
యువత ఓట్లన్నీ వైఎస్సార్‌సీపీకే : ఎస్వీ
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: యువకుల్లో అత్యధిక శాతం వైఎస్సార్‌సీపీవైపే చూస్తున్నారని పార్టీ కర్నూలు అసెంబ్లీ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.
నగరంలోని 44వ వార్డు రోజా వీధికి చెందిన అక్రమ్, జిలానీ ఆధ్వర్యంలో సమీర్, ఉస్మాన్, తౌఫిక్, గౌస్‌పీర్, ఇద్దూ, చాంద్, రహిమాన్‌తో పాటు మరో 300 మంది యువకులు, 20వ వార్డు జోహరాపురానికి చెందిన తిరుపతయ్య, అయ్యస్వామి, రాముడు, శేఖర్, బాలు, యోగి, రాజు, శివ, ప్రసాద్, సుధాకర్, మరో 50 మంది మాలగేరి వాసులు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఒకటో వార్డుకు చెందిన బేస్త నవీన్, మాబు, చంటి, భరత్, తేజ, చిన్న, అశోక్, మాను, శ్రీను, మరో 100 మంది ఎస్వీ నివాసంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం వైఎస్సార్ ఎన్నో పథకాలు అమలు చేశారని, ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన బాటలో నడుస్తున్నారని తెలిపారు. రాజన్న పాలన మళ్లీ రావాలంటే జగన్ సీఎం కావాల్సి ఉందన్నారు. వరుసగా జరిగే అన్ని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.