పత్తికొండలో నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, రామచంద్రారెడ్డి నాయకత్వం వహించారు.
కర్నూలులో నియోజకవర్గసమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
పత్తికొండలో నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, రామచంద్రారెడ్డి నాయకత్వం వహించారు.
నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాల మేరకు బైక్ ర్యాలీ నిర్వహించాచరు.
మంత్రాలయంలో స్థానిక నాయకులు భీమిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేష్ శెట్టి ఆధ్వర్యంలో కర్ణాటక, కర్నూలు రహదారిని దిగ్బంధించారు.
ఆదోనిలో పార్టీ కార్యాలయం నుంచి మోటర్ సైకిళ్లతో భీమా సర్కిల్ చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు. పార్టీ నాయకులు డాక్టర్ మధుసూదన్ ,చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాదరావు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ఆలూరులో నియోజకవర్గసమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
ఆళ్లగడ్డలో బీవీ.రామిరెడ్డి, బనగానపల్లెలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబోతుల ఉదయ భాస్కర్‌రెడ్డి, కాటసాని ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాగింది.
ఆత్మకూరులో స్థానిక నాయకులు ఇస్కాల రమేష్, ఏర్వ రామచంద్రారెడ్డి నాయకత్వం వహించారు.
ప్యాపిలిలో రామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాతబస్టాండ్ నుంచి కింది గేరి వరకు ర్యాలీ సాగింది.
పాణ్యంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త మణిగాంధీ ఆధ్వర్యంలో నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీక్యాంప్, గుత్తిరోడ్డు, కృష్ణానగర్, చెన్నమ్మ సర్కిల్, రాజ్‌విహార్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు.