
'వారిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు?'
కర్నూలు : టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ భూమా నాగిరెడ్డిపై ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు టీడీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కోర్టు ఆదేశిస్తే తప్ప నంద్యాల మున్సిపల్ చైర్మన్, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తదితరులపై కేసులు నమోదు చేయలేదని ఎస్వీ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసులు నమోదైనా వారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.