
సవరణ ప్రసారం చేయండి.. లేకుంటే ఫిర్యాదు
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము పోటీ నుంచి తప్పుకొంటున్నామంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
దీనిపై వెంటనే సవరణ వార్తలను ఏబీఎన్ చానల్ ప్రసారం చేయాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.