
'ఆయన వంచనకు మారుపేరు'
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసానికి, వంచనకు మారు పేరని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మెహన్రెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ...టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో రూ.80 కోట్ల అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ అపర భగీరథుడు కనుకే జలయజ్ఞాన్ని చేపట్టారని గుర్తు చేశారు.