కర్నూలు : ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికబద్ధంగా లేదని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి విమర్శించారు. రైతు రుణమాపీ సెకండ్ ఫేజ్ ఏలా చేస్తారో చెప్పకుండానే బడ్జెట్ను ప్రవేశపెట్టారని ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. శనివారం కర్నూలు సీక్యాంప్ సెంటర్ రైతు బజార్లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అనంతరం వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బజారులో సౌకర్యాలు కల్పించాలని ఈవోను ఆదేశించారు. అలాగే వినియోగదారుల నుంచి కూడా సలహాలు తీసుకోవాలని ఈవోకు ఎస్వీ మోహన్రెడ్డి సూచించారు.