ఫోన్లు చేయించుకొని ప్రాణహాని అంటావా?
కర్నూలు: తమను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే టీజీ వెంకటేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. సొంత మనుషులతో ఫోన్లు చేయించుకొని తనకు ప్రాణహాని ఉందంటూ టీజీ వెంకటేష్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
తనకు ప్రాణహాని ఉందని అవాస్తవాలు చెప్తున్నారని అన్నారు. కర్నూలు నగరాన్ని సొంత డబ్బుతో అభివృద్ధి చేసినట్టు టీజీ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. వరద సహాయ నిధులను ఆయన దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని టీజీ వెంకటేష్ నిన్న అన్నారు.