదు. చివరి వరకు డైలమాలో పెట్టి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు భరత్‌కు కర్నూలు సీటు కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు సీటివ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీకి రాజీనామా చేసిన మోహన్‌రెడ్డి గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మోహన్‌రెడ్డితో పాటు ఎస్వీ విజయ మనోహరి, పత్తికొండకు చెందిన ఐడీసీసీ మాజీ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్.నాగరత్నమ్మలు కూడా పార్టీలో చేరారు. ఈ సమయంలో వారి వెంట నంద్యాలకు చెందిన వైఎస్సార్సీపీ నేత గోపవరం సుధీర్‌రెడ్డి ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి దివంగత భూమా నాగిరెడ్డి ఒత్తిడితో టీడీపీలో చేరితే సీఎం చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని ఎస్వీ వెల్లడించారు. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా వైఎస్సార్సీపీలో చేరడంతో టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. చేనేత వర్గానికి చెందిన కాండ్రు కమలకు మంగళగిరి నియోజకవర్గంలో మంచి పట్టుంది. దీంతో ఇప్పటికే మంగళగిరిలో ఎదురీదుతున్న లోకేశ్‌కు మరింత గడ్డు పరిస్థితి తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. -
వైఎస్సార్ సీపీలో చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి
సాక్షి, కర్నూలు : కర్నూలులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఎస్వీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను బేషరతుగా వైఎస్సార్ సీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను అన్యాయం చేశా. తప్పు తెలుసుకున్నాను. అందుకే తిరిగి సొంత గూటికి చేరుకున్నా. మోసం చేసే నైజం లేని నాయకుడు వైఎస్ జగన్. ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు ఉడతా భక్తిగా నా సాయం చేస్తా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తా. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని స్థానాల్లో గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం వైఎస్సార్ సీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎస్వీ కుటుంబం తరఫున ఢీ కొడతానని అన్నారు. టీడీపీ మోసానికి ప్రతీకారం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. -
కర్నూలులో టీడీపీకి భారీ షాక్
-
టీడీపీకి ఎస్వీ మోహన్ రెడ్డి షాక్..
సాక్షి, కర్నూలు : మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైఎస్సార్ సీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన గురువారమిక్కడ తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని ఆయన తెలిపారు. కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఖాన్‌ను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని, తన పోరాటం, సవాల్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎస్వీ కుటుంబం తరఫున ఢీ కొడతానని అన్నారు. వాళ్లు ఎంతమంది ఉన్నా భయపడేది లేదని, తమపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇస్తామని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తనకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అప్పట్లో పార్టీ మారానే కానీ, డబ్బులు, పదవులు కోసం పార్టీలు మారే సంస్కృతి కాదని అన్నారు. కాగా యూజ్ అండ్ త్రో పాలసీకి పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు కర్నూలు టికెట్ ఇవ్వకుండా ఎస్వీ మోహన్‌రెడ్డికి మొండి చేయి చూపించిన విషయం తెలిసిందే. చదవండి....(లోకేశ్ ప్రకటించిన ‘ఆ ఇద్దరి’ స్థానాలూ హుళక్కే!) -
లోకేశ్ ప్రకటించిన ‘ఆ ఇద్దరి’ స్థానాలూ హుళక్కే!
అది 2018 జులై...మంత్రి లోకేశ్ (చినబాబు) కర్నూలు వస్తున్నారని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి తెగ హడావుడి చేశారు. నారావారి రాజకీయ వారసుడి కరుణా కటాక్షాల కోసం తాపత్రయ పడ్డారు. పెద్ద వేదిక వేసి, జన సమీకరణ చేసి ‘మా రాజువి నీవయ్యా’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దాంతో చినబాబు మురిసిపోయి ‘ముగాంబో ఖుష్ హువా’ అన్నట్లుగా పోజు పెట్టారు. అదే ఊపులో ఇంకాస్త ముందుకెళ్లి ఎక్కడికో వెళ్లిపోయి ‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని’ ప్రకటించేశారు. ఇంకేముంది...నారా వంశ కిశోరం ప్రకటించిన తొలి అభ్యర్థులం తామే కాబట్టి సంబరపడ్డారు. తరువాత 9 నెలలు గడిచాయి.. ఎన్నికల తరుణం వచ్చింది. చంద్రబాబు నుంచి మాటాముచ్చట లేదు. లోకేశ్ నుంచి ఉలుకుపలుకు లేదు. చినబాబు తమకు టికెట్లు ప్రకటించారని గుర్తుచేసినా పెదబాబు పెదవి విప్పలే. వైఎస్సార్సీపీ తరపున గెలిచినా... మీ ప్రలోభాలకు లొంగి వచ్చామన్నా పట్టించుకోలేదు. తాను జీవితంలో ఎప్పుడూ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని, అసలది తమ డిక్షనరీలోనే లేదన్నట్లు చంద్రబాబు మనసులో ఓ చిన్న నవ్వు నవ్వారు. తన గురించి తెలిసీ నమ్మి రావడం మీ తప్పే అన్నట్లు ఓ చూపు చూశారు. చివరగా బుట్టా, ఎస్వీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. మీ వారసుడు లోకేశ్ ‘తొలిసారి ప్రకటించిన అభ్యర్థులం మేము... మీరు కాదనడానికి లేదు కదా’ అని పరోక్షంగా చెప్పారు. కానీ, అక్కడ ఉన్నది చంద్రబాబు. కమిట్మెంట్లు, సెంటిమెంట్లు ఏమాత్రం లేని ఆయన ‘నా లెక్కలు నాకుంటాయి. మీ తిప్పలు మీరు పడండని’ చెప్పేశారు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసే కోట్ల, టీజీ కుటుంబాలతో డీల్ సెట్ చేసుకున్నారు. కర్నూలు ఎంపీ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి, ఎమ్మెల్యే టికెట్ టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్‌కు ఇస్తామని సంకేతాలిచ్చారు. విషయం అర్ధమైన బుట్టా రేణుక మూడ్రోజుల క్రితం మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు, లోకేశ్‌లను ప్రాధేయపడ్డారు. ఈయన భయపడినంతా అయింది. ఎస్వీ మోహన్‌రెడ్డికి కూడా బాబు ఝలక్ ఇచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీజీ భరత్‌ను ఎంపిక చేశారు. మోసపోయానని తెలిసిన మోహన్‌రెడ్డి హతాశుడయ్యారు. ఐదేళ్ల క్రితం తనకు పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేసిన ద్రోహం గుర్తుకొచ్చి ఆయన మనసు కకావికలమైంది. మరంతేమరి... ‘చంద్రబాబు మాట మీద నిలబడరని అందరికీ తెలుసు. చినబాబైనా అలా చేయరని ఆశించాం. ఆయనకూ మాట ఇవ్వడమే తప్ప నిలబెట్టుకోవడం చేత కాదని తెలిసిందని’ ఎస్వీ మోహన్‌రెడ్డి లబోదిబోమంటున్నారు. మరోవైపు బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టికెట్లు దక్కకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ‘మనవాడు నాలుక మామూలుది కాదు. ఐరన్ టంగ్. ఏదైనా చెబితే అది అయ్యేదే లేదు. అదే మరి లోకేశ్ అంటే!’ అంటూ జోకులు పేలుస్తున్నారు. – వడ్డాది శ్రీనివాస్,సాక్షి , అమరావతి -
కర్నూలు సీటు కోసం చంద్రబాబు వద్దకు ఎస్వీ
సాక్షి, అమరావతి : కర్నూలు జిల్లా టికెట్ల పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. కర్నూలు అసెంబ్లీ టికెట్‌పై కొంతకాలంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి... టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ కర్నూలులో పోటీ చేయాలని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి తాను అమరావతి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ జరిగే కర్నూలు పార్లమెంట్ సమీక్షలో అసెంబ్లీ సీటుపై స్పష్టత వస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్నూలు అసెంబ్లీ టికెట్ రాజకీయం తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ టికెట్ కోసం ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మరోవైపు టీజీ భరత్ పోటీ పడుతున్నారు. అయితే జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్... కర్నూలు టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డికేనని ప్రకటించడం అసమ్మతి భగ్గుమంది. లోకేష్ ఏ హోదాతో టికెట్ కేటాయింపుపై ప్రకటన చేస్తారంటూ ఎంపీ టీజీ వెంకటేష్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ నెల 28న టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కేఈ సోదరులు టీడీపీ అధిష్టానం ముందు కొత్త ప్రతిపాదన చేయడంతో ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే అప్రమత్తం అయ్యారు. తన టికెట్‌కు ఎసరు వస్తుందనే భయంతో ఆయన తాజాగా నారా లోకేష్ పేరు తెరమీదకు తీసుకువచ్చారు. లోకేష్ కర్నూలులో పోటీ చేస్తే తన స్వచ్ఛందంగా తప్పుకుంటానని వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళం నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి...ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
టికెట్ పై కుస్తీ
-
కర్నూలు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య మళ్లీ లొల్లి మొదలైంది. కర్నూలు టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే ఎస్వీ చేసిన వ్యాఖ్యలపై టీజీ ఘాటుగా స్పందించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానిదో లేక టీజీ వెంకటేశ్ కుటుంబానిదో కాదన్నారు. కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఓటర్ల ఆస్తి అన్నారు. పార్టీ అధినేత సర్వేలు చేయించి టికెట్ కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమన్నారు. నిన్న సీటు తనకేనని చెప్పిన ఎస్వీ మోహన్ రెడ్డి, నేడు లోకేష్ నిలబడితే సమర్థిస్తానని చెప్పడం సరికాదన్నారు. లోకేష్ నిలబడితే అందరం సమర్థిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి జనాలను గందరగోళానికి గురిచెయ్యడం తప్ప ఇంకేమీ లేదన్నారు. గెలిచే అభ్యర్థికే చంద్రబాబు పట్టం కడతారని మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని పరోక్షంగా హెచ్చరించారు. -
ఎస్వీ మోహన్ రెడ్డి అదా సంగతి!
సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుపై ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఆయన కర్నూలు సీటు తనదే అని ధీమా వ్యక్తం చేసినా .... ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి... కర్నూలు నుంచి ఒకవేళ నారా లోకేష్ పోటీ చేస్తే తానే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. అయితే మరో నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనని, టికెట్ కూడా అడగనని అన్నారు. కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆయన... మరొకరికి ఆ సీటు కేటాయిస్తే ఒప్పుకునేది లేదన్నారు. కాగా ఇప్పటికే కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి నారా లోకేష్ దాదాపుగా ప్రకటించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికార పార్టీలో మొదలైంది. మరోవైపు టీడీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబానికి మద్దతు తెలిపిన ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు కేఈ సోదరులు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద కేఈ సోదరులు ప్రతిపాదన తెచ్చారు. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డికి.. ఓవైపు టీజీ వెంకటేశ్ కుమారుడు, మరోవైపు కోట్ల కుటుంబం నుంచి పోటీ ఎదురు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. టీజీ, కేఈ వర్గానికి చెక్ పెట్టేందుకు ఆయన తాజాగా కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేయాలంటూ కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. అంతేకాకుండా పోటీ చేస్తే లోకేష్...లేదా నేనే... అంతేకానీ వేరేవాళ్లు కర్నూలు నుంచి పోటీ చేస్తే ఊరుకునేది లేదంటూ ఎస్వీ మోహన్ రెడ్డి మీడియా ముఖంగా ఫీలర్లు వదులుతున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న కర్నూలు అసెంబ్లీ టికెట్ చివరికి ఎవరికి దక్కుతుందో. -
ఎస్వీకి ఝలక్.. కోట్లకు టికెట్ ?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రాకను ముందుగానే స్వాగతించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు కేఈ సోదరులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఏకంగా ఎస్వీ టికెట్‌కే టెండర్ వేసేందుకు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ముందు కేఈ సోదరులు కొత్త ప్రతిపాదన చేశారు. పత్తికొండ, డోన్ టికెట్లు తమ కుటుంబానికే ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్టు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు పరిధిలో కోట్లకు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన అంశాన్ని వీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కూడా ఈ పరిణామం దోహదపడడమే కాకుండా ఇక్కడ పార్టీ గెలుపునకు ఉపయోగపడుతుందంటూ అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచనున్నట్టు సమాచారం. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్వీ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్ మధ్య ఉన్నపోటీని పరిష్కరించే వీలు కూడా కలుగుతుందనేది వీరి అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో కోట్ల రాకను స్వాగతించిన ఎస్వీకి అసలు సీటే లేకుండా చేయాలనేది కేఈ సోదరుల ప్రణాళికగా ఉన్నట్లు తెలుస్తోంది. డోన్, పత్తికొండ మాకే! జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో కనీసం సంప్రదించకుండానే కోట్లతో నేరుగా సీఎం చర్చలు జరపడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు, డోన్ టికెట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం తన అనుచరులతో భేటీ సందర్భంగా చెప్పుకుంటోంది. ఇది కాస్తా కేఈ కుటుంబానికి ఆగ్రహం తెప్పిస్తోంది. కాగా.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ కుటుంబం మొదటి నుంచి సహకరించింది. ఎంపీ టీజీ వెంకటేష్‌పై ఉన్న వ్యతిరేకత కొద్దీ ఎస్వీని ప్రోత్సహించింది. అలాగే పత్తికొండలో తమకు ఎస్వీ తన బంధువైన రామచంద్రారెడ్డి ద్వారా సహకరిస్తారని ఆశించింది. ఇందుకు భిన్నంగా కోట్ల రాకను ఎస్వీ స్వాగతించారు. కర్నూలులో మైనార్టీల్లో కోట్లకు అంతో ఇంతో పట్టుంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఎస్వీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ ఉన్న కేఈ సోదరులను కాదని.. వారికి వ్యతిరేక వర్గమైన కోట్ల రాకను స్వాగతించారు. కోట్లతో కలసి సాగితే కర్నూలులో తనకు మైనార్టీ ఓటు బ్యాంకు ఏమైనా కలిసొస్తుందనే ఆలోచనతో ఉన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఎస్వీ వైఖరిపై కేఈ వర్గం మండిపడుతోంది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా.. కోట్ల సుజాతమ్మను కర్నూలులో పోటీ చేయించే ప్రతిపాదన తెచ్చారు. తద్వారా డోన్ టికెట్‌ను తామే దక్కించుకోవడమే కాకుండా.. అటు టీజీ, ఇటు ఎస్వీలను దెబ్బతీయొచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. మొత్తంగా అధికార పార్టీలో ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి. -
ఎన్టీఆర్‌పై కేసు ఎందుకు పెట్టలేదు?
తనపై కేసు పెట్టిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గట్టి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించారన్న ఆరోపణలతో కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో మోహన్‌రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని వెన్నుపోటు పాటలో చంద్రబాబును కించపరిచారని తన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై తాజాగా వర్మ స్పందించారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎన్టీఆర్‌పై ఎందుకు కేసు పెట్టలేదని ఎస్వీ మోహన్‌రెడ్డిని ట్విటర్లో వర్మ ప్రశ్నించారు. ఎన్టీఆర్ బతికుండగా ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. (రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు) How come Kurnool MLA S V Mohan Reddy is not putting a police complaint on this man in the video who is talking so against Andhra Pradesh Chief Minister Chandra Babu Naidu https://t.co/SxerDw5m6I — Ram Gopal Varma (@RGVzoomin) 28 December 2018 -
యాత్రను వెంటనే ఆపేయి..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ప్రారంభించిన ‘విజన్ యాత్ర’ అధికార పార్టీలో ఫిర్యాదుల పరంపరకు తెరలేపింది. ఈ యాత్రను వెంటనే ఆపేయించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి విన్నవించారు. కర్నూలు నియోజకవర్గం నుంచి ఇప్పటికే తన పేరు ప్రకటించిన నేపథ్యంలో భరత్ యాత్ర వల్ల కేడర్‌లో గందరగోళం ఏర్పడడమే కాకుండా అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతోందని వివరించినట్లు సమాచారం. అయితే, యాత్ర ఆపేయాలంటూ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలూ రాకపోవడంతో మరింత జోరు పెంచేందుకు టీజీ భరత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎస్వీతో విభేదిస్తున్న ఎంపీ బుట్టా రేణుకను ముందు పెట్టడం ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపం కాదని, పార్టీ కోసమే యాత్ర చేస్తున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో బుట్టా రేణుకకు అసలు ఎంపీ సీటే రాదని ఎమ్మెల్యే వర్గం ప్రచారం ప్రారంభించింది. ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా ఈ సందర్భంగా అంటున్నారు. సర్వే పేరుతో.. వాస్తవానికి టీడీపీలో సీట్ల కేటాయింపు సర్వే ప్రకారం జరుగుతోంది. చివరి నిమిషం వరకూ సీటు ఎవరికిస్తారనే విషయం రహస్యంగా ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా ముందుగానే కర్నూలు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ, ఎంపీ స్థానానికి బుట్టా రేణుక పోటీ చేస్తారని నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. దీనిపై ఎంపీ టీజీ భగ్గుమన్నారు. సీటు ప్రకటించడానికి అసలు లోకేష్ ఎవరంటూ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. నగర ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే విజన్ యాత్ర ప్రారంభించానని, 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని యాత్ర ప్రారంభం సందర్భంగా టీజీ భరత్ ప్రకటించారు.పరోక్షంగా ఎమ్మెల్యే అవినీతిపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. నగర ప్రజలు అవినీతి లేని అభివృద్ధి కోరుకుంటున్నారని, గతంలో తాము అదే చేశామని అంటున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఎంపీ బుట్టా రేణుక కూడా స్వరం కలిపారు. తద్వారా సీటు విషయంలో తన సపోర్ట్ భరత్‌కేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది వేచి చూడాలి. -
కమీషన్ల రగడ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ సాక్షిగా అధికార పార్టీలో కమీషన్ల కొట్లాట మొదలైంది. కార్పొరేషన్ పరిధిలో టెండర్ల వ్యవహారమంతా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రమే చూస్తున్నారని, ఎవ్వరినీ తలదూర్చనీయడం లేదని కొన్నాళ్ల క్రితం అధికార పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక వర్గం లోలోన మండిపడుతోంది. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ ఉల్లంఘన అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కార్పొరేషన్లో టెండర్ల వ్యవహారాలను ఎమ్మెల్యే ఏకపక్షంగా నడుపుతున్నారు. ప్రతి పని ఆయన చెప్పిన మనుషులకే దక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అమృత్ పథకం పనులను కూడా ఎమ్మెల్యే వర్గీయులే చేస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం మొదలు డ్రైనేజీ పనుల వరకు.. చివరకు చెత్త సేకరణ కాంట్రాక్ట్ కూడా వారే తీసుకున్నారు. ఎంపీ బుట్టా రేణుకకు కనీసం పనుల సమాచారం కూడా ఇవ్వడం లేదన్నది ఆమె వర్గీయుల వాదన. ఈ నేపథ్యంలోనే ప్రొటోకాల్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. మునిసిపల్ కమిషనర్ హరినాథరెడ్డిపలు ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఎంపీ బుట్టా జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అనేక నిబంధనలను కూడా పేర్కొంటూ మరీ కమిషనర్‌పై మండిపడుతున్నారు. వాస్తవానికి కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ పనుల్లో ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తే ఇంత రచ్చకు దారితీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవ్వరూ వేలు పెట్టొద్దు! కార్పొరేషన్ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అధికార పార్టీ నేతలే మండిపడుతున్నారు. గతంలో కార్పొరేషన్ టెండర్ల వ్యవహారాలు కేఈ కుమార్ చూసేవారు. అయితే, ఎమ్మెల్యే ఎస్వీ పార్టీ మారిన తర్వాత కేఈ కుటుంబం నుంచి పూర్తిగా తప్పించారు. ఇందుకోసం ఫిర్యాదులు చేసి మరీ కేఈ కుటుంబ పెత్తనం లేకుండా చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా వేరే వారికి కాంట్రాక్టులు దక్కే పక్షంలో ఏకంగా టెండర్లనే రద్దు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్ల వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే ఎటూ తేల్చడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే కాంట్రాక్టర్‌కు పనులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ టెండర్‌ను రద్దు చేయించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం కూడా ఎంపీ బుట్టా వద్దకు వెళ్లినట్టు సమాచారం. తమ వారికి ఒక్క పని కూడా ఇవ్వడం లేదని బుట్టా వర్గీయులు వాపోతున్నారు. అశోక్‌నగర్ పంపుహౌస్ వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ కోసం స్థల కేటాయింపుతో మునిసిపల్ కమిషనర్, ఎంపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇచ్చారని, తమకు కనీస సమాచారం లేదని వారు మండిపడుతున్నారు. పైగా కమిషనర్.. ఎమ్మెల్యే చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే క్రమంలో కార్యక్రమాల నిర్వహణ విషయంలోనూ ఎంపీగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఎంపీ బుట్టా ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే వర్గీయుల వీరంగం
-
ఎవరి సీటుకు ఎసరు?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీలో కొత్త చర్చను...అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్ దాదాపుగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికారపార్టీలో మొదలైంది. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశం లేదని అధికారపార్టీ నేతలే పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కర్నూలు సీటు దాదాపుగా నిర్ణయం కావడంతో మరో సీటు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏది కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. ముందుచూపుతో ఎస్వీ మోహన్ రెడ్డి పావులు కదిపి తన బెర్త్ రిజర్వ్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల, ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరిపై వేటు పడుతుందోనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బులు వెదజల్లడంతో పాటు గెలిచేందుకు సెంటిమెంటు ఆటను కూడా అధికార తెలుగుదేశం పార్టీ బాగా రక్తికట్టించింది. ఇప్పుడు అదే సెంటిమెంటు..అభ్యర్థులకు సంకటంగా మారుతోంది. సెంటిమెంటు పండుతుందా...! నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి పార్టీ మారిన కొన్ని నెలల తర్వాత హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి అదే కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన విషయం విదితమే. ఇందుకోసం గత చరిత్రను సైతం ప్రజలకు గుర్తుచేశారు. గతంలో భూమా శేఖర్‌రెడ్డి మరణిస్తేనే నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని... భూమా నాగిరెడ్డి మరణించడంతో శేఖర్‌రెడ్డి కుమారుడికి ఇవ్వడమే సరైందనే వాదన తీసుకొచ్చారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తల్లిదండ్రులు లేని అమ్మాయి అఖిలప్రియ, తండ్రిలేని అబ్బాయి బ్రహ్మానందరెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ సెంటిమెంటును పండించే ప్రయత్నం చేసింది. అయితే, ఇప్పుడు అదే సెంటిమెంటును అధికారపార్టీ పాటిస్తుందా? లేదా అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. అదే సెంటిమెంటును పాటించి నంద్యాల సీటును బ్రహ్మానందరెడ్డికి, ఆళ్లగడ్డను అఖిలప్రియకు ఇస్తారా అన్న చర్చ అధికారపార్టీలోనే జరుగుతోంది. మరోవైపు.. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నంద్యాల తమకివ్వాలంటూ ఇప్పటికే ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒకవేళ సెంటిమెంటును పాటించి బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియకు ఇస్తే ఎస్పీవై రెడ్డితో పాటు ఫరూఖ్ వర్గం కూడా సహకరించే పరిస్థితి లేదని సమాచారం. ఈ మొత్తం చర్చ జరిగి ఎక్కడ తనకు ఎసరు వస్తుందనే ముందుచూపుతోనే ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే తన సీటు రిజర్వ్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో సీటు కష్టమే...! సెంటిమెంటుతో ఒకే కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు సీట్లు కేటాయించేది కష్టమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సెంటిమెంటుతో పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదనేది వారి అభిప్రాయం. కేవలం ఉప ఎన్నికల కోసమే సెంటిమెంటు ఫ్యాక్టర్‌ను వాడుకున్నారు మినహా... దీని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశమేలేదని అంటున్నారు. మరోవైపు అఖిలప్రియ– ఏవీ సుబ్బారెడ్డిల వివాదాల సందర్భంగా సర్వే ప్రకారమే సీటు కేటాయిస్తామంటూ చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో మొదలైన అభ్యర్థుల ప్రకటన వ్యవహారం జిల్లావ్యాప్తంగా అధికారపార్టీలో కొత్త అలజడిని రేపిందని చెప్పవచ్చు. -
అభ్యర్థులను ప్రకటించడానికి లోకేశ్ ఎవరు?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి నారా లోకేశ్ ఎవరని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం మైనార్టీ మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఎంపీ టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కర్నూలులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. లోకేశ్ టీడీపీ అధినేత కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని, అలాంటప్పుడు అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ‘‘నా స్పందన ఒకటే ఉంటుంది. లోకేశ్ మంత్రి. ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు. ముఖ్యమంత్రి కూడా కాదు. కర్నూలు జిల్లాకు ప్రభుత్వ కార్యక్రమం కోసం వచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం నిజంగా నాకు అంతుబట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా పొద్దున బీ ఫారం ఇచ్చే ముందు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారు. సర్వే చేసిన తర్వాత ముందుకు పోతామని చంద్రబాబు నాతో చాలాసార్లు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు. దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. మరి ఆయన(లోకేశ్) ఎందుకు ఆ విధంగా స్పందించారో నాకు తెలియదు. ఎస్వీ మోహన్‌రెడ్డి హిప్నాటైజ్ చేశారేమో లోకేశ్‌ను. మా మోహన్‌రెడ్డి ఏమైనా చేయగలరు. ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించి.. వీళ్లకు ఓట్లు వేయండని అడగటం నాకు నిజంగా ఇప్పటికీ అంతుబట్టడం లేదు. అద్భుతంగా ఉంది. లోకేశ్ కూడా అలా మాట్లాడరు. మా మోహనుడు హిప్నాటైజ్ చేసినట్టున్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాతే నేను స్పందిస్తా’’ అని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. -
బాబు గారు చెప్పిందే లోకేష్ ప్రకటించారు
-
టీజీ వ్యాఖ్యలపై ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్!
సాక్షి, కర్నూలు : మంత్రి నారా లోకేష్‌ను హిప్నటైజ్ చేశారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కౌంటరిచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందే లోకేష్ ప్రకటించారన్నారు. రాజకీయాల్లో లోకేష్ ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారని, టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరులో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డేనని లోకేష్ ప్రకటించినట్లు ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటన వల్ల గెలుపు అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. గతంలో టీజీ వెంకటేష్‌కు ఎంపీ పదవి, తనకు ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, ఈ విషయంలో తాను ఎవరిని హిప్నటైజ్ చేయలేదన్నారు. ఆ అవసరం కూడా తనకు లేదని, పార్టీ గెలుపు కోసం అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ 2019 ఎన్నికలకు ముందస్తుగానే కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ స్థానాల నుంచి టికెట్లు ఆశించిన టీజీ వెంకటేశ్, లోకేష్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని.. మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరని.. అదే విధంగా లోకేష్‌ను ఎమైనా హిప్నటైజ్ చేశారేమో అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: కర్నూలు టీడీపీలో లోకేష్ చిచ్చు -
నారా లోకేష్‌పై టీజీ వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు
-
కర్నూలు టీడీపీలో లోకేష్ చిచ్చు
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, లోక్‌సభ స్థానానికి వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. అయితే చాలా కాలంగా ఆ రెండు స్థానాలు తమవే అనుకుంటున్న టీజీ వెంకటేష్‌కు లోకేష్ ప్రకటన రుచించలేదు. దీంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలపై టీజీ అండ్ కో ఆశలు పెట్టుకుంది. అయితే అకస్మాత్తుగా మంత్రి 2019 ఎన్నికల్లో అభ్యర్థులు వీళ్లేనంటూ ప్రకటించడంతో టీజీ తీవ్ర అసహనానికి గురయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. మంత్రి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని అలాంటిది అభ్యర్థుల పేర్లు ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. లోకేష్ ఏ ప్రాతిపదికన అభ్యర్థలను నిర్ణయించారో తనకు అంతపట్టడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని.. మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేమోనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరని.. అదే విధంగా లోకేష్‌ను ఎమైనా హిప్నటైజ్ చేశారేమో అంటూ టీజీ వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వేలో అనుకూలంగా ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి తనతో చాలాసార్లు చెప్పారని అన్నారు. -
లోకేశ్ వ్యాఖ్యలతో కర్నూలు టీడీపీలో కలకలం
-
లోకేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ
-
లోకేశ్ వ్యాఖ్యలు.. టీడీపీలో అలజడి
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ‘ప్రత్యేకత’ చాటుకున్నారు. ఈసారి సొంత పార్టీ నాయకులనే గందరగోళంలో పడేశారు. బహిరంగ వేదికలపై నోటికొచ్చినట్టు మాట్లాడి నవ్వులపాలు కావడం ‘చినబాబు’కు ముందునుంచి అలవాటు. తాజాగా కర్నూలులోనూ ఇదే విన్యాసాన్ని పునరావృతం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలోనే దుమారం రేపాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకేశ్ సోమవారం కర్నూలు జిల్లాకు వచ్చారు. వచ్చిరాగానే తన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులను అయోమయంలోకి నెట్టారు. కర్నూలు జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఎంపీగా బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. లోకేశ్ వ్యాఖ్యలకు వేదికపై ఉన్న టీజీ వెంకటేష్ సహా అంతా నిశ్చేష్టులయ్యారు. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. తన కుమారుడు టీజీ భరత్‌కు ఎలాగైనా ఈ సీటు ఇప్పించాలని టీజీ వెంకటేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉరుములేని పిడుగులా వచ్చి లోకేశ్ ప్రకటన చేయడంతో టీజీ వర్గం అవాక్కైంది. హడావుడిగా ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని టీజీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫిరాయింపుదారులైన ఎస్వీ మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలకు టిక్కెట్లు ఎలా ఇస్తారని తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతారా అని వాపోతున్నారు. ఎవరి మద్దతు ఇవ్వాలో తెలియక టీడీపీ కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. లోకేశ్‌కు విద్యార్థి సంఘాల సెగ మెడికల్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కర్నూలు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద నారా లోకేశ్ కాన్వాయ్‌ను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం కోసం మంత్రి వద్దకు వస్తే పోలీసులు దురుసుగా వ్యవహరించారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
చంద్రబాబు మళ్లీ ఫేస్ టర్నింగ్ ఇచ్చారు..
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలుస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రత్యేక హోదాపై పలుమార్లు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మరోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకూ ఎంపీల రాజీనామాలకు సై అన్న బాబు నేడు నై అంటున్నారు. విచ్చలవిడి అవినీతి, కేసుల భయంతోనే చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకున్నారు. ఎంపీల రాజీనామా అంటేనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. దీంతో హోదా సాధనపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తేలిపోయింది. ఎంపీల రాజీనామాలపై కలిసి రమ్మంటే వెనకడుగు ఎందుకు?. రాష్ట్రంలోని 25మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చేది కదా. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తున్నాం అని కలరింగ్ ఇచ్చే మీరు, మీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరో చంద్రబాబు చెప్పాలి. బాబు ఓటుకు కోట్లు కేసు వల్ల భయపడుతున్నావా లేక పోలవరంలో మీ అవినీతి బయటపడుతుందన్న భయమా?. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలను అవినీతిమయం చేసిన చంద్రబాబు ఆ అవినీతిపై ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందోనని బయపడుతున్నట్లు ఉన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం వద్ద ఫణంగా పెట్టే అధికారాన్ని చంద్రబాబుకు ఎవరిచ్చారు?. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన చంద్రబాబు..ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చారు. దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా?.’ అని నిలదీశారు. వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి.... కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై బీవై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ‘వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి, గోడ దూకిన నువ్వు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని నువ్వ ఎమ్మెల్యేగా ఎలా అర్హుడివో చెప్పాలి. పార్టీ మారి ప్రజాస్వామ్యంలో జీవచ్చవాలుగా మారిన మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్ జగన్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నది కళ్లకు కనిపించడం లేదా?. చంద్రబాబు మెప్పు కోసం విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన అవినీతి సొమ్ముతో మీరు ఎంత అభివృద్ధి చెందారో అందరికీ తెలుసు. అతి త్వరలో మీ అవినీతిపై మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. హోదాపై మీ ముఖ్యమంత్రికే మొహం చెల్లడం లేదు. మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. దమ్ము, సిగ్గు, శరం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.’ అని డిమాండ్ చేశారు. -
ఒకే కుటుంబానికి మూడు సీట్లా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సీటు విషయంలో టీజీ, ఎస్వీ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నటివరకు కేవలం టీజీ భరత్, ఎస్వీ మోహన్రెడ్టిలకే పరిమితమైంది. తాజాగా టీజీ వెంకటేష్ కూడా రంగంలోకి దిగారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఉన్నాయని, ఒక సీటు తగ్గినా నష్టం లేదులే అని టీజీ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను పత్తికొండలో పోటీ చేస్తానంటే కేఈ వాళ్లు తుంగభద్రలో పడేస్తారని, ఆళ్లగడ్డలో పోటీకి దిగితే కుటుంబ సభ్యులు ఇంట్లోకి కూడా రానివ్వరని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన కర్నూలును వదిలిపెట్టిపోనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో నిర్వహించిన జన్మభూమి సభలో పాల్గొన్న సందర్భంగా గురువారం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వాస్తవానికి కొంతకాలంగా కర్నూలు సీటు విషయంలో అధికార పార్టీలో టీజీ భరత్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య రచ్చ జరుగుతోంది. కర్నూలు నుంచి తాను పోటీ చేస్తానని టీజీ భరత్ అంటుండగా... సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు తనదేనని ఎస్వీ చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందంటూ టీజీ వాతావరణాన్ని కొంత చల్లబరిచే ప్రయత్నం చేసినప్పటికీ.. కుటుంబంలో ముగ్గురికి ఎలా సీట్లు ఇస్తారనే కొత్త వాదనను మాత్రం తెరమీదకు తెచ్చారు. ఒకే వాహనంలో తిరుగుతూనే.. కర్నూలులోని ఎన్ఆర్ పేట నుంచి ఎస్.నాగప్ప స్ట్రీట్ వరకూ గురువారం జన్మభూమి సభలు జరిగాయి. ఈ సందర్భంగా టీజీ, ఎస్వీ ఇద్దరూ ఒకే వాహనంలో కలిసి తిరిగారు. వీరితో పాటు మునిసిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఒకే వాహనంలో తిరుగుతున్నప్పటికీ కర్నూలు సీటు విషయానికి వచ్చేసరికి ఎవరికివారుగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. పైగా ఇప్పటివరకు టీజీ భరత్, ఎస్వీకే పరిమితమైన మాటల యుద్ధం.. తాజాగా టీజీ వెంకటేష్, ఎస్వీ మధ్య మారినట్టు అర్థమవుతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్పుడు సీట్లకు ఇబ్బంది ఉండదని కూడా ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అయితే, స్వయంగా టీజీ వెంకటేష్ రాజ్యసభలో వేసిన ప్రశ్నకు నియోజకవర్గాల పునర్విభజన లేదంటూ సమాధానం వచ్చింది. అయినప్పటికీ మాట వరుసకే ఆయన ఇలా అన్నారని తెలుస్తోంది. -
పందెం కోళ్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సంక్రాంతి పండుగకు ముందే జిల్లాలో ‘పందెంకోళ్లు’ రె‘ఢీ’ అయ్యాయి. వచ్చే ఎన్నికల బరిలో ఉండేది తామేనంటూ ఎవరికి వారు ధీమాగా చెబుతున్నారు. తామే గెలుపు కోళ్లమని కూడా ప్రకటించుకుంటున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీలో సీట్ల లొల్లి షురూ అయ్యింది. ప్రధానంగా కర్నూలు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో బరిలో ఉండేది ‘నేనే అంటే నేనే’ అంటూ పోటీపడుతున్నారు. కర్నూలు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ప్రకటిస్తుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ప్రతి జన్మభూమి సభలోనూ వచ్చే సాధారణ ఎన్నికల్లో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ ప్రకటిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు సర్వే ఆధారంగా గెలుపు అభ్యర్థిని తానేనని, అందువల్ల తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ఒక అడుగు ముందుకేసి చెబుతున్నారు. ఓడిపోయే అభ్యర్థికి సీటు ఇవ్వరంటూ పరోక్షంగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ సీట్ల పోరు కొత్త సంవత్సరం వేడుక సాక్షిగా మొదలయ్యింది. ఇక్కడ టీడీపీ తరఫున బరిలో నిలిచేది తానేనని భూమా నాగిరెడ్డి సన్నిహిత మిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా బలనిరూపణకు వేదికగా ఆయన నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. మంత్రి అఖిలప్రియ వద్దన్నప్పటికీ బలమేమిటో నిరూపించుకోగలగడం ద్వారా తానే పందెం కోడినని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేస్తున్నారు. నేనంటే నేనే..! కర్నూలు నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేస్తారంటూ ఓటర్లందరి ఫోన్లకు వాయిస్ మెసేజ్ పంపి సర్వే చేపట్టారు. ఇందులోనే ఎవరు మీ అభ్యర్థి అంటూ మొదటి నెంబరు టీజీ భరత్‌కు, రెండో నెంబరు ఎస్వీ మోహన్ రెడ్డికి కేటాయించడంతో అసలు పోరు మొదలయ్యింది. ఈ సర్వేతోనే సీటు గొడవ మొదలయ్యింది. గెలిచే అభ్యర్థి తానేనని, అందువల్ల సీటు తనకేనని టీజీ భరత్ స్పష్టం చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా ప్రతి జన్మభూమి సభలోనూ తానే కర్నూలు నుంచి పోటీ చేస్తానని, కొందరు కావాలని పత్తికొండ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇక ఆళ్లగడ్డలోనూ తాజాగా పోరు మొదలయ్యింది. నూతన సంవత్సర వేడుకల సాక్షిగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీట్ల గొడవ ప్రారంభమైంది. తనకే అధిక బలం ఉందని నిరూపణ కోసం ఏవీ ప్రయత్నించారు. భూమా బంధువులు కూడా తన వెంటే నడుస్తారని చెప్పుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. మరోవైపు తన వర్గాన్ని కాపాడుకునే పనిలో మంత్రి అఖిలప్రియ నిమగ్నమయ్యారు. ఏవీ పార్టీకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసే పని చేశారు. మంత్రిగా, తన తండ్రి వారసురాలిగా తనకే సీటు అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వే గుబులు! ఇక అధికార పార్టీ నేతల్లో సర్వే గుబులు ప్రారంభమయ్యింది. మొదట్లో కేవలం కర్నూలు నియోజకవర్గంలోనే అభ్యర్థిపై సర్వే జరగగా... తాజాగా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఫోన్లు వస్తుండటం గమనార్హం. పోటీలో ఎవరు నిలబడితే గెలుస్తారో చెప్పాలంటూ ఐవీఆర్ఎస్ ద్వారా ఆయా నియోజకవర్గ ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారనే గుబులు అందరిలోనూ మొదలయ్యింది. సర్వే ఆధారంగా ఇస్తే తమ భవితవ్యం ఏమిటని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సంక్రాంతి సాక్షిగా ఎన్నికల పందెం కోళ్ల పోటీ ప్రారంభమయ్యిందన్నమాట! -
నువ్వా.. నేనా? అంటున్న టీడీపీ నేతలు..!
సాక్షి, కర్నూలు: అధికార పార్టీ నేతల మధ్య రోజురోజుకూ విభేదాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎంపిక విషయంలో అధికార పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు సూచించిన పేరును మరొకరు ఒప్పుకోవడం లేదు. పాలక మండలిలో తమ అనుచరులే ఉండాలంటూ ఎవరికి వారు బెట్టు చేస్తున్నారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏమాత్రమూ ఫలించలేదని సమాచారం. ఫలితంగా మార్కెట్ కమిటీ పాలక మండలి నియామకంలో జాప్యమవుతోంది. నేతల వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. టీడీపీలోని సీనియర్ నేతలకు కూడా ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు. తాజాగా బుధవారం నగరంలోని అశోక్‌నగర్‌లో జరిగిన వివిధ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. పోలీసుస్టేషన్లో ఇరు వర్గాలు కేసులు కూడా నమోదు చేయించడం గమనార్హం. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్–చైర్మన్, డైరెక్టర్ల నియామకం విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ ఎవరికి వారుగా పేర్లను సిఫారసు చేశారు. ప్రధానంగా చైర్మన్, వైస్–చైర్మన్ నియామకం విషయంలో రగడ మొదలయ్యింది. పెరుగు పురుషోత్తంరెడ్డి విషయంలో పాణ్యం నియోజకవర్గంతో పాటు కర్నూలు నియోజకవర్గానికి చెందిన పాతతరం టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన్ను చైర్మన్‌గా నియమించొద్దంటూ పార్టీ కార్యాలయం వద్ద గొడవ చేయడంతో పాటు జిల్లా అధ్యక్షుడికి తమ అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియజేశారు. అంతటితో ఆగకుండా విజయవాడకు వెళ్లి మరీ సీఎం కార్యాలయ (సీఎంవో) అధికారులతో పాటు పార్టీలోని ముఖ్య నేతలను కలిశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని కొత్త వారిని అందలం ఎక్కిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. వీరిని చల్లపరిచేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. మరోవైపు వైస్–చైర్మన్ నియామకం విషయంలో కూడా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారు. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి వైస్–చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఆక్షేపిస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని సమాచారం. ఫలితంగా రేసు నుంచి అబ్బాస్ పేరును తొలగించినట్టు తెలుస్తోంది. సీటుకో బేరం ఒకవైపు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరికొందరు నేతలు ఇదే అదనుగా రంగంలోకి దిగి వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పదవులు వచ్చేలా చేస్తామంటూ భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక నేత ఏకంగా కోటి రూపాయల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పదవి వచ్చే వ్యక్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం చేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇంత మొత్తాలను కూడా ఇచ్చి పదవి పొందేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారంటే.. ఏ మేరకు ఆదాయం ఉందో అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కర్నూలు మార్కెట్ కమిటీ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ మరింత హీటెక్కడం గమనార్హం. -
మరీ ఇంత బరితెగింపా?
* పార్టీ ఫిరాయింపు సభకు కలెక్టర్ భాగస్వామ్యం.. * కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి చేరిక సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన కలెక్టర్ సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఫిరాయింపుల్లో ఉన్నతాధికారులను సైతం భాగస్వామ్యం చేస్తున్నారు. దీనికి అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారు. అధికారులు సైతం హద్దులు దాటి స్వామిభక్తి ప్రదర్శించుకుంటున్నారు. ఇందుకు సజీవ సాక్ష్యం కర్నూలు జిల్లాలో శనివారం ఆవిష్కృతమైంది. ఏదో గ్రామస్థాయి.. మండలస్థాయి.. జిల్లాస్థాయి అధికారి కాదు.. ఏకంగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగి ఫిరాయింపు సభకు ఏర్పాట్లు చేయడం రాజకీయ వర్గాల్ని నివ్వెరపరిచింది. వైఎస్సార్సీపీ తరఫున కర్నూలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఈ చేరిక సందర్భంగా కర్నూలులో శనివారం ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి మరీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సభ ఏర్పాట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్ పార్టీ ఫిరాయింపు సభకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం హోదాలో చంద్రబాబు సభకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ వెళ్లారంటే అర్థం ఉంది.. కానీ పార్టీఫిరాయింపు సభ ఏర్పాట్లనే ప్రత్యేకంగా పర్యవేక్షించడం పట్ల ఐఏఎస్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ జిల్లా కలెక్టర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఎస్వీ: వైఎస్సార్సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సీఎం చంద్రబాబునాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
'చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. కర్నూలులో ఆదివారం ఆయన మాట్లాడుతూ....దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని చంద్రబాబు నీరుగార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంతపనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ మైనార్టీలకు మాత్రం నిధులు కేటాయించడం లేదని మోహన్‌రెడ్డి విమర్శించారు. -
ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కారు చోరీ
కర్నూలు : కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి స్కార్పియో వాహనం చోరీకి గురైంది. ఆయన నివాసంలో పార్క్ చేసిన వాహనాన్ని దుండగులు శుక్రవారం ఆర్థరాత్రి అపహరించుకు పోయారు. ఆ విషయాన్ని శనివారం ఉదయం గుర్తించిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కర్నూలు జిల్లా ఎస్పీ ఎ. రవికృష్ణ నివాసానికి కూతవేటు దూరంలోనే ఎస్వీ మోహన్‌రెడ్డి నివాసం ఉంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మూడు రోజుల క్రితమే స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశారు. కాగా కర్నూలు నగరంలో చోరీలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. చోరీలపై నగర ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాక్షాత్తూ ఎమ్మెల్యే వాహనమే చోరీకి గురికావడం సంచలనం సృష్టిస్తోంది. -
మునిగిపోయే నావ ఎవరెక్కుతారు?
వైఎస్సార్సీపీని వీడం... జగన్‌తోనే ఉంటాం తేల్చి చెప్పిన కర్నూలు ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: మునిగే నౌకలాంటి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన అవసరం తమకెంత మాత్రం లేదని కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేకతతో సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ యత్నా లు దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని పునరుద్ఘాటించారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, గుమ్మనూరు జయరామయ్య, యక్కలదేవి ఐజయ్యలు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీని వీడుతున్నట్లుగా కొన్ని చానెళ్లు, పత్రికలు అదే పనిగా శుక్రవారం ఉదయం నుంచీ చేస్తున్న ప్రచారమంతా సీఎం చంద్రబాబు ‘మైండ్‌గేమ్’ లో భాగమని వారు తెలిపారు. ఈ వార్తలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తమ పేర్లు పెట్టి వార్తలు ప్రసారం చే యడానికి, ప్రచురించడానికి ముందు తమతో మీడియా ప్రతినిధులు సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటామని, ఆయన నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రకటించారు. ఇక్కడకు రాని కొందరు ఎమ్మెల్యేలు జిల్లాల్లో తమపై వచ్చిన ప్రచారాలను ఖండిం చారన్నారు. భూమా నాగిరెడ్డికి తమ పార్టీ సముచిత ప్రాధాన్యతనిచ్చిందని, ప్రతిపక్షానికి వచ్చే ఏకైక అధికార పదవైన పీఏసీ చైర్మన్ పదవిని ఆయనకే ఇచ్చామని ఎస్వీ, బుడ్డాలు చెప్పారు. అంతకుముందు వారంతా పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలుసుకుని, జిల్లా సమస్యలను చర్చించారు. ఎమ్మెల్యేలవివరణ ఇలా... జగన్‌తో సాన్నిహిత్యం ఉంది: ఎస్వీ మేమంతా వైఎస్సార్సీపీ గుర్తు మీదే గెలిచాం. జగన్‌తో సాన్నిహిత్యం, ఆయన నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉన్నాయి. మేం పార్టీని వీడం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందువల్ల ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతూ ఉంది. పైగా ఆ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయింది. అందువల్ల ఇలాంటి ప్రచారాలను లేవదీస్తున్నారు. టీవీ చానెళ్లు కూడా వాళ్లకు నచ్చిన లక్కీ నెంబర్లతో ఇంతమంది, అంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారని ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. మీడియా వారికి ఒకటే విజ్ఞప్తి... దయచేసి ఇలాంటివేవైనా మీ దృష్టికి వచ్చినపుడు మాకు ఫోన్లు చేసి ఎంతవరకు నిజమో అడిగి తెలుసుకోండి. దుష్ర్పచారం దారుణం: ఎమ్మెల్యేలు తమకు సంబంధం లేకుండానే కొన్ని చానెళ్లు తమ ఫోటోలతో సహా టీవీల్లో చూపిస్తూ పార్టీ వీడుతున్నట్లు ప్రసారం చేయడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర రెడ్డి, జయరామయ్య, ఐజయ్య, గౌరు చరితలు అన్నారు. తామంతా ఎట్టి పరిస్థితుల్లో నూ జగన్ నేతృత్వంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అధికార పక్షంచేస్తున్న కుయుక్తులు తమవద్ద చెల్లవన్నారు. -
'కృష్ణా డెల్టాకు నీరందించడం కోసమే పట్టిసీమ'
కర్నూలు : అధికార పార్టీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రజలకు ఒరిగేది ఏం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలోని నదులను అనుసంధానం చేస్తే.. రాయలసీమ సస్యశ్యామలం అవుంతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రాజెక్టు కేవలం కృష్ణా డెల్టాకు నీరందించడం కోసమే కానీ, రాయలసీమకు ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానమనేది అప్పట్లోనే కాటన్ దొర ప్రారంభించినప్పటికీ.. టీడీపీ ప్రభుత్వం బడాయి కోసమే ఈ నదుల అనుసంధానమని వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైల జలాశయం నీటిమట్టం 854 అడుగులకు చేరక ముందే నీటిని వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో డబ్బులకు ఆశపడి వ్యవహరిస్తున్నారని కర్నూలు జిల్లా పరిషత్‌లో నదుల అనుసంధాన సదస్సులో పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే మండిపడ్డారు. రాయలసీమకు న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమించాలంటూ ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలకు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. -
చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ...
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బి.రాజశేఖరరెడ్డి, ఎస్వీ.మోహన్‌రెడ్డి, గౌరు. చరితారెడ్డి బుధవారం కర్నూలులో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అధికార పార్టీ మాత్రం తమ పార్టీనే టార్గెట్ చేస్తుందని వారు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ నేతలు దృష్టి పెట్టకుండా తమ నేతలపై అక్రమకేసులు పెట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. అలాగే టీడీపీ ప్రభుత్వానికి అధికారులు కొమ్ము కాస్తున్నారని... ఈ నేపథ్యంలో అధికారులను పార్టీలో చేర్చుకుంటే మంచిదని టీడీపీ నేతకు హితవు పలికారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడంపై వారు స్పందించారు. పుష్కరాలపై చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. -
'ఏపీలో సెక్షన్ 8 అమలు చేయాలి'
కర్నూలు: సెక్షన్ 8ను తెలంగాణ లో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఉంటూ చంద్రబాబు నాయుడు రాచరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షి అంశంలో న్యాయం చేయకపోగా టీడీపీ ఎమ్మెల్యే పక్షాన నిలబడటం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. అధికారులు, ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చట్టం తన పని తాను చేయకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. -
'డిప్యూటీ సీఎం ప్రకటన మేరకే మాపై కేసులు'
కర్నూలు: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటన మేరకే తమపై కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బలంతో పోలీసు కేసులు పెట్టి వైఎస్సార్ సీపీని అణిచేస్తామని గతంలో డిప్యూటీ సీఎం బహిరంగంగా ప్రకటన చేశారని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే అందరిమీదా కేసులు పెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇటీవల ఓ ఫ్లెక్సీ కాల్చారని ఆరోపిస్తూ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని.. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందన్న ఆక్రోశంతో నాయకులను భయపెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఇలా కేసులు బనాయిస్తుందన్నారు. అంతకుముందు భూమా నాగిరెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టారని.. ఇంతలోనే మళ్లీ కేసు పెట్టారన్నారు. తప్పుడు ఫిర్యాదుతోనే భూమాపై కేసు పెట్టారన్నాడు. ప్రభుత్వోద్యోగి మీద నేర పూరితంగా ఏమైనా చేస్తేనే సెక్షన్- 353 నమోదు చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించారని.. ఎందుకలా చేశారని అడిగితే అరిచి ఏం చేద్దామనుకుంటాన్నావని నాగిరెడ్డిని ఏకవచనంతో సంబోధించారన్నారు. అరెస్టు చేయమంటావా అని బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో నాగిరెడ్డి కూడా దీటుగా మాట్లాడారే తప్ప వాళ్లను తిట్టింది లేదన్నారు. ప్రభుత్వం పెట్టే కేసులకు కర్నూలు జిల్లాలో ఏ నాయకుడూ, కార్యకర్తా కూడా భయపడరని తెలిపారు. కేసులకు భయపడే వాళ్లు ఈ జిల్లాలో రాజకీయాల్లో రారని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై తాను అసెంబ్లీ హక్కుల తీర్మానాన్నిప్రవేశపెడతామన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టుపై శనివారం ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. -
సవరణ ప్రసారం చేయండి.. లేకుంటే ఫిర్యాదు
-
సవరణ ప్రసారం చేయండి.. లేకుంటే ఫిర్యాదు
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము పోటీ నుంచి తప్పుకొంటున్నామంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై వెంటనే సవరణ వార్తలను ఏబీఎన్ చానల్ ప్రసారం చేయాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. -
'బాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, కె.శ్రీనివాసులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసుతో టీడీపీని భ్రష్టు పట్టించి రాష్ట్రం పరువు తీసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కర్నూలు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అక్రమాలతో టీడీపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 80 మంది ఓటర్లు అధికంగా ఉన్నా.. అక్రమంగా గెలవాలనే టీడీపీ కర్నూలు జిల్లాలో పోటీ చేస్తోందని మండిపడ్డారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలోని ప్యాపిలి, డోన్‌లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను బెదిరించి వేలి ముద్రలను వేయించి ఓట్లు వేయించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. -
టీడీపీని చిత్తుగా ఓడించండి
జిల్లాలో ఆ పార్టీకి బలం లేదు చంద్రబాబుది ద్వంద్వ విధానం ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోయారు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీని చిత్తుగా ఓడించాలని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో తన నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే వైఎస్సార్సీపీ అభ్యర్థి డి. వెంకటేశ్వరరెడ్డి విజయానికి కారణమవుతున్నాయన్నారు. దళితులను అవమానిస్తూ ఎస్సీ నియోజకవర్గాల్లో ఓసీలను ఇన్చార్జిలుగా నియమించడం, సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో టీడీపీలో కలకలం రేగిందన్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం పార్టీని చిత్తచిత్తుగా ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించడం బాధాకరమన్నారు. తమ పార్టీలో 11మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో పాటు వైఎస్సార్సీపీ తరఫున ఎంపికైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఐక్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రాలో ఒక విధంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పదన్నారు. అవినీతి పార్టీకి ఓటు వేయొద్దు: ఎస్వీ అవినీతి ఊబిలో కూరుకొని పోయిన టీడీపీకి ఓటు వేసి, దానిని నిరుపయోగం చేసుకోవద్దని టీడీపీకి చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు నీతులు మాట్లాడే అర్హత లేదన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 86 ఓట్లు మైనస్ ఉంటే ఎలా అభ్యర్థిని రంగంలోకి దించుతారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభావితం ఏ మాత్రం చేయని తెలంగాణలోనే ఒక ఓటుకు రూ.5కోట్లు ఖర్చు చేశారని, ప్రభుత్వం ఉన్న చోట ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో అర్థమవుతుందని ఆయన అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సహకారంతో తాను విజయం సాధిస్తానని వెంకటేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభపెట్టే అవకాశాలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతినిజాయితీ గురించి సమావేశాల్లో పదేపదే మాట్లాడుతుండటంపై కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవహారశైలి శోచనీయంగా ఉందన్నారు. ఆదివారం కర్నూలులో పార్టీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి సంఖ్యాబలం ఉన్న చోట పోటీ పెట్టకుండా ఉండాని వారు సూచించారు. అలాగే వైఎస్ఆర్ సీపీ సంఖ్యా బలం తక్కువగా ఉన్న చోట పోటీకి నిలబడటం లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒంగోలు, కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీకి సంఖ్యా బలం ఉందని వారు స్పష్టం చేశారు. అయితే కర్నూలు జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభపెట్టే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు, పోలీసులపై నమ్మకం లేదన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రాయలసీమను ఎడారి చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిని ఎడాపెడా వాడేయడం ద్వారా రాయలసీమను ఎడారి చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పరిస్థితికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లే కారణమని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 800 అడుగులకు పడిపోయిందన్నారు. జలాశయాల నీటిని తాగు, సాగునీటి అవ సరాలు తీరాక, విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాల్సి ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ దీన్ని విస్మరించి సీమకు ద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. రిజర్వాయర్‌లో కనీసం 854 అడుగులైనా నీళ్లు లేకుంటే సీమకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. బాబుకు రాయలసీమపై ప్రేమ లేదని, ఆయనదంతా కపట ప్రేమేనని విమర్శిం చారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లిస్తామంటున్న వ్యక్తి ఆ ప్రాంతానికి నీటిని తీసుకువెళ్లేందుకు అవకాశం ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు భారీగా నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సీమ అభివృద్ధి కోసమే తాను అనంతపురంలో పుట్టిన రోజు పండుగ చేసుకున్నానని సీఎం చెబితే చాలదని, ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించాలన్నారు. పుట్టినరోజులు, బారసాలలు నిర్వహించుకుంటే సీమ అభివృద్ధి జరుగుతుందా? అని ఆయన ఎద్దేవాచేశారు. రాయలసీమలో వచ్చే ఆదాయంతో రాజధాని నిర్మాణాన్ని నిర్మించడంపై మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాయలసీమలో లభించే ఎర్రచందనం వేలం ద్వారా రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోందని, ఆ మొత్తాన్ని రాజధానికి కాకుండా తమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
'ఎవరబ్బ సొత్తని నీళ్లు వాడుకుంటున్నారు'
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి శ్రీశైలం డ్యామ్ ను ఎండిపోయే స్థితికి తీసుకొచ్చారని వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎమ్ఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ లో నీటిమట్టం 800 అడుగులకు పడిపోయిందని, గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కలిసి నీళ్లు ఎడాపెడా వాడుతున్నారని విమర్శించారు. రాయలసీమను ఎడారిగా చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎవరబ్బ సొత్తని నీళ్లు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇతర దేశాల్లో ఇలా వ్యవహరిస్తే ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపేవారని తెలిపారు. ఇద్దరు సీఎం లు తక్షణమే స్పందించి రాయలసీమను ఆదుకోవాలని సూచించారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు, ఆ ప్రాంతానికే ఆన్యాయం చేస్తున్నారన్నారు. రాయలసీమతో నిధులతో మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులను రాయలసీమకే ఖర్చుపెట్టాలని ఏస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
'ఎవరబ్బ సొత్తని నీళ్లు వాడుకుంటున్నారు'
-
ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత
ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును కొట్టివేస్తూ కర్నూలు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాజ్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు మంగళవారం తీర్పు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్వీ అనుచరులు బాణసంచా కాల్చారని కేసు నమోదు చేశారు. కోర్టులో ఎస్వీపై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. -
'వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికాబద్ధంగా లేదు'
కర్నూలు : ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికబద్ధంగా లేదని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. రైతు రుణమాపీ సెకండ్ ఫేజ్ ఏలా చేస్తారో చెప్పకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. శనివారం కర్నూలు సీక్యాంప్ సెంటర్ రైతు బజార్లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బజారులో సౌకర్యాలు కల్పించాలని ఈవోను ఆదేశించారు. అలాగే వినియోగదారుల నుంచి కూడా సలహాలు తీసుకోవాలని ఈవోకు ఎస్వీ మోహన్‌రెడ్డి సూచించారు. -
'బాబుకు విదేశీ కన్సల్టెన్సీలపై మోజు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కన్సల్టెన్సీల ప్రభుత్వమనే అనుమానం కలుగుతోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్ఎల్ఏ ఎస్వీమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు విదేశీ కన్సల్టెన్సీలంటే ఎందుకంత మోజో తెలియడం లేదన్నారు. మన దేశంలో నిపుణులు లేరా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు, ఉన్నతాధికారులు నిపుణులను పక్కన పెట్టడం వారిని అవమానించడమే అన్నారు. కన్సల్టెన్సీల కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇది కన్సల్టెన్సీల ప్రభుత్వమా..!
-
'ఆయన వంచనకు మారుపేరు'
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసానికి, వంచనకు మారు పేరని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మెహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ...టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో రూ.80 కోట్ల అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ అపర భగీరథుడు కనుకే జలయజ్ఞాన్ని చేపట్టారని గుర్తు చేశారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే sv మోహన్‌రెడ్డి
-
‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి
* కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ * సింగపూర్‌కు వందెకరాలివ్వడం దారుణం సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిస్తున్న నిత్యావసర సరుకుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విజిలెన్స్ శాఖతో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘చంద్రన్న కానుక’కు టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.280 కోట్లలో 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ పథకం కింద ప్రజలకు సరఫరా చేస్తున్న మొత్తం ఆరు రకాల సరుకుల మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కందిపప్పు, బెల్లం, నెయ్యి మార్కెట్ ధరలకు, టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలకు బాగా వ్యత్యాసం ఉందని చెప్పారు. సరుకులన్నీ పెట్టి ఇచ్చే గిఫ్ట్ సంచుల్లో కూడా భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఒక గిఫ్ట్ సంచి ధర మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 ఉంటే ప్రభుత్వం దాన్ని రూ.11.60 పైసలకు కొనుగోలు చేసిందని చెప్పారు. సంచుల కొనుగోలులో రూ.8 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందన్నారు. చౌక డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడానికి ప్రజలు సొంత సంచులను తీసుకెళుతుంటారని, అలాంటప్పుడు ప్రభుత్వం గిఫ్ట్ సంచులను ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఓ మంత్రి అనుచరుడికి దోచి పెట్టడానికే ఈ సంచులను కొనుగోలు చేశారన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ సంచుల కొనుగోలుకు ఎందుకు తగలేశారని ప్రశ్నించారు. కందిపప్పులో రూ.12 కోట్లు, నెయ్యి కొనుగోలులో రూ.26 కోట్లు, సంచుల్లో రూ.8 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇవిగాక బెల్లాన్ని కూడా మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థకు, తెలుగు తమ్ముళ్లకు, ఎన్నికల్లో తనకు నిధులు సమకూర్చినవారికి ఆర్థికలబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం ఉపయోగపడిందని పేర్కొన్నారు. దీన్ని ప్రజలకిచ్చిన చంద్రన్న కానుక అనాలా లేక చంద్రబాబు హెరిటేజ్‌కు, తెలుగు తమ్ముళ్లకు ఇచ్చిన పండుగ కానుక అనాలా.. అని ఎద్దేవా చేశారు. చంద్రన్న కానుక వ్యవహారం చూస్తే పోకిరి సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం బిచ్చగాడికి అర్ధరూపాయి వేసి పండుగ చేస్కో.. అన్నట్లుగా ఉందన్నారు. సంక్రాంతికి రైతుల ఇళ్లకు అల్లుళ్లు, కు మార్తెలు, బంధువులంతా వస్తారని, ఏ ఇంట్లో నూ పదిమందికి తక్కువుండరని.. వారు వంటలు వండుకోవడానికి ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి సరుకులు ఏంసరిపోతాయని ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీకి వందెకరాల భూమి ఇవ్వడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఉచిత సేవలందించడానికి సింగపూర్ కంపెనీలేమైనా మనకు బంధువులా అని తొలుత కూడా తాము ప్రశ్నించామని, ఈ వందెకరాలు ఇస్తుంటే అసలు విషయం బయటపడుతోందని ఆయన చెప్పారు. -
గోరంత సాయం.. కొండంత ప్రచారమా!
రైతులు, మహిళల కుటుంబాల్లో చీకట్లు నింపి చంద్రబాబు మాత్రం సంక్రాంత్రి చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక, పంటలు పండక రైతులు కష్టాల్లో ఉంటే ఆయనకు మాత్రం పండుగ వెలుగులు కావాల్సి వచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా అని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సంక్రాంతి వెలుగులు కేవలం తెలుగు తమ్ముళ్లు, టీడీపీ నేతలకేనని.. ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రన్న కానుక పేరుతో గోరంత సాయం చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బ్రహ్మానందం సినిమాల్లో కామెడీ చేస్తుంటే..చంద్రబాబు ప్రజలను కామెడీ చేస్తున్నారని తెలిపారు. చంద్రన్న కానుక పేరుతో రూ. 60 నుంచి రూ.70 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంటే ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతోందని మోహన్ రెడ్డి విమర్శించారు. -
'ఉద్యోగాల భర్తీలో చర్యలు ఏవి?'
-
'ఉద్యోగాల భర్తీలో చర్యలు ఏవి?'
హైదరాబాద్: రిజర్వేషన్లు లేకుండా ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నాలుగో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి. సభలో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, లేకుంటే పాఠశాలలు మూతపడే ప్రమాదముందని ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. ఖాలీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఏమైందని మోహన్ రెడ్డి నిలదీశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి సభలో మాట్లాడారు. -
'వారిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు?'
కర్నూలు : టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ భూమా నాగిరెడ్డిపై ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు టీడీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశిస్తే తప్ప నంద్యాల మున్సిపల్ చైర్మన్, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తదితరులపై కేసులు నమోదు చేయలేదని ఎస్వీ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసులు నమోదైనా వారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
'భూమాపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషం'
కర్నూలు : నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషమని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భూమా నాగిరెడ్డిపై పోలీసులు రెండు హత్యాయత్నం కేసులు, ఒక అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ఆస్తులు పెంచుకునేందుకే విజయవాడలో రాజధాని
కర్నూలు: ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలతో కలసి కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. భౌగోళికంగా రాజధాని ఏర్పాటుకు విజయవాడ అనువైన ప్రాంతంకాదని సర్వేలు వెల్లడించినా సీఎం ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. 45 అంతస్తుల భవనాలు ఆ ప్రాంతంలో నిర్మిస్తే ఎప్పటికైనా ప్రమాదమని, జరగరాని ప్రమాదం చోటు చేసుకుంటే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాజధానిగా కర్నూలుకు అన్ని అర్హతలున్నా కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించగానే రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో బల్లలు చరిచి హర్షం వెలిబుచ్చడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదన్నారు. ప్రజలను మోసగించేందుకే సీఎం మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదని మోహన్‌రెడ్డి హెచ్చరించారు. -
రాజకీయాలకు అతీతంగా రాజధాని ఉద్యమం
కర్నూలు(అర్బన్): కర్నూలును రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా నేతలు కలసిరావాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజధాని కోసం స్థానిక శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో చేపట్టిన 72 గంటల దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అంశంపై మాట్లాడేందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదన్నారు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని సాధ్యం కాదని శివరామకృష్ణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసినా.. చంద్రబాబు అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ టి.శేషఫణి మాట్లాడుతూ రాజధాని సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ మాట్లాడుతూ కర్నూలును రాజధానిగా ప్రకటించకపోతే చంద్రబాబును కర్నూలులో తిరగనివ్వబోమన్నారు. బలమైన విద్యార్థి ఉద్యమాలను చేపడతామన్నారు. విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ, రాయలసీమ నిర్మాణ సమితి అధ్యక్షుడు జనార్దన్, ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె.బలరాం తదితరులు ఉద్యమకారులకు సంఘాభావం తెలిపారు. దీక్షలో రాయలసీమ ప్రజా సమితి అధ్యక్షుడు కందనూలు క్రిష్ణయ్య, పీడీఎస్‌యూ నాయకులు ఈ.శ్రీనివాసులుగౌడ్, రైతు కూలీ సంఘం నాయకులు బి.సుంకన్న, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, నాయకులు మధు, సురేష్‌చౌదరి, పి.వెంకటేష్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా సామూహిక నిరాహార దీక్షలను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలోని ఉద్యమకారులను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. -
రాజధాని సాధన కోసం కదంతొక్కిన కర్నూలు వాసులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడుగులన్నీ ఒక్కటయ్యాయి.. నినాదాలు మార్మోగాయి.. రాజధాని కోసం ఊరూవాడ ఏకమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు.. ఇలా అన్ని రంగాల వారు కదం తొక్కారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. సోమవారం కర్నూలు నగరంలో నిర్వహించిన పొలికేకను విజయవంతం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో కర్నూలుకు న్యాయం జరుగుతుందని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే ఎదురవుతోంది. రాజధాని ఏర్పాటుపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారు. దీంతో రాజధాని సాధన కోసం కర్నూలులో ఉద్యమం ఊపందుకుంది. ఈనెల ఒకటిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌంటేబుల్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం ఉద్యమించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆ రోజే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటవగా కన్వీనర్‌గా కట్టమంచి జనార్దన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. అందుకు టీడీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీ నేతలు, విద్య, ఉద్యోగ, రైతు, వివిధ వర్గాలు, సంఘాలు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా గతంలో విద్యా సంస్థల బంద్‌చేసి విజయవంతం చేశారు. అయితే టీడీపీ నేతల ఒత్తిడితో కొందరు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. పొలికేక విజయవంతం.. రాయలసీమ పొలికేక పేరుతో రాజధాని ఉద్యమం ఊపందుకుంది. కర్నూలులో సోమవారం వివిధ వర్గాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. దీనిని విజయవంతం చేసేందుకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కట్టమంచి జనార్దన్ రెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల యజమాని పుల్లయ్య, వివిధ విద్యా సంస్థలు, విద్యార్థులు కృషి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, గౌరు చరితారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు రామయ్య, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో నిర్వహించిన పొలికేక ర్యాలీలో ‘కర్నూలును రాజధానిని చేయాలి’ అనే డిమాండ్‌తో ముందుకు సాగారు. రాయలసీమ జిల్లా వ్యాప్తంగా.. రాజధాని ఉద్యమం ఒక్క కర్నూలుకే పరిమితం కాకుండా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలతో పాటు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆగస్టు 15 తరువాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నాయకులు, వివిధ వర్గాల వారితో సమావేశం ఏర్పాటు చేయాలని రాజధాని సాధన కమిటీ భావిస్తోంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం రాయలసీమ జిల్లాలో ఎంత విజయవంతమైందో అదే స్థాయిలో ఈ ఉద్యమం కూడా నిర్వహించాలని జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడిని కూడా కలిసి కర్నూలుకు జరిగిన అన్యాయం గురించి వివరించేందుకు సిద్ధమయ్యారు. -
రాజధాని మనహక్కు..
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలును రాజధాని చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలులో మహాసభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య తదితరులు హాజరయ్యారు. రాజధాని మనహక్కు.. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలునే రాష్ట్ర రాజధాని చేయాలని హైకోర్టు న్యాయమూర్తి కె. లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సి.క్యాంపులోని లలిత కళా సమితిలో రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె. లక్ష్మణరెడ్డి హాజరై మాట్లాడారు. రాజధాని సాధన కోసం ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అనంతరం పలువురు మేధావులు మాట్లాడుతూ ‘మన రాజధాని మన హక్కు’ అనే నినాదంతో ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. - కర్నూలు(విద్య) రాజధానిని చేయాలని సోనియా భావించారు రాష్ట్ర విభజన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ఒకప్పటి రాజధానిగా ఉన్న కర్నూలులోనే తిరిగి రాజధాని ఏర్పాటు చేయాలని తలంచారు. కానీ కోస్తాలోని నాయకులు సోనియాను తికమక పెట్టి రాజధానిని మనకు రానీయకుండా చేశారు. -విజయ్‌కుమార్‌రెడ్డి, చాంబర్ కామర్స్ జిల్లా అధ్యక్షులు పోలవరంలాంటి ప్రాజెక్టు సాధించాలి రాజధాని కోసం ప్రత్యేకంగా పోరాటం చేయాలి. పోలవరం లాంటి ప్రాజెక్టును సాధించుకోవాలి. మనకు అపారమైన నీటివనరులు ఉన్నాయి. కానీ వాటిపై హక్కులేకుండా పోయింది. ఈ మేరకు జులై 2న నంద్యాలలో మేధావులతో సమావేశం ఏర్పాటు చే సి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాము. -బొజ్జా దశరథరామిరెడ్డి, నంద్యాల రాజధానికి కర్నూలే అనుకూలం కర్నూలు రాజధాని ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం. శ్రీబాగ్ ఒప్పందంలో కూడా కర్నూలును రాజధానిగా చేయాలని సూచించారు. జిల్లాలో భూమి, నీరు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించవు. అందువల్ల కర్నూలును రాజధానిగా చేయాలి. -ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే అభివృద్ధి చెందిన కోస్తాలో రాజధాని ఎందుకు కోస్తావారు సీమ కంటే బాగా అభివృద్ధి చెంది ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చూడటం భావ్యం కాదు. క ర్నూలులోనే రాజధానిని ఏర్పాటు చేయాలి. సీఎం చంద్రబాబునాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపాలి. -బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డోన్ ఎమ్మెల్యే -
శవరాజకీయాలు మానుకో..:ఎస్వీ మోహన్‌రెడ్డి
సోమిశెట్టికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హితవు కర్నూలు, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం తెలుగుదేశం పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి శవరాజకీయాలు చేయడం తగదని టీడీపీ జిల్లా అద్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎస్వీ హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత శోభానాగిరెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గౌరవ వందనం సమర్పించడాన్ని సోమిశెట్టి వెంకటేశ్వర్లు వివాదం చేయడం అర్ధరహితమన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం ప్రధాని అధికారిక నివాసంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు నిర్ణయానికి ముందే శోభానాగిరెడ్డి అంత్యక్రియలు జరిగాయన్న వాస్తవ విషయాన్ని సోమిశెట్టి గ్రహించాలని సూచించారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిన రెండు గంటల తర్వాత కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అమలులోకి వచ్చిందని ఎస్పీ రఘురాంరెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఈ అంశంపై రాద్ధాంతం చేయడం సోమిశెట్టి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. చనిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిందంటే ప్రజల్లో ఆమె పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారంటే ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. రెండు లోక్‌సభ, 11 శాసనసభ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో ఆలోచించి పార్టీని పటిష్టం చేసుకునే దిశగా ఆలోచించకుండా శోభానాగిరెడ్డి అంత్యక్రియల అంశాన్ని రాద్ధాంతం చేయడం తగదని విమర్శించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు చీము నెత్తురు ఉంటే జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఓడిపోయినందుకు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినందున జిల్లా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారో సోమిశెట్టి ప్రకటిస్తే బాగుంటుందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అనవసర విషయాలను రాద్ధాంతం చేస్తే జిల్లాలో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు. -
యువత ఓట్లన్నీ వైఎస్సార్సీపీకే : ఎస్వీ
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: యువకుల్లో అత్యధిక శాతం వైఎస్సార్సీపీవైపే చూస్తున్నారని పార్టీ కర్నూలు అసెంబ్లీ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 44వ వార్డు రోజా వీధికి చెందిన అక్రమ్, జిలానీ ఆధ్వర్యంలో సమీర్, ఉస్మాన్, తౌఫిక్, గౌస్‌పీర్, ఇద్దూ, చాంద్, రహిమాన్‌తో పాటు మరో 300 మంది యువకులు, 20వ వార్డు జోహరాపురానికి చెందిన తిరుపతయ్య, అయ్యస్వామి, రాముడు, శేఖర్, బాలు, యోగి, రాజు, శివ, ప్రసాద్, సుధాకర్, మరో 50 మంది మాలగేరి వాసులు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఒకటో వార్డుకు చెందిన బేస్త నవీన్, మాబు, చంటి, భరత్, తేజ, చిన్న, అశోక్, మాను, శ్రీను, మరో 100 మంది ఎస్వీ నివాసంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం వైఎస్సార్ ఎన్నో పథకాలు అమలు చేశారని, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన బాటలో నడుస్తున్నారని తెలిపారు. రాజన్న పాలన మళ్లీ రావాలంటే జగన్ సీఎం కావాల్సి ఉందన్నారు. వరుసగా జరిగే అన్ని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
మైనార్టీలకు విద్యా ప్రదాత వైఎస్సే
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: విద్య, ఉద్యోగ రంగాల్లో నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లిం మైనార్టీల విద్యాప్రదాతగా వైఎస్సార్ ఘనత వహించారని వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం కల్పించి ఉన్నత చదువులకు సహకరించారన్నారు. ఆయన చేసిన మేలును ఎవరూ మరిచిపోలేరని, పార్టీ అభ్యర్థులను అఖండా మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు. కర్నూలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన స్వీటి, రోస్, దావూద్ ఆధ్వర్యంలో నూర్జహాన్, ఫాతిమా, షాహిన్, షాహిదా, పర్విన్, జమీలా, హసీనా, ఫర్జానా, మస్తాన్‌బీ, మరో 150 మంది మైనారిటీ మహిళలు పార్టీలో చేరారు. 20వ వార్డు జోహరాపురానికి చెందిన ముర్తుజావలి ఆధ్వర్యంలో కె.నాగరాజు, రమణ, శ్రీరాములు, చరణ్, మార్క్, డేవిడ్, అలీ, నాగరాజు, రాఘవేంద్ర, మరో 150 మంది ఇందిరమ్మ గృహాలు పొందిన మహిళలు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. పార్టీ మహిళా విభాగం సిటీ కన్వీనర్ ముంతాజ్, సమీర్, చాంద్, రఘు ఆధ్వర్యంలో 12, 14 వార్డులకు చెందిన సుమారు 100 మంది యువకులు పార్టీలో చేరారు. వీరందరూ నగరంలోని ఎస్వీ నివాసంలో గురువారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని ఎస్వీ అన్నారు. కార్యక్రమంలో సయ్యద్ జహీర్‌బాషా,, అజర్, ఇర్ఫాన్, యాసిర్, జావీద్, కాశిక్, జాకీర్ పాల్గొన్నారు. -
జగన్ నాయకత్వానికే జనం మొగ్గు
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ ఆశయ సాధనకు పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికే జనం మొగ్గు చూపుతున్నారని వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహ న్‌రెడ్డి అన్నారు. జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలంతా వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ విజయంతో గెలిపిస్తారని ధీమాగా చెప్పారు. నగరంలోని నాలుగు వార్డుల నుంచి సుమారు 300 మంది సోమవారం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. 15వవార్డుకు చెందిన మగ్బూల్, ఇబ్రాహిం, ఇంతు, షఫి, మహబూబ్, సద్దాం, హనీఫ్ తదితర 110 మంది, 10వవార్డుకు చెందిన సలీం, అబ్దుల్లా, అప్సర్‌బాషా, ఇస్మాయిల్‌మియా, ఖాదర్‌బాషా, ఖాజాబాషా, ఫారుక్‌బాషా తదితర 50 మంది వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మహ్మద్‌గౌస్, మాలిక్‌బాషా ఆధ్వర్యంలో 7వవార్డుకు చెందిన 60 మంది యువకులు, మహబూబ్‌పాషా, ఖలీల్, జహీర్ ఆధ్వర్యంలో 12వ వార్డుకు చెందిన 50 మంది మహిళలు, 30 మంది యువకులు పార్టీలో చేరారు. వీరంతా నగరంలోని ఎస్వీ మోహన్‌రెడ్డి నివాసంలో సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎస్వీ మోహన్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను రూపొందించగా తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్రెడ్డి ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మెనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి మేనిఫెస్టో అమలు కోసం చర్యలు తీసుకుంటారన్నారు. ఆ విధంగా అందరి సమస్యలు తీరిపోతాయని ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. -
ఫోన్లు చేయించుకొని ప్రాణహాని అంటావా?
కర్నూలు: తమను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే టీజీ వెంకటేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. సొంత మనుషులతో ఫోన్లు చేయించుకొని తనకు ప్రాణహాని ఉందంటూ టీజీ వెంకటేష్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని అవాస్తవాలు చెప్తున్నారని అన్నారు. కర్నూలు నగరాన్ని సొంత డబ్బుతో అభివృద్ధి చేసినట్టు టీజీ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. వరద సహాయ నిధులను ఆయన దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని టీజీ వెంకటేష్ నిన్న అన్నారు. -
వైఎస్ఆర్ పాలనలో మైనారిటీల సంక్షేమం
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనా కాలంలో మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్ఆర్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 9వ వార్డు బండిమెట్టకు చెందిన ఇమ్రాన్ ఖాన్, అయ్యూబ్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్, మహబూబ్, వలి, నజీర్, చాంద్, జమీల్, అబ్దుల్ సలీమ్, షేక్షా, బాబులతో పాటు మరో 80 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే 20వ వార్డుకు చెందిన యూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్, చందు, నటరాజ్, హరి, మధు, వెంకటేశ్, నాగేంద్ర, వలి, మహేశ్‌తో పాటు మరో 150 మంది స్థానికులు పార్టీ తీర్థ పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని తెలిపారు. తండ్రిబాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే సువర్ణ పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
వైఎస్ఆర్సీపీని గెలిపించాలి వార్డు ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఎస్వీ మోహన్‌రెడ్డి కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని నియోజకవర్గ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన వార్డు ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యంతో ముందుకెళుతున్నారని తెలిపారు. జననేత అధికారంలోకి వస్తే తిరిగి వైఎస్ పాలన అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కార్యక్రమంలో నగరానికి చెందిన 11, 15 వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.