
ఆగ్రహ జ్వాల
కర్నూలులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ని యోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు
కర్నూలులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ని యోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పెద్దల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నంద్యాల చెక్‌పోస్టు వద్ద వైఎస్‌ఆర్‌సీపీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు రాకపోకలు నిలిచిపోయాయి.
నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమానాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
ఆదోనిలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్‌కు సహకరించాలని ప్రజల్ని కోరారు. ఓవర్‌బ్రిడ్జి సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ‘సోనియా డౌన్.. డౌన్’ అంటూ నినాదాలు చేశారు.