ఎన్టీఆర్‌పై కేసు ఎందుకు పెట్టలేదు? | Ram Gopal Varma Respond On SV Mohan Reddy Complaint | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు రాంగోపాల్‌ వర్మ కౌంటర్‌

Published Fri, Dec 28 2018 3:47 PM | Last Updated on Fri, Dec 28 2018 3:55 PM

Ram Gopal Varma Respond On SV Mohan Reddy Complaint - Sakshi

తనపై కేసు పెట్టిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ గట్టి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించారన్న ఆరోపణలతో కర్నూలు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మోహన్‌రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌’  సినిమాలోని వెన్నుపోటు పాటలో చంద్రబాబును కించపరిచారని తన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు.

దీనిపై తాజాగా వర్మ స్పందించారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎన్టీఆర్‌పై ఎందుకు కేసు పెట్టలేదని ఎస్వీ మోహన్‌రెడ్డిని ట్విటర్‌లో వర్మ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ బతికుండగా ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. (రాంగోపాల్‌ వర్మపై ఫిర్యాదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement