
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించాలి
వార్డు ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఎస్వీ మోహన్‌రెడ్డి
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని నియోజకవర్గ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన వార్డు ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పార్టీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యంతో ముందుకెళుతున్నారని తెలిపారు. జననేత అధికారంలోకి వస్తే తిరిగి వైఎస్ పాలన అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కార్యక్రమంలో నగరానికి చెందిన 11, 15 వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.